హోమ్ /వార్తలు /బిజినెస్ /

Investment Schemes: హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ నుంచి 3 కొత్త స్కీమ్స్.. చేరితే అదిరే లాభం!

Investment Schemes: హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ నుంచి 3 కొత్త స్కీమ్స్.. చేరితే అదిరే లాభం!

Investment Schemes: హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ శుభవార్త.. 2 కొత్త స్కీమ్స్, చేరితే అదిరే లాభం!

Investment Schemes: హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ శుభవార్త.. 2 కొత్త స్కీమ్స్, చేరితే అదిరే లాభం!

NFO | మీరు డబ్బులు దాచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా మ్యూచువల్ ఫండ్స్ అయితే బెటరని యోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. 3 కొత్త ఫండ్ స్కీమ్స్ అందుబాటులోకి వచ్చాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Mutual Funds | ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థలైన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ (ICICI) ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ తాజాగా కొత్త స్కీమ్‌ను తీసుకువచ్చాయి. వీటి ఎన్‌ఎఫ్‌వో ఇప్పటికే ప్రారంభం అయ్యింది. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ తీసుకువచ్చిన స్కీమ్ పేరు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్. సెప్టెంబర్ 6 వరకు ఈ ఫండ్ ఎన్ఎఫ్‌వో అందుబాటులో ఉండనుంది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించాలనే లక్ష్యంతో ఈ ఫండ్‌ను తీసుకువస్తున్నారు. పీఎస్‌యూ కంపెనీలకు చెందిన స్టాక్స్‌లో ఈ ఫండ్ ఎక్కువగా (80 శాతం మొత్తాన్ని) డబ్బులను ఇన్వెస్ట్ చేస్తుంది. బీఎస్ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌లోని స్టాక్స్‌కు డబ్బులు పెడుతుంది. బీఎస్ఈ పీఎస్‌యూ ఇండెక్స్ గత 17 ఏళ్ల యావరేజ్ డివిడెండ్ ఈల్డ్ 2.6 శాతంగా ఉంది. ఇదేసమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఈల్డ్ 1.3 శాతం మాత్రమే.

ఒక్క స్కీమ్‌తో 10 లాభాలు.. ఒకేసారి రూ.16 లక్షలు పొందండిలా!

మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ కూడా 2 కొత్త ఫండ్‌ స్కీమ్స్‌ను తీసుకువచ్చింది. ఇవి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్, నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్ అనేవి ఇవి. ఈ రెండు స్కీమ్స్ ఎన్ఎఫ్‌వో నవంబర్ 9 వరకు ఉంటుంది. లాంగ్ టర్మ్‌లో డబ్బులు పెట్టాలని భావించే వారు ఈ స్కీమ్స్‌ను ఎంచుకోవచ్చు.

కలలో కూడా ఊహించనంత లాభం.. రూ.లక్ష పెట్టుబడిపై రూ.5 కోట్ల ప్రాఫిట్!

దాదాపు 95 నుంచి 100 శాతం మొత్తాన్ని ఈ ఫండ్స్ సంబంధిత ఇండెక్స్‌లల్లోనూ ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఇక మిగిలిన 5 శాతం మొత్తాన్ని మనీ మార్కెట్ లేదా డెట్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. హెచ్‌డీఫ్‌సీ నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్‌లో ఎన్ఎస్ఈలో లిస్ట్ అయిన టాప్ 10 పెద్ద ఐటీ స్టాక్స్ ఉంటాయి. అంటే ఇన్ఫోసిస్, టీసీఎస్ , హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్అండ్‌టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్ వంటి స్టాక్స్‌ను గమనించొచ్చు.

అలాగే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లో టాప్ 10 పెద్ద ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ ఉంటాయి. అంటే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బీఎల్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి స్టాక్స్ ఉండనున్నాయి. ఇకపోతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లు కూడా మార్కెట్ రిస్క్‌కు లోబడే ఉంటాయి. అందువల్ల డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారు రిస్క్ ఉంటుందని గుర్తించుకోవాలి.

First published:

Tags: Investments, Mutual Funds, SIP

ఉత్తమ కథలు