Home /News /business /

HDFC HIKES RETAIL PRIME LENDING RATE ON HOUSING LOANS BY 25 BPS FROM TODAY UMG GH

HDFC Housing Loans: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఆ లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ మళ్లీ పెరిగింది..!

కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ..

కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ..

ప్రముఖ హౌసింగ్ ఫైనాన్షియల్‌ కంపెనీ హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) తన కస్టమర్లకు తాజాగా షాక్ ఇచ్చింది. ఈ కంపెనీ తన గృహ రుణాలపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచింది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాల బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు మేర పెంచింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రముఖ హౌసింగ్ ఫైనాన్షియల్‌ కంపెనీ హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) తన కస్టమర్లకు తాజాగా షాక్ ఇచ్చింది. ఈ కంపెనీ తన గృహ రుణాలపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచింది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాల బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. ఈ కొత్త రేటు ఆగస్టు 9 అంటే నేటి నుంచే అమల్లోకి వస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. ఈ రేటు 25 బేసిస్ పాయింట్లు లేదా పావు శాతం పెరగడంతో ఈరోజు నుంచి గృహ రుణాలు తీసుకున్నవారు తమ ఈఎంఐ (EMIs)లకు అధికంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఇటీవల కాలంలో చాలాసార్లు గృహ రుణాలపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచింది. ఇప్పుడు మరోసారి పెంచి గృహ రుణ గ్రహీతలపై ఈఎంఐ భారాన్ని పెంచింది.

"హెచ్‌డీఎఫ్‌సీ అడ్జస్టబుల్ హౌసింగ్ లోన్‌లపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును (RPLR) 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ కొత్త రేటు ఆగస్టు 9, 2022 నుంచి అమలులోకి వస్తుంద"ని హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే విధంగా HDFC ఆర్‌పీఎల్ఆర్ (RPLR)ని 25 బేసిస్ పాయింట్లు గతంలోనే పెంచింది. మళ్లీ ఇప్పుడు మరో 25 బేసిస్ పాయింట్లు పెంచడం గమనార్హం. ఈ సంవత్సరం మే నుంచి ఈ కీలక రుణ రేటు ఆరు సార్లు పెరిగింది. మొత్తంగా చూసుకుంటే మే నెల నుంచి ఈ లెండింగ్ రేటు ఏకంగా 140 బేసిస్ పాయింట్లు ఎగబాకింది. మూడు నెలల కాలంలోనే ఆర్‌పీఎల్ఆర్ (RPLR) చాలా అధికంగా పెరగడం వల్ల గృహ రుణగ్రహీతలు అధిక ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోంది.



హెచ్‌డీఎఫ్‌సీ అంతకుముందు రోజు అన్ని రుణ కాల పరిమితుల్లో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును (ఎంసీఎల్‌ఆర్) 5-10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 8, 2022 నుంచి ఇది అమలులోకి వచ్చింది. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే నుంచి రెపో రేటును పెంచుతూ వస్తోంది. దాంతో చాలా ఆర్థిక సంస్థలు తమ రుణ రేట్లను భారీ ఎత్తున పెంచుతూ తమ కస్టమర్లపై భారం మోపుతున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటును బాగా పెంచుతుండటంతో గత మూడు నెలల్లో రెపో రేటు ఏకంగా 5.4 శాతానికి పెరిగింది. రేపో రేటు అంటే ఆర్‌బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు. ఈ రేటు పెరిగితే బ్యాంకులు తమ దగ్గర రుణాలు తీసుకున్న కస్టమర్లపై కూడా వడ్డీ రేట్లు పెంచుతాయి.
Published by:Mahesh
First published:

Tags: EMI, HDFC bank, Housing Loans, Interest rates

తదుపరి వార్తలు