హోమ్ /వార్తలు /బిజినెస్ /

Life and Health Insurence: లైఫ్​, హెల్త్​ను కవర్‌ చేసే వినూత్న టర్మ్ పాలసీ.. పూర్తి వివరాలివే..

Life and Health Insurence: లైఫ్​, హెల్త్​ను కవర్‌ చేసే వినూత్న టర్మ్ పాలసీ.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేటి ఆధునిక జీవితంలో జీవిత బీమా, ఆరోగ్య బీమా అన్నది ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి అయిపోయింది. రకరకాల వ్యక్తులకు రకరకాల అవసరాలు ఉంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగా బీమా కంపెనీలు వినూత్న పాలసీలను ప్రజలకు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ జీవిత బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ తన ఖాతాదారులకు సరికొత్త టర్మ్‌ ఇన్సూరెన్స్ పాలసీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ క్లిక్‌ 2 ప్రొటెక్ట్‌ లైఫ్‌ పథకాన్ని తీసుకువచ్చింది.

ఇంకా చదవండి ...

నేటి ఆధునిక జీవితంలో జీవిత బీమా, ఆరోగ్య బీమా అన్నది ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి అయిపోయింది. రకరకాల వ్యక్తులకు రకరకాల అవసరాలు ఉంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగా బీమా కంపెనీలు వినూత్న పాలసీలను ప్రజలకు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ జీవిత బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ తన ఖాతాదారులకు సరికొత్త టర్మ్‌ ఇన్సూరెన్స్ పాలసీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ క్లిక్‌ 2 ప్రొటెక్ట్‌ లైఫ్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌ చేసిన ఈ పాలసీ జీవిత కవరేజీతో పాటు తీవ్రమైన అనారోగ్య రీబ్యాలెన్స్‌ ఆప్షన్‌ను అందిస్తోంది. జీవితంలోని వివిధ దశల్లో వ్యక్తుల మారే అవసరాలకు అనుగుణంగా ఈ పాలసీని రూపొందించింది.

Telangana News: వామ్మో.. ఏందిది.. హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి దేవుడిని కూడా వదలట్లేదుగా.. వీడియో వైరల్..


ఇది నాన్‌ లింక్డ్, నాన్‌ పార్టిసిపేటింగ్‌ వ్యక్తిగత టర్మ్‌ పాలసీ. పెరుగుతున్న వయస్సు కారణంగా తలెత్తే తీవ్రమైన అనారోగ్యం, మరణం నుంచి లైఫ్‌, సీఐ రీబ్యాలెన్స్‌ ఆప్షన్‌ రక్షణ అందిస్తుందని కంపెనీ తెలిపింది.ప్రతీ పాలసీ వార్షిక తేదీ నాడు జీవిత బీమా రక్షణ తగ్గుతుంది, అదే నిష్పత్తిలో తీవ్రమైన అనారోగ్యాల నుంచి రక్షణ కవరేజ్ పెరుగుతుంది. పాలసీ తీసుకున్న వ్యక్తికి ఈజాబితాలో పేర్కొన్న 36 తీవ్రమైన అనారోగ్యాల్లో ఏదైనా నిర్థారణ అయితే,కవరేజ్‌ మొత్తాన్ని పాలసీదారుడికి చెల్లించడంతో పాటు భవిష్యత్‌ ప్రీమియంలు రద్దు చేస్తుంది. అంతే కాదు జీవితబీమా రక్షణ కొనసాగుతూనే ఉంటుంది.

Minor Girl Kidnap: ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేశాడు.. చివరకు అతడు చేసిన చర్యకు పోలీసులు ఆశ్చర్యపోయారు..


ఒకే పాలసీతో రెండు ప్రయోజనాలు

ఈ పాలసీ ప్రారంభ సమయంలోప్రాథమిక హామీపూరిత బీమా మొత్తాన్ని 80, 20 నిష్పత్తిలో జీవిత బీమా, తీవ్ర అనారోగ్య రక్షణ కింద విభజిస్తారు.పాలసీ వ్యవధిలో హామీపూరిత బీమా మొత్తం అలాగే ఉంటుంది. ప్రతీ పాలసీ సంవత్సరంలో క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ పెరిగినా ఖాతాదారు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం మాత్రం ఒకలాగే ఉంటుంది. ఒకవేళ బీమా చేయించుకున్న వ్యక్తి మరణం సంభవిస్తే, నామినీకిబీమా మొత్తాన్ని చెల్లిస్తారు.బీమా చేయించుకున్న వ్యక్తి ఒకవేళ పాలసీ మ్యాచుర్‌ అయ్యేంత వరకు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని, ప్రీమియం యాడ్‌ ఆన్‌ ఏమైనా చెల్లించి ఉంటే వాటిని తిరిగి పొందవచ్చు. ఈ పాలసీని ఈ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం..అమల్లో ఉన్న ఒక పాలసీలో క్రిటికల్‌ ఇల్‌నెస్‌ అంటే తీవ్ర అనారోగ్య హామీపూరిత మొత్తం ప్రతీ సంవత్సరం పాలసీ తీసుకున్న తేదీ నాడు పెరుగుతుంది.

Hyderabad News: మీకు రూ.30 వేలు కావాలా.. అయితే ఈ పని చేసిపెట్టండి..


అదే మొత్తంలో జీవిత బీమా రక్షణ తగ్గుతుంది. ఈ మొత్తాన్ని ప్రాథమిక హామీపూరిత మొత్తం/పాలసీ వ్యవధిలో 30% గా లెక్కించవచ్చు. కాని ప్రాథమిక హామీపూరిత మొత్తం ( జీవిత రక్షణ హామీపూరిత మొత్తం + క్రిటికల్‌ ఇల్‌నెస్‌ హామీపూరిత మొత్తం) పాలసీ వ్యవధి అంతటాఒకేలా ఉంటుంది. ఒకసారి క్రిటికల్‌ ఇల్‌నెస్‌ క్లెయిమ్‌ చేసినట్టు అయితే అప్పుడు ఉన్న జీవిత రక్షణ హామీపూరిత మొత్తాన్ని వర్తింపజేయడం జరుగుతుంది, పాలసీ గడువు తీరేంత వరకు అదే మొత్తం కొనసాగుతుంది.

First published:

Tags: Hdfc, HDFC Life, Life Insurance

ఉత్తమ కథలు