HDFC Life: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.2180 కోట్ల బోనస్

HDFC Life: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.2180 కోట్ల బోనస్ (image: HDFC Life)

HDFC Life | హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కస్టమర్లకు గుడ్ న్యూస్. తమ పాలసీదారులకు బోనస్ ప్రకటించింది హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్.

  • Share this:
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తన పాలసీదారులకు శుభవార్త చెప్పింది. తమ పార్టిసిపేటింగ్​ ఇన్సూరెన్స్​ పాలసీల్లో చేరిన వారికి పెద్ద మొత్తంలో బోనస్​ ప్రకటించింది. పాలసీ హోల్డర్లకు మొత్తం రూ. 2180 కోట్లను బోనస్​గా ఇవ్వనున్నట్లు పేర్కొంది. కంపెనీకి ప్రతి ఏటా వచ్చిన లాభాల్లో కొంత అమౌంట్​ను బోనస్ రూపంలో పాలసీదారులకు చెల్లిస్తుంది. అర్హులైన పాలసీదారులకు లాభాల్లోని కొంత వాటాను పంచుతారు. అలాగే ఈ ఏడాది కూడా అర్హులైన పాలసీదారులకు లాభాలను పంచాలని నిర్ణయించింది. అయితే, కరోనా నేపథ్యంలో ఇన్సూరెన్స్​ పాలసీలకు విపరీతమైన డిమాండ్​ ఏర్పడింది. దీంతో హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ ఇన్సూరెన్స్ లాభాల బాట పట్టింది. ఈ నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది తమ పాలసీదారులకు 44 శాతం ఎక్కువ బోనస్​ ఇవ్వనుంది.

సాధారణంగా కంపెనీలు తన పాలసీదారుల మరణం, పాలసీ సరెండర్​ చేసినప్పుడు, మెచ్యూరిటీ వ్యవధి పూర్తయినప్పుడు మాత్రమే బోనస్​ ఇస్తుంటాయి. కానీ హెచ్​డీఎఫ్​సీ మాత్రం పాలసీ వ్యవధి పూర్తికాకముందే ఏటా వచ్చిన లాభాల్లోంచి కొంత వాటాను బోనస్​ రూపంలో ఇస్తుండటం విశేషం. దీని ద్వారా పాలసీదారులకు అదనపు లబ్ధి చేకూరుతుంది. ఇక పాలసీ వ్యవధితో పాటు బోనస్ శాతం కూడా పెరుగుతూనే ఉంటుంది. అయితే, ఈ బోనస్​ ప్రయోజనాలను పొందేందుకు పాలసీదారులంతా అర్హులు కాదు. కేవలం పార్టిసిపేటింగ్​ ఇన్సూరెన్స్ పాలసీలను కొన్న పాలసీదారులకు మాత్రమే ఈ బోనస్​ పొందేందుకు అర్హులు.

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌తో కోటీశ్వరులు కావొచ్చు... లెక్క ఇదే

PF Aadhaar Link: పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ తప్పనిసరి... ఈ స్టెప్స్ ఫాలో అవండి

డివిడెండ్​ అమౌంట్​ను పొందడానికి వీలుండే పాలసీలను పార్టిసిపేటింగ్​ ఇన్సూరెన్స్ పాలసీలంటారు. ఈ పాలసీదారులకు ఇచ్చే బోనస్​పై హెచ్​డీఎఫ్​సీ 2021 ఏప్రిల్​లో బోర్డు సమావేశం నిర్వహించింది. బోర్డ్​ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ మొత్తం రూ. 2180 కోట్ల మేర బోనస్​ రూపంలో పాలసీదారులకు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,438 కోట్లను క్యాష్​ బోనస్​ రూపంలో చెల్లిస్తారు. మిగతా మొత్తం పాలసీ మెచ్యూరిటీ గడువు పూర్తయ్యాక, మరణం లేదా పాలసీని సరెండర్​ చేసిన సమయంలో భవిష్యత్తులో చెల్లిస్తారు.

SBI Scheme: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతీ నెలా మీ అకౌంట్‌లోకి డబ్బులు... స్కీమ్ వివరాలివే

Bank Account: ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? జూలై 1 నుంచి కొత్త రూల్స్

బోనస్​ వర్తించే ప్లాన్లు ఇవే


హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ కొన్ని పాలసీలకు మాత్రమే బోనస్​ చెల్లిస్తుంది. మనీ బ్యాక్ ప్లాన్, హెచ్​డీఎఫ్​సీ చిల్డ్రన్స్​ ప్లాన్, హెచ్​డీఎఫ్​సీ ఎండోమెంట్ అస్యూరెన్స్, హెచ్​డీఎఫ్​సీ సేవింగ్స్ అస్యూరెన్స్ ప్లాన్, హెచ్​డీఎఫ్​సీ అస్యూరెన్స్ ప్లాన్లలో చేరిన వారికి ఈ బోనస్​ వర్తిస్తుంది. మీరు తీసుకున్న పాలసీకి బోనస్​ అర్హత ఉందో లేదో తెలుసుకునేందుకు మీ పాలసీ డాక్యుమెంట్లను పరిశీలించండి. అయితే, యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో చేరిన వారికి బోనస్ పొందటానికి అర్హత లేదు. ఎందుకంటే అవి మార్కెట్-లింక్డ్ ప్లాన్స్​. వీటిలో చేరిన వారితో కంపెనీ తన లాభాలను పంచుకోదు.
Published by:Santhosh Kumar S
First published: