Home /News /business /

HDFC LIFE INDICATES GRADUAL RISE IN TERM INSURANCE PREMIUMS HERES WHAT YOU MUST DO GH VB

HDFC Life: ఆ​ పాలసీదారులకు షాకింగ్​ న్యూస్.. మరోసారి పెరగనున్న టర్మ్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం ధరలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా(corona) తర్వాత ఇన్సూరెన్స్​ పాలసీలకు(Insurance Policy) ఆదరణ పెరిగింది. గతంలో ఇన్సూరెన్స్​ అంటే కేవలం వృద్దులకు మాత్రమే అని భ్రమపడేవారు. కానీ కరోనా వారి భ్రమలను చెరిపేసింది. యువకులను సైతం ఇన్సూరెన్స్​ తీసుకునేలా చేసింది.

కరోనా(corona) తర్వాత ఇన్సూరెన్స్​ పాలసీలకు(Insurance Policy) ఆదరణ పెరిగింది. గతంలో ఇన్సూరెన్స్​ అంటే కేవలం వృద్దులకు మాత్రమే అని భ్రమపడేవారు. కానీ కరోనా వారి భ్రమలను చెరిపేసింది. యువకులను సైతం ఇన్సూరెన్స్​ తీసుకునేలా చేసింది. కరోనా చికిత్సకు అయ్యే లక్షల రూపాయల ఖర్చును భరించేందుకు ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గమని అంతా భావిస్తున్నారు. దీంతో, గత రెండేళ్ల నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ డిమాండ్​తో పాటు కోవిడ్ కాలంలో వచ్చిన నష్టాల కారణంగా ఇన్సూరెన్స్​ కంపెనీలు సైతం తమ ప్రీమియం రేట్లను భారీగా పెంచేస్తున్నాయి. తాజాగా ప్రముఖ లైఫ్​ ఇన్సూరెన్స్​ సంస్థ హెచ్​డీఎఫ్​సీ లైఫ్ సైతం​ తన టర్మ్​ ఇన్సూరెన్స్​ పాలసీ ప్రీమియం రేట్లను భారీగా పెంచింది.

Research on Ageing: మనిషి వృద్ధాప్యం సమస్యను అధిగమించే ప్రయోగం.. ఎలా సాధ్యం..? పూర్తి వివరాలిలా..


హెచ్​డీఎఫ్​సీ టర్మ్ ఇన్సూరెన్స్​ ప్రీమియంలు 2020 మార్చి నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. గత రెండేళ్లలో మూడు నుంచి నాలుగు సార్లు టర్మ్ ఇన్సూరెన్స్​ ప్రీమియం రేట్లు పెరిగాయి. 2021 డిసెంబర్​లో వయో వృద్దులకు అందించే ఇన్సూరెన్స్ ప్రీమియంను 15 నుంచి 25 శాతం వరకు పెంచింది. ఇదే క్రమంలో మరో ప్రైవేట్​ ఇన్సూరెన్స్​ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తన టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్‌లను 10 శాతం వరకు పెంచింది. మరోవైపు, కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ తన టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లను ఈ నెలాఖరులోగా పెంచనున్నట్లు తెలిపింది. పెరుగుతున్న కోవిడ్–19 డెత్ క్లెయిమ్‌ల నేపథ్యంలో కంపెనీలు ఇన్సూరెన్స్​ ప్రీమియం రేట్లను పెంచుతూ వస్తున్నాయి.

గత రెండేళ్లలో 40 నుంచి 50 శాతం పెరిగి ప్రీమియం రేట్లు..  

