భారతదేశంలోని ప్రముఖ Life Insurance కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (HDFC Life) ఒకటి. కస్టమర్లకు సేవలందించేందుకు ఈ సంస్థ సరికొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. తాజాగా కంపెనీ మరో కొత్త రకం సేవలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. తమ కంపెనీ నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఇంటివద్దే మెడికల్ టెస్టులు చేయిస్తామని జూన్ 23న వెల్లడించింది. వారికోసం 'కార్డియాక్ రిస్క్ అసెస్‌మెంట్' (Cardiac Risk Assessment) సర్వీస్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. HDFC లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి దరఖాస్తు చేస్తున్నప్పుడు మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సిన ప్రాసెస్‌ను ఈ సర్వీస్ సులభతం చేస్తుందని కంపెనీ పేర్కొంది.
సాధారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకునే వారు, తమ ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి కొన్ని టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. వీటిలో స్ట్రెట్ టెస్ట్ (stress test) ఒకటి. ఈ టెస్ట్ కోసం కచ్చితంగా హాస్పిటల్‌కు వెళ్లాల్సిందే. కానీ తాజా సర్వీస్‌తో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఈ టెస్టును పాలసీ హోల్డర్ల ఇంటి వద్దే నిర్వహించే ఏర్పాట్లు చేయనుంది. ‘రక్తపరీక్షలు, ECG, వంటి టెస్టులను ఇంట్లోనే చేయవచ్చు. కానీ కస్టమర్లు స్ట్రెస్ టెస్ట్ కోసం మెడికల్ సెంటర్‌కు (జీవిత బీమా సంస్థతో ఎంప్యానెల్ అయినది) వెళ్లాలి. దీనివల్ల జీవిత బీమా పాలసీల జారీలో జాప్యం జరుగుతుంది. ఈ సమస్యకు తాజా సేవలతో అడ్డుకట్ట వేయవచ్చు’ అని కంపెనీ తెలిపింది.
టెస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
ఒక అప్లికెంట్ ముందు అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత HDFC లైఫ్ ప్రతినిధి కార్డియోట్రాక్ పోర్టబుల్ ECGతో సహా అవసరమైన ఇతర డివైజ్‌లతో ఆ వ్యక్తి ఇంటికి వెళ్తారు. టెస్ట్ చేసినప్పుడు రికార్డ్ చేసే రియల్ లైఫ్ రీడింగ్‌లను ఒక డాక్టర్ వీడియో కాల్ ద్వారా పరిశీలిస్తారు. ఇలా స్ట్రెస్ టెస్ట్‌పై ఒక అంచనాకు వస్తారు. HDFC లైఫ్ కంపెనీకి కాబోయే, ఇప్పటికే ఉన్న పాలసీ హోల్డర్లకు జీవిత బీమా ప్రయాణంలో ప్రతి దశలో కచ్చితమైన రిస్క్ అసెస్‌మెంట్‌తో పాటు వినూత్న సేవలను అందించడం తమ లక్ష్యమని కంపెనీ ఎండీ, సీఈఓ విభా పదాల్కర్ తెలిపారు. తాజా సేవల కోసం కంపెనీ రీఇన్సూరెన్స్ పార్ట్నర్స్‌తో కూడా చర్చించి ఆమోదం పొందిదని వెల్లడించారు.
కస్టమర్ల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రారంభ దశగా కంపెనీ 'క్వెస్ట్ ఫర్ ఇన్నోవేటింగ్ మెడికల్ రిస్క్ అసెస్‌మెంట్' ఇన్నొవేషన్‌ను ప్రారంభించింది. ఈ సేవలు ప్రస్తుతం ముంబై, బెంగళూరులోనే అందుబాటులో ఉన్నాయి. ఈ సర్వీస్ దరఖాస్తుదారుల ఇంటి వద్ద లేదా ఆఫీస్‌లో స్ట్రెస్ టెస్ట్ చేసి, వారి గుండె సంబంధిత ప్రమాదాన్ని అంచనా వేసి, వైద్య ప్రక్రియలను సులభతరం చేస్తుంది. జీవిత బీమా కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడానికి ఇది ఒక పెద్ద ముందడుగు అని కార్డియోట్రాక్ సహ వ్యవస్థాపకుడు, CEO అవిన్ అగర్వాల్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hdfc, HDFC Life, Health Insurance, Life Insurance