కరోనా మహమ్మారి భారత్‌ను కుదిపేస్తున్న సమయంలో చాలామంది ప్రజలు ఆరోగ్య బీమా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పుట్టుకొస్తున్నాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ 'ఆప్టిమా సెక్యూర్' పేరిట ఓ కొత్త ఆరోగ్య బీమా పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ.. ఆసుపత్రిలో చేరినప్పుడు బీమా కవర్ చేస్తుంది. అంతేకాకుండా వైద్యేతర ఖర్చులకు కూడా అదనపు ఛార్జీ తీసుకోకుండా బీమా కవర్ చేస్తుంది. క్లెయిమ్ చేసిన తర్వాత కూడా మొదట హామీ ఇచ్చిన ప్రకారం బీమా మొత్తాన్ని అందిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య బీమా మొత్తాన్ని పెంచుతుంది. డ్రెస్సింగ్, గ్లోవ్స్, మాస్క్‌లు, నెబ్యులైజర్ వంటి వినియోగ వస్తువుల ధరలు ఆసుపత్రి బిల్లులలో 20 శాతం వరకు ఉండటం వల్ల చాలామంది ఆరోగ్య బీమా ప్రీమియం కట్టి కూడా పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన 'ఆప్టిమా సెక్యూర్'.. వినియోగ వస్తువులను కూడా బీమా కింద కవర్ చేస్తామని వెల్లడించింది.
EPF Account: వారం రోజుల్లో ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త
ఆప్టిమా సెక్యూర్‌ను ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో సీఈవో రితేష్ కుమార్ అన్నారు. ఆరోగ్య బీమా కోసం తాము 34% ఖర్చు చేస్తున్నామని, మోటారు బీమా కోసం 27% ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కోవిడ్ మహమ్మారి వల్ల తాము ఆరోగ్య సంరక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధమయ్యామని చెప్పుకొచ్చారు. తమ సంస్థ ఇప్పటికే కరోనా రోగుల క్లెయిమ్‌ల కోసం రూ.16,000 కోట్లు చెల్లించిందని వెల్లడించారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో పాలసీదారులు చేసిన 25% క్లెయిమ్‌లకు చెల్లించిన డబ్బును ఇంకా లెక్క కట్టలేదని వివరించారు.
BSNL: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్... ఆ ప్లాన్‌పై అదనపు బెనిఫిట్స్
LIC Policy: ప్రతీ నెలా కొంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు రిటర్న్స్ పొందొచ్చు ఇలా
కస్టమర్లు కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.2కోట్ల వరకు హెల్త్ పాలసీని ఎంచుకోవచ్చు. ముంబయి చెందిన 36 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకోవాలంటే.. 16 వేల రూపాయలు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. మినహాయింపును ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు ప్రీమియంలో 50% వరకు రాయితీ పొందవచ్చు. "మేము మా కస్టమర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నాం. వారి సమస్యలను పరిష్కరించేందుకు.. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల నుంచి రక్షించేందుకు కొత్త ఆరోగ్య బీమా పాలసీని తీసుకొచ్చాం. మా హెల్త్ పాలసీ కస్టమర్లకు అద్భుతమైన విలువను అందిస్తుంది. కస్టమర్లకు నాలుగు విభిన్న కవరేజ్‌లు అయినది సెక్యూర్, ప్లస్, ప్రొటెక్ట్, రిస్టోర్ ప్లాన్లను పాలసీ అందిస్తుంది” అని సంస్థ యాక్సిడెంట్ అండ్ హెల్త్ బిజినెస్ ప్రెసిడెంట్ రవి విశ్వనాథ్ చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hdfc, Health Insurance, Personal Finance