పదవీ విరమణ (Job Retirement) తరువాత ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే ఆర్థిక స్థిరత్వం ఉండటం తప్పనిసరి. సరైన ప్లానింగ్ లేక పదవి నుంచి దిగిపోయిన పదేళ్లలోనే డబ్బంతా ఖర్చయిపోయి దిగులు పడుతుంటారు చాలా మంది. అలాంటి వారి కోసమే తాజాగా హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ (HDFC Life Insurance) సరికొత్త రిటైర్మెంట్ ప్లాన్ తీసుకొచ్చింది. తాజాగా 'హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ (HDFC Life Systematic Retirement Plan )'ను సంస్థ లాంచ్ చేసింది. ఇది ఇండివిడ్యువల్, గ్రూప్, నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, సేవింగ్స్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ అని హెచ్డీఎఫ్సీ చెబుతోంది. ఈ సరికొత్త ప్లాన్ ద్వారా మీరు మీ పదవీ విరమణ కోసం క్రమపద్ధతిలో డబ్బులు పొదుపు చేయవచ్చు. ఈ ప్లాన్ కస్టమర్లకు 2 ఆప్షన్లను ఆఫర్ చేస్తోంది. ఇందులో ఒకటి లైఫ్ యాన్యుటీ అయితే.. మరొకటి లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ప్రీమియం.
Bikes: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? రూ.1 లక్షలోపు లభిస్తున్న టాప్ బైక్స్ ఇవే
హెచ్డీఎఫ్సీ లైఫ్ సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ తీసుకునే కస్టమర్లు పాలసీ ప్రారంభంలోనే తమ వార్షిక వడ్డీ రేట్ల (Annual Interest Rates)ను లాక్ చేయవచ్చు. ఈ రిటైర్మెంట్ ప్లాన్ ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో పదవీ విరమణ కార్పస్ కోసం క్రమపద్ధతిలో పొదుపు చేయడానికి.. ఆ తర్వాత హామీతో జీవితకాల ఆదాయాన్ని పొందేందుకు కస్టమర్లకు వీలు కల్పిస్తుంది. పైన చెప్పుకున్నట్లుగా కస్టమర్లు ప్రీమియంల వాపసుతో లైఫ్ యాన్యుటీ లేదా లైఫ్ యాన్యుటీ అనే రెండు ప్లాన్ ఆప్షన్లలో నచ్చిన ప్లాన్ ని ఎంచుకోవచ్చు.
* హెచ్డీఎఫ్సీ లైఫ్ సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ ఫీచర్లు
- కస్టమర్లు ప్రీమియం చెల్లింపు కోసం 5 నుంచి 15 ఏళ్ల వరకు వ్యవధిని ఎంచుకునే అవకాశం ఉంది.
- 15 ఏళ్ల వరకు వాయిదా వ్యవధిని ఎంచుకోవచ్చు.
- ఎటువంటి మెడికల్స్, పూచీకత్తు అవసరాలు లేకుండా 24 గంటలలోపే పాలసీ జారీ అవుతుంది. కాకపోతే కస్టమర్లు అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసి చాట్ ద్వారా ప్రీ-కన్వర్షన్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. పరిమిత వ్యవధి వరకు ప్రీమియంలను చెల్లించడం ద్వారా జీవితాంతం హామీని పొందొచ్చు. ఫలానా యాన్యుటీ రేటును ప్రారంభంలోనే హామీ ఇస్తారు. ఇది పాలసీ వ్యవధి వరకు మారదు.
- బర్త్ డే లాంటి స్పెషల్ అకేషన్స్ కోసం మీరు “సేవ్ ది డేట్” ఫీచర్‌తో మీకిష్టమైన యాన్యుటీ పేఔట్ తేదీని ఎంచుకోవచ్చు.
- మరణంపై LA-ROP ఫీచర్‌తో చెల్లించిన మొత్తం ప్రీమియంలను వాపసును తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
- వాయిదా వ్యవధిలో మరణిస్తే.. యాన్యుయిటెంట్కు చెల్లించే డెత్ బెనిఫిట్ మొత్తం ప్రీమియంల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రీమియంపై 6% కాంపౌండ్ వడ్డీతో లెక్కకట్టి ఇస్తారు. అందుకే చెల్లించిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు అందుతుంది. లేదా చెల్లించిన మొత్తం ప్రీమియంలకు 105% అందుకోవచ్చు.
- వాయిదా వ్యవధి తర్వాత, మరణం సంభవించినట్లయితే, లైఫ్ యాన్యుటీ ఎంపిక కింద, డెత్ బెనిఫిట్ అంటూ ఏదీ చెల్లించరు. లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ప్రీమియం ఆప్షన్ తీసుకున్నట్లయితే.. చెల్లించిన మొత్తం ప్రీమియంలకు 105% అందుకోవచ్చు.
- ప్లాన్‌ని ఎంచుకోవడానికి ఒక వ్యక్తికి కనీసం 45 ఏళ్ల వయస్సు ఉండాలి. గరిష్ఠంగా 75 ఏళ్ల వయస్సు ఉండాలి. వీరు 80 ఏళ్ల వయస్సు నుంచి ప్రారంభమయ్యే యాన్యుటీ పొందేలా ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది.
- ప్రీమియం చెల్లింపు వ్యవధి 5 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది.
- వాయిదా వ్యవధి ప్రీమియం చెల్లింపు వ్యవధి నుంచి 15 సంవత్సరాల వరకు ప్రారంభమవుతుంది
- యాన్యుటీ చెల్లింపు అనేది నెలవారీ, త్రైమాసికం, అర్ధ-సంవత్సరం లేదా వార్షికంగా ఉంటుంది. ఇది కస్టమర్ల ఎంపిక పై ఆధారపడి ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.