మీ జీవితంలో భవిష్యత్-ప్రణాళికను సిద్ధం చేయడానికి సులభమైన పట్టిక. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి క్లిష్టతర పరిస్థితులను ఎదుర్కోకుండా, ఈ మహమ్మారి మనకు కొన్ని ముఖ్యమైన ఆర్థికపర మరియు వ్యాపారానికి సంబంధించిన పాఠాలను నేర్పించింది. అయినప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ తిరిగి మామూలు స్థితికి చేరి, యధావిధి జీవనం సాగించడానికి మనము బహు చేరువలో ఉ న్నాము, కాబట్టి మన గతం నుండి నేర్చుకున్న పాఠాలను గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో ఎదురయ్యె విపత్తులకు సిద్ధంగా ఉండాలి.
అత్యవసర నగదు & రుణాలు
మంచి ఆర్థిక సలహాదారులు ఎవరైనా సరే భవిష్యత్తులో కలిగే అత్యవసర పరిస్థితుల్లో కొన్ని నెలలకు సరిపోయే కనీస వసతుల కొరకు కొంత నగదును కలిగి ఉండాలని సలహ ఇస్తారు. "తమకు ఎప్పటికీ విపత్తు రాదు" అని అనుకునే వారికంటే ఇలాంటి సలహాలపై వివేకంతో శ్రద్ధ వహించే వారికి క్లిష్టసమయాలు కూడా చాలా సులభమవుతాయి. ఈ డబ్బును రాత్రికిరాత్రే కూడబెడతామన్న భ్రమను వదిలి కొంచెం కొంచెంగా ఆదాచేసే దిశగా అడుగులు వేయండి.
ఉద్యోగ భద్రత అనేది మన జీవితాలలో చాలా ముఖ్యమైన విషయమని మనం ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మనం గుర్తుంచుకోవాల్సిన మరో గొప్ప నియమం ఏమిటంటే చీటికిమాటికి మనం రుణాలను తీసుకోకూడదు ఎందుకంటే మనం తిరిగి వాటిని చెల్లించలేకపోవచ్చు. ఎలాంటి విపత్తులతో సంబంధం లేకుండా మీ రుణాలను తిరిగి చెల్లించే ప్రణాళికతో సిద్దంగా ఉండండి.
జీవనశైలి క్రీప్ గురించి తెలుసుకోండి.
మీ ఆదాయం పెరిగేకొద్దీ, మీ "అవసరాల" జాబితా కూడా పెరుగుతుందని తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కాని ఇప్పుడున్న ఈ ప్రపంచ సంక్షోభం మనకు ఏదైనా నేర్పించిందా అంటే, అది నిత్యావసరాలపై కొంచెం నియంత్రణ కలిగి ఉండి వాటి కోసం కొంత మొత్తాన్ని ఆదా చేయడమే అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరు మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది, అందులో చాలా వస్తువులు మనకు నిత్య జీవితంలో పెద్దగా అవసరం లేనివి అని, అంతేకాకుండా అవి లేకుండా కూడా రోజూవారి జీవితంలో మనం చాలా సంతోషంగా గడపవచ్చు అని. ఇప్పుడు మనం ఎక్కువగా ఇంట్లో ఉండడం వలన ఖరీదైన వినోదపు అలవాట్లు, ఇతర కొనుగోళ్లు వంటి చిన్న విషయాలే ఒక నెలలో ఎంత భారంగా మారుతాయో అర్థం అవుతుంది.
సురక్షితంగా ఉండటానికి మంచి బీమా పొందండి.
ప్రపంచంలో ఉన్న ఆర్థిక అనిశ్చితి వలన మన ప్రియమైనవారిని సురక్షితంగా ఉంచుతూ, వారి ప్రాథమిక అవసరాలను తీర్చడమనేది చాలా ముఖ్యమైన అంశం. ఎప్పుడూ ఉపాధి దొరుకుతుందనే హామీ లేదు కాబట్టి, యజమాని అందించే జీవిత భీమాపై మాత్రమే ఆధారపడటం శ్రేయస్కరం కాదు. మంచి ప్రయోజనాలతో ఆర్థిక బలాన్ని పెంపొందించే శాశ్వత పరిష్కారాన్ని కలిగి ఉండుటకు ప్రాధాన్యతనివ్వాలి.
