హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC Rate Hike: హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం.. కొత్త ఏడాది ముందు కస్టమర్లకు షాక్!

HDFC Rate Hike: హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం.. కొత్త ఏడాది ముందు కస్టమర్లకు షాక్!

HDFC Rate Hike: హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం.. కొత్త ఏడాది ముందు కస్టమర్లకు షాక్!

HDFC Rate Hike: హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం.. కొత్త ఏడాది ముందు కస్టమర్లకు షాక్!

HDFC News | హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ రోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి వస్తాయి. దీంతో చాలా మందిపై ప్రభావం పడనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Loan EMI | హోమ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) నుంచి లోన్ తీసుకోవాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. అధిక వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పటికే లోన్ (Loan) తీసుకొని ఉంటే.. వారి నెలవారీ ఈఎంఐ పైకి కదిలే అవకాశం ఉంటుంది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ నిర్ణయంతో కస్టమర్లపై ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్‌పీఎల్ఆర్)ను పెంచేసింది. 35 బేసిస్ పాయింట్ల మేర పైకి కదిలింది. డిసెంబర్ 20 నుంచి రేట్ల పెంపు అమలులోకి వస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. అంటే నేటి నుంచి రేట్ల పెంపు వర్తిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీలో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు 8.65 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. క్రెడిట్ స్కోర్ 800 లేదా ఆపైన ఉన్న వారికి ఈ రుణ రేట్లు వర్తిస్తాయి.

కస్టమర్లకు భారీ శుభవార్త అందించిన బ్యాంక్.. ఈరోజు నుంచి..

హెచ్‌డీఎఫ్‌సీ రుణ రేట్లు పెంపు నిర్ణయాన్ని బీఎస్‌ఈకి నివేదించింది. హౌసింగ్ లోన్స్‌పై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచుతున్నట్లు తెలిపింది. రేట్ల పెంపు 35 బేసిస్ పాయింట్లు ఉందని, డిసెంబర్ 20 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. కాగా హెచ్‌డీఎఫ్‌సీ ఆర్‌పీఎల్ఆర్ ప్రాతిపదికన అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్‌ను నిర్ణయిస్తుంది.

శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర, తాజా రేట్లు ఇలా!

రేటు పెంపు నేపథ్యంలో బ్యాంక్ అకౌంట్ నుంచి హోమ్ లోన్ కింద కట్ అయ్యే ఈఎంఐ మొత్తం కూడా పెరగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ పలు అంశాల ప్రాతిపదికన రుణ రేట్లను నిర్ణయిస్తుంది. క్రెడిట్ స్కోర్ బాగున్న వారు ఆఫర్ కూడా పొందొచ్చు. తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ సొంతం చేసుకోవచ్చు. వడ్డీ రేటు 8.2 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అయితే ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31 వరకే అందుబాటులో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ స్పెషల్ హౌసింగ్ లోన్ స్కీమ్ కింద ఈ తక్కువ వడ్డీతో కస్టమర్లకు రుణాలు ఆఫర్ చేస్తోంది. 800 లేదా ఆపైన క్రెడిట్ స్కోర్ కలిగిన వారు ఈ ఆఫర్ పొందొచ్చు.

ఇకపోతే ఆర్‌బీఐ రెపో రేటు పెంచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకులు సహా ఇతర ఫైనాన్స్ కంపెనీలు కూడా రుణ రేట్లు పెంచేస్తున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటును ఈ ఏడాదిలో 225 పాయింట్ల మేర పెంచేసింది. ఇటీవల జరిగిన పాలసీ సమీక్షలో కూడా రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు పైకి కదిలింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ రెపో రేటును పెంచుకుంటూ వస్తోంది.

First published:

Tags: Banks, EMI, Hdfc, HDFC bank, Home loan

ఉత్తమ కథలు