హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC Life: హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌ నుంచి అదిరిపోయే ఇన్సూరెన్స్ ప్లాన్.. బెనిఫిట్స్‌ ఇవే!

HDFC Life: హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌ నుంచి అదిరిపోయే ఇన్సూరెన్స్ ప్లాన్.. బెనిఫిట్స్‌ ఇవే!

HDFC Life

HDFC Life

HDFC Life: చాలా మంది భవిష్యత్తులో ఎదురయ్యే అనుకోని ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకుంటారు. ప్రస్తుతం భద్రతతోపాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందించే ప్రొడక్టులను ఆయా కంపెనీలు లాంచ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఒక కొత్త ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చాలా మంది భవిష్యత్తులో ఎదురయ్యే అనుకోని ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (Life Insurance) పాలసీలు తీసుకుంటారు. ప్రస్తుతం భద్రతతోపాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందించే ప్రొడక్టులను ఆయా కంపెనీలు లాంచ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ (HDFC Life), ఒక కొత్త ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. HDFC సహకారం ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విభాగం వ్యక్తుల వివిధ అవసరాలను తీర్చే ప్రొడక్టులను అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ పాలసీ కింద హామీ ఇచ్చిన మొత్తంలో భాగంగా ప్రతి సంవత్సరం 11 శాతం నుంచి 13 శాతం వరకు గ్యారెంటీడ్ ఇన్‌కం అందజేస్తుంది. కస్టమర్‌లకు క్రమబద్ధమైన, గ్యారెంటీ ఇన్‌కం ద్వారా ఆర్థిక కార్పస్‌ను నిర్మించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్లాన్ ట్యాక్స్‌ ఫ్రీ బెనిఫిట్స్‌, గ్యారెంటీడ్‌ డెత్‌ బెనిఫిట్స్‌ను కూడా అందిస్తుంది.

* ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే ప్రీమియం డిస్కౌంట్‌

ఈ కొత్త ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే మొదటి సంవత్సరం ప్రీమియంలపై హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ డిస్కౌంట్‌ అందిస్తుంది. ప్రీమియం పేమెంట్‌ టర్మ్(PPT)లో 8, 10 సంవత్సరాలకు 12 శాతం డిస్కౌంట్‌, 12, 15 సంవత్సరాల PPTకి 15 శాతం డిస్కౌంట్‌ కూడా ఉంది. అలాగే ఇన్‌కం పేఔట్‌ ఫేజ్‌లో కూడా లైఫ్ కవర్ అందిస్తుంది. పాలసీదారుడు 8, 10, 12, 15, 20, 25 లేదా 30 సంవత్సరాల ఆదాయ కాలాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.

* డెత్‌ బెనిఫిట్స్‌ ఇవే

అదనంగా పాలసీ గ్యారెంటీడ్‌ డెత్‌ బెనిఫిట్స్‌ను ఏకమొత్తంలో లేదా నెలవారీ వాయిదాలలో అందిస్తుంది. కుటుంబ సభ్యులు ఇన్‌కం బెనిఫిట్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవచ్చు. 0 (సున్నా) నుంచి 65 సంవత్సరాల వరకు ఉన్న వాళ్లు ప్లాన్‌ పొందవచ్చు. ఇది నాన్ పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని గమనించాలి. హెచ్‌డిఎఫ్‌సి ఓ ప్రకటనలో.. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అనేది బాధ్యతలు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలతో ఉన్న ప్రతి వ్యక్తికి అవసరం. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ గ్యారెంటీడ్ ఇన్‌కం ఇన్సూరెన్స్ ప్లాన్ ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి వీలు కల్పిస్తుందని తెలిపింది.

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ప్రొడక్ట్స్, సెగ్మెంట్స్ హెడ్ అనీష్ ఖన్నా మాట్లాడుతూ.. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌లో పాలసీదారులకు, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఈ ప్రొడక్ట్‌ కేటగిరీ ప్రొటెక్షన్‌, లాంగ్‌ టర్మ్‌ సేవింగ్స్‌ వంటి ద్వంద్వ ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు.

ఇది కూడా చదవండి : నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నారా? 10 నిమిషాల్లో రూ.4 లక్షల లోన్ పొందండిలా!

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ గ్యారెంటీడ్ ఇన్‌కం ఇన్సూరెన్స్ ప్లాన్ హామీతో కూడిన రాబడిని అందిస్తుందని, భవిష్యత్తు అనిశ్చితుల నుంచి పాలసీదారులను రక్షిస్తుందని అన్నారు. ఈ ప్లాన్ ప్రీమియం పేమెంట్‌ టర్మ్స్‌, లైఫ్ కవర్‌ల సెలక్షన్‌ ఆప్షన్‌ను ఇన్‌కం పేఔట్‌ ఫేజ్‌లో కూడా అందిస్తుందన్నారు. వ్యక్తులు ఈ ప్లాన్‌ను అత్యంత సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు అనీష్‌ ఖన్నా చెప్పారు. ఈ ప్లాన్‌ వినియోగదాలకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు ఫైనాన్షియల్‌ సేఫ్టీతో కార్పన్‌ను బిల్డ్‌ చేసుకునే అవకాశం ఇస్తుందని వివరించారు.

First published:

Tags: Hdfc, HDFC Life, Life Insurance, Personal Finance

ఉత్తమ కథలు