మంచి లాభదాయకమైన పొదుపు భీమా పథకం విషయానికి వస్తే, HDFC Life Sanchay Plus అన్ని విధాలుగా సరైనది. దీనితో, ఊహించని పరిస్థితులకు వ్యతిరేకంగా మీ ప్రియమైనవారి భవిష్యత్తును కాపాడుకునేటప్పుడు ఇది చాలా లాభాన్ని అందిస్తుంది.
మీ కుటుంబానికి పూర్తి భరోసా కలిగిస్తూ, క్రమబద్ధమైన పొదుపులు మరియు క్రమంగా ఆధాయాని అందిస్తూ పూర్తి భాద్యతను స్వీకరిస్తుంది. ప్రస్తుతం మనలో చాలా మంది వెతుకుతున్న రాబడిలతో కూడిన హామీ, మరెన్నో ప్రయోజనాలను అందించడానికి సరికొత్త ప్రణాళికతో HDFC Life Sanchay Plus రూపొందించబడింది. ఇది చెప్పిన విధంగా అన్ని ప్రయోజనాలను చేకూరుస్తూ తక్కువ రిస్క్ తో కూడిన చక్కని ప్రణాళిక. పదవీ విరమణ తరువాత స్థిరమైన ఆదాయం గురించి ఆందోళన చెందుతున్న వారికి జీవితకాల ఆదాయ భీమను ఎంచుకోవడం అదృష్టమనే చెప్పవచ్చు.
ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలతో కూడిన HDFC Life Sanchay Plus ఎంచుకోవడం మరొక గొప్ప విషయం.
ఈ ప్రణాళిక గురించిన మరిన్ని వివరాల కోసం మరియు నమోదు చేయడానికి,
ఇక్కడ క్లిక్ చేయండి.
బడ్జెట్ మెరుగైన విధంగా వాడడం నేర్చుకోండి
మనలో చాలా మంది బడ్జెట్ రూపొందించడానికి భయపడుతున్నప్పుడు, ఆదాయం తగ్గినప్పుడు, ఉద్యోగాల కొరత మరియు సంక్షోభం-ప్రేరేపిత అనిశ్చితి, తక్కువ బడ్జెట్‌ను కలిగి ఉండటం వంటి విపత్కర సమయాలలో మీ నిధులను ఎలా సర్దుకోవాలో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.అత్యవసర కార్పస్ లెక్కించుటకు; మీరు మొదటి 3-6 నెలలు మీ అన్ని ప్రాథమిక సదుపాయాలకు చెల్లించి, ఆపై ఆదా చేయడం ప్రారంభించవచ్చు. మీ డేటాను కలపడం లేదా తీసివేయడం అంత సులభమేమి కాదు. ఒక నెలలో అయ్యే ఖర్చులను అన్నింటిని ఒక చోట రాసుకొని దానినిబట్టి మీ బడ్జెట్ తయారుచేసుకోవచ్చు. కొన్ని ఊహించని ఖర్చుల కోసం కొంత మొత్తన్ని పొదుపుచేయండి.అంతేకాకుండా ట్రాక్ చేయడంలో మీకు సహాయపడే యాప్ లేదా స్ప్రెడ్‌షీట్‌ను ఉపయోగించండి.
విపత్తులు ఎంతో మేలైన ప్రణాళికలను కూడా తలక్రిందులు చేస్తాయని COVID-19 నిరూపించింది. ఇంటి పునర్నిర్మాణాల నుండి కుటుంబ సెలవుల వరకు వివిధ రంగాలకు చెందిన ఎన్నెన్నో ప్రణాళికలు ఒక్క రాత్రిలోనే మారవచ్చు అని ఇది నిరూపించింది.
అయినప్పటికీ, శుభవార్త ఏమిటంటే, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల నుండి నేర్చుకునే విషయాలను ఆచరిస్తూ భవిష్యత్తులో ఎదుర్కోబోయే విపత్తులలో విశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళతారు.
ఇది భాగస్వామ్య పోస్ట్.