వచ్చే రెండు త్రైమాసికాల్లో ధరలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఎండి, సిఈఓ విభా పదాల్కర్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ “పెరుగుతున్న కోవిడ్​ డెత్​ క్లెయిమ్​ల నేపథ్యంలో ఇన్సూరెన్స్​ ప్రీమియం రేట్లను పెంచక తప్పడం లేదు. ఈ క్రమంలోనే గత రెండేళ్లలో ఇప్పటి వరకు 40 నుంచి -50 శాతం వరకు ఇన్సూరెన్స్​ ప్రీమియం రేట్లు పెరిగాయి. మరోమారు ఇన్సురెన్స్​ ప్రీమియం రేట్లు పెంచేందుకు సిద్దమవుతున్నాం. అయితే, మీరు గత సంవత్సరాల్లో చూసినంత ఎక్కువ పెంపుదల ఏమీ ఉండదు. షార్ట్​ టర్మ్​ ఇన్సూరెన్స్​ పాలసీలు లేదా రీఇన్సూరెన్స్ రేట్లలో ఎటువంటి పెంపుదల ఉండదు. ఇది పాలసీదారులకు ఊరటనిచ్చే అంశం.” అని చెప్పారు.

Trending News: ఈ రోజుల్లో కూడా రూపాయిన్నరకే అరచేయంత ఇడ్లీ.. ఈ బామ్మ ఎవరు, ఎందుకిలా చేస్తోందో తెలుసుకోండి..


2010 నుంచి భారతీయ జీవిత బీమా పాలసీ సంస్థలు తక్కువ ప్రీమియంలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యువకులు, ఆర్థిక స్థిమంతులను ఆకర్షించడానికి పోటాపోటీగా తక్కువ ప్రీమియం రేట్లకే ఇన్సూరెన్స్​లు ఆఫర్ చేశాయి. ఈ నేపథ్యంలోనే కోవిడ్​కు ముందు ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు దాదాపు 30 శాతం మేర పడిపోయాయి.

టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు పెరుగుతున్న ప్రజాదరణ..
ప్రజల్లో ఇన్సూరెన్స్​ పాలసీలపై అవగాహన పెరగడం వల్ల రూ. 1 కోటి టర్మ్ కవర్ చేసుకునే పాలసీదారుల సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా, పట్టణ, అధిక సంపాదన కలిగిన వ్యక్తులకు ఇది కనీస భద్రతా వలయంగా మారింది. పాలసీదారుడికి అనుకోని మరణం సంభవిస్తే వారిపై ఆధారపడిన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఇన్సూరెన్స్​ పాలసీలు బాగా ఉపయోగపడుతున్నాయి. కరోనా తర్వాత ఆసుపత్రిల్లో చేరే వారి సంఖ్య పెరగడం, మరణాలు కూడా పెరగడంతో ఇన్సూరెన్స్​ ప్రీమియం ధరలు పెరిగాయి. అయితే, గత రెండేళ్లుగా వరుస పెంపుదల ఉన్నప్పటికీ, భారతదేశంలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఖరీదైనవి కావని బీమా రంగ సంస్థలు చెబుతున్నాయి.

ప్రీమియం ఎంత ఉండాలి..?
ప్రతి వ్యక్తి పోర్ట్‌ఫోలియోలో తగిన స్వచ్ఛమైన రక్షణ కవరేజీ తప్పనిసరి. మీరు మీ ఆదాయం, మీ కుటుంబ అవసరాలు, లక్ష్యాలను పరిగణనలోకి తీసుకొని ఎంత కవరేజీతో ప్రీమియం తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. మీరు మీ వార్షిక ఆదాయానికి కనీసం 10- నుంచి 15 రెట్లు లైఫ్ కవర్ కలిగి ఉండేలా చూసుకోవాలి. జీవిత బీమా సంస్థలు యువకులకు, ఆరోగ్యవంతమైన వ్యక్తులకు తక్కువ ప్రీమియంలను మాత్రమే వసూలు చేస్తాయి. ఈ ప్రీమియం జీవితాంతం అందుబాటులో ఉంటుంది. అయితే, కంపెనీను ఎంచుకునే క్రమంలో ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను పరిగణలోకి తీసుకోవాలి. ఇది చెల్లించిన క్లెయిమ్‌ల సంఖ్య, స్వీకరించిన క్లెయిమ్‌ల సంఖ్యను సూచిస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: HDFC Life

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు