హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC Life: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నుంచి సరికొత్త పెన్షన్ ప్లాన్... రిటైర్మెంట్ తర్వాత గ్యారెంటీ ఇన్‌కమ్

HDFC Life: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నుంచి సరికొత్త పెన్షన్ ప్లాన్... రిటైర్మెంట్ తర్వాత గ్యారెంటీ ఇన్‌కమ్

HDFC Life: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నుంచి సరికొత్త పెన్షన్ ప్లాన్... రిటైర్మెంట్ తర్వాత గ్యారెంటీ ఇన్‌కమ్
(ప్రతీకాత్మక చిత్రం)

HDFC Life: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నుంచి సరికొత్త పెన్షన్ ప్లాన్... రిటైర్మెంట్ తర్వాత గ్యారెంటీ ఇన్‌కమ్ (ప్రతీకాత్మక చిత్రం)

HDFC Life | రిటైర్మెంట్ తర్వాత గ్యారెంటీ ఇన్‌కమ్ ఇచ్చే సరికొత్త పెన్షన్ ప్లాన్‌ను (Pension Plan) తీసుకొచ్చింది హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్. ఈ ప్లాన్‌లో నాలుగు రకాల ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (HDFC Life) నుంచి సరికొత్త పెన్షన్ ప్లాన్ ప్రారంభమైంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ స్మార్ట్ పెన్షన్ ప్లస్ (HDFC Life Smart Pension Plus) పేరుతో ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్‌లో పలు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. లిక్విడిటీ, సింపుల్ కాంపౌండ్ ఇన్‌క్రీజింగ్ యాన్యుటీ, ఎర్లీ రిటర్న్ ఆఫ్ ప్రీమియం లాంటి ఆప్షన్స్ ఉంటాయి. పాలసీహోల్డర్ తమ అవసరాలకు తగ్గట్టుగా ఆప్షన్ ఎంచుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్వాతంత్ర్యం పొందడం కోసం, అప్పటివరకు జీతం పొందినట్టుగా, ప్రతీ నెలా పెన్షన్ అందించే ప్లాన్ ఇది. ఈ పెన్షన్ ప్లాన్ ఎంచుకునేవారు తమ జీవిత భాగస్వామికి కూడా పెన్షన్ అందించే ఆప్షన్ ఎంచుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ స్మార్ట్ పెన్షన్ ప్లస్ ప్లాన్‌లో నాలుగు యాన్యుటీ ఆప్షన్స్ ఉంటాయి. లైఫ్ యాన్యుటీ, లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ టోటల్ ప్రీమియంస్, లైఫ్ యాన్యుటీ విత్ ఎర్లీ రిటర్న్, ఇన్‌క్రీజింగ్ యాన్యుటీ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక ప్రీమియం పేమెంట్ కోసం రెండు ఆప్షన్స్ ఉంటాయి. సింగిల్ పేలో కనీసం రూ.50,000 ప్రీమియం చెల్లించాలి. లిమిటెడ్ పేలో కనీసం రూ.50,000 ప్రీమియం చెల్లించాలి. గరిష్ట పరిమితి ఏమీ లేదు. కనీస ప్రీమియంపై కనీస యాన్యుటీ లభిస్తుంది. మినిమమ్ యాన్యుటీ వార్షికంగా రూ.12,000, ఆరు నెలలకు రూ.6,000, మూడు నెలలకు రూ.3,000, నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. గరిష్ట యాన్యుటీ పరిమితి లేదు.

SBI Scheme: ఎస్‌బీఐ స్కీమ్... మీ అకౌంట్‌లోకి ప్రతీ నెలా డబ్బులు

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ స్మార్ట్ పెన్షన్ ప్లస్ ప్లాన్ ఇతర బెనిఫిట్స్ చూస్తే కస్టమర్లు ఎలాంటి మెడికల్స్ లేకుండా అండర్‌రైటింగ్‌తో 24 గంటల్లో ఈ పాలసీ తీసుకోవచ్చు. సింగిల్ ప్రీమియం లేదా లిమిటెడ్ ప్రీమియం ద్వారా జీవితాంతం పెన్షన్ పొందొచ్చు. యాన్యుటీ రేట్‌ను పాలసీ తీసుకున్న సమయంలోనే వెల్లడిస్తారు. అందులో ఎలాంటి మార్పు ఉండదు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ప్రస్తుత కస్టమర్లు, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ రిటైర్డ్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు ప్రత్యేక రేట్లు వర్తిస్తాయి. ఈ పాలసీ తీసుకున్నప్పుడే యాన్యుటీ రేట్లను లాక్ చేయొచ్చు. 15 ఏళ్ల వరకు ఆదాయాన్ని వాయిదా వేసుకోవచ్చు.

Akshaya Tritiya: అక్షయ తృతీయకు నెల రోజులు... బంగారం ఇప్పుడు బుక్ చేయడమే మంచిదా?

ఎల్ఐసీ పెన్షన్ ప్లాన్

ఎల్ఐసీలో కూడా ఇలాంటి పెన్షన్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి పాలసీల్లో న్యూ జీవన్ శాంతి ప్లాన్ ఒకటి. రిటైర్మెంట్ డబ్బులతో ఈ పాలసీ తీసుకొని ప్రతీ నెల కొంత ఆదాయం పొందవచ్చు. కనీస ప్రీమియం రూ.1,50,000. ఉదాహరణకు 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.10,00,000 సింగిల్ ప్రీమియం చెల్లించి, డిఫర్‌మెంట్ పీరియడ్ 12 ఏళ్లు ఎంచుకున్నారనుకుందాం. సెకండరీ యాన్యుటెంట్ వయస్సు 35 ఏళ్లు. అతను డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ పాలసీ ఎంచుకున్నట్టైతే ఏడాదికి రూ.1,39,900, ఆరు నెలలకు రూ.68,551, మూడు నెలలకు రూ.33,926, నెలకు రూ.11,192 చొప్పున వస్తాయి. డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ ఎంచుకుంటే ఏడాదికి రూ.132,200, ఆరు నెలలకు రూ.64,778, మూడు నెలలకు రూ.32,059, నెలకు రూ.10,576 వస్తాయి.

First published:

Tags: HDFC bank, HDFC Life, Pension Scheme, Personal Finance

ఉత్తమ కథలు