హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC Life: హెచ్​డీఎఫ్​సీ లైఫ్ నుంచి పెన్షన్​ ప్లాన్... నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే

HDFC Life: హెచ్​డీఎఫ్​సీ లైఫ్ నుంచి పెన్షన్​ ప్లాన్... నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే

HDFC Life: హెచ్​డీఎఫ్​సీ లైఫ్ నుంచి పెన్షన్​ ప్లాన్... నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే
(ప్రతీకాత్మక చిత్రం)

HDFC Life: హెచ్​డీఎఫ్​సీ లైఫ్ నుంచి పెన్షన్​ ప్లాన్... నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే (ప్రతీకాత్మక చిత్రం)

HDFC Life | మీరు ఏదైనా పెన్షన్ ప్లాన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సరళ్ పెన్షన్ ప్లాన్ లాంఛ్ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

పదవీ విరమణ అనంతరం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేని ప్రశాంతమైన జీవితం కోసం చాలామంది చూస్తున్నారు. అందుకే సరళ్​ పెన్షన్​ బీమా పాలసీలను కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్​, టాటా-AIA లైఫ్‌ వంటి అనేక జీవిత బీమా సంస్థలు సరళ్​ పెన్షన్ ప్లాన్లను ప్రారంభించాయి. తాజాగా ప్రైవేట్​ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ​హెచ్​డీఎఫ్​సీ కూడా సరళ్​ పెన్షన్ ప్లాన్​ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్​లో ఒకేసారి పెట్టుబడి పెట్టి జీవితాంతం ప్రతి నెలా పెన్షన్​ పొందవచ్చు.

బీమా సంస్థలు లైఫ్, హెల్త్​ రెండు బెనిఫిట్స్​ కవరేజీ లభించేలా పాలసీలను రూపొందించాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్​ డెవలప్​మెంట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఐఆర్​డీఏఐ) ఆదేశించింది. అందుకు అనుగుణంగానే హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ సరళ్​ పెన్షన్​ పాలసీని రూపొందించింది. ఈ పాలసీపై HDFC లైఫ్ చీఫ్ యాక్చువరీ శ్రీనివాసన్ పార్థసారథి మాట్లాడుతూ "పదవీ విరమణ వయస్సుకి దగ్గరగా ఉన్న లేదా పదవీ విరమణ చేసిన వ్యక్తులకు యాన్యుటీ ప్లాన్‌లు అనుకూలంగా ఉంటాయి. ఈ ప్లాన్ల కింద మెరుగైన వడ్డీ రేట్లు లభిస్తాయి” అని చెప్పారు.

Gold Purity Check: బంగారు నగలు నకిలీవా? ఒరిజినలా? ఈ చిట్కాలతో మీ ఇంట్లోనే టెస్ట్ చేయండి

Business Idea: స్మార్ట్‌ఫోన్‌తో ఆన్‌లైన్ బిజినెస్... నెలకు రూ.30,000 ప్రాఫిట్... మీరూ చేయొచ్చు ఇలా

సరళ్​ పెన్షన్​ ప్లాన్​ బెనిఫిట్స్​


హెచ్​డీఎఫ్​సీ సరళ్​ పెన్షన్​ ప్లాన్‌లో మీరు ఒకేసారి మొత్తం పెట్టుబడి పెడితే జీవితకాలం పాటు పెన్షన్‌ని పొందవచ్చు. మీ రిటైర్​మెంట్​ కార్పస్ ఫండ్​ను ఒకేసారి పెద్దమొత్తంలో జమ చేయడం ద్వారా నెలవారీ, త్రైమాసిక, ద్వైవార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్​ లభిస్తుంది. మీ పెట్టుబడిపై వర్తించే వడ్డీ రేట్లు మీ వార్షికాదాయం బట్టి నిర్ణయిస్తారు. సరళ్​ పెన్షన్​ ప్లాన్​ కింద మీరు ప్రతినెలా కనీస రూ. 1000 వరకు పొందవచ్చు. ఈ ప్లాన్​లో 40 సంవత్సరాల వయస్సు నుంచి 80 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పెన్షన్ ప్లాన్ కింద రెండు యాన్యుటీ ఆప్షన్లు ఉంటాయి. సింగిల్​ లైఫ్​, జాయింట్​ లైఫ్​ యాన్యూటీ అనే వేరియంట్లలో ఆదాయాన్ని పొందవచ్చు.

సింగిల్ లైఫ్​ యాన్యుటీ ప్రకారం జీవితాంతం స్థిర ఆదాయం లభిస్తుంది. ఆ తర్వాత పాలసీదారుడి మరణంతో పెన్షన్​ చెల్లింపు ఆగిపోతుంది. మరణం అనంతరం పాలసీలో 100 శాతం పేమెంట్​ నామినీకి చెల్లిస్తారు. ఇక, జాయింట్​ లైఫ్​ యాన్యుటీ ఆప్షన్​ ప్రకారం, ఇద్దరు పాలసీదారుల్లో ఎవరో ఒకరు సజీవంగా ఉన్నా సరే అతనికి పెన్షన్​ లభిస్తుంది. రెండో వ్యక్తి కూడా మరణిస్తే అప్పుడు పెన్షన్​ చెల్లింపు ఆగిపోతుంది. చివరగా మరణించిన వ్యక్తి నామినీకి 100 శాతం పేమెంట్​ చెల్లిస్తారు. సరళ్​ పెన్షన్ కింద కనీస పెట్టుబడి రూ .2 లక్షలు కాగా, గరిష్ట మొత్తానికి పరిమితి లేదు.

PF Withdrawal Rule: ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక్క రోజులో రూ.1,00,000 అడ్వాన్స్

SBI Scheme: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌లో చేరండి... ప్రతీ నెలా డబ్బులు పొందండి

అనారోగ్య సమస్యలు తలెత్తితే..


ఈ ప్లాన్ కింద సరెండర్​ బెనిఫిట్స్​ కూడా అందిస్తోంది సంస్థ. మీ జీవిత భాగస్వామి లేదా పిల్లలు క్యాన్సర్ లేదా మూత్రపిండ వైఫల్యం వంటి క్లిష్టమైన అనారోగ్యానికి గురైతే పాలసీ ఉపసంహరించుకోవచ్చు. ప్లాన్​ కొనుగోలు ధరలో 95 శాతం సరెండర్ బెనిఫిట్​గా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.

First published:

Tags: HDFC Life, Pension Scheme, Personal Finance

ఉత్తమ కథలు