Home Loan: కొత్త ఇల్లు కొంటున్నారా..గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన HDFC

గృహ రుణాలపై హెచ్‌డీఎఫ్‌సీ తగ్గింపులను ప్రకటించింది. తాజాగా హోమ్ లోన్‌లపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR)ను తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీంతో ఎడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్ (ARHL) బెంచ్ మార్క్ 10 బేసిస్ పాయింట్లు తగ్గింది.

news18-telugu
Updated: November 16, 2020, 5:51 PM IST
Home Loan: కొత్త ఇల్లు కొంటున్నారా..గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన HDFC
Home Loan (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గృహ రుణాలపై హెచ్‌డీఎఫ్‌సీ తగ్గింపులను ప్రకటించింది. తాజాగా హోమ్ లోన్‌లపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR)ను తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీంతో ఎడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్ (ARHL) బెంచ్ మార్క్ 10 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఇది నేటి నుంచే అమల్లోకి వస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ మార్పు వల్ల ప్రస్తుతం ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ రిటైల్ హోమ్ లోన్ వినియోగదారులందరికీ ప్రయోజనం చేకూరుతుందని HDFC తెలిపింది.

 లోన్ అప్రూవల్‌లు పెరిగాయి

హౌసింగ్ ఫైనాన్స్ రంగం అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయని ఈ నెల ప్రారంభంలో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) ప్రకటించింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ(HFC)లను నేషనల్‌ హౌసింగ్ బ్యాంకు నియంత్రిస్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబరులో HFCలు హౌసింగ్, నాన్-హౌసింగ్ రుణాలకు ఇచ్చిన అప్రూవల్‌లు ఇంతకు ముందుతో పోలిస్తే 130 శాతం వరకు పెరిగాయని NHB ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే, 2020 సెప్టెంబరులో హెచ్‌ఎఫ్‌సీలు అందించిన గృహ రుణాలు 105 శాతం వరకు పెరిగాయని ఎన్‌హెచ్‌బీ వెల్లడించింది. పండుగ సీజన్ సందర్భంగా గృహరుణాలు ఇచ్చే సంస్థలు వడ్డీ రేట్లను చాలా వరకు తగ్గించాయి. వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా తగ్గింపులను ప్రకటించాయి. ఫలితంగా ఎక్కువ మంది వినియోగదారులు రుణ దాతలను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

పెరిగిన షేర్ విలువ

తాజా మార్పుల ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో HDFC షేర్ల విలువ ఈ రోజు మధ్యాహ్నం ఐదు శాతం పెరిగింది. దీంతో ఒక్కో షేర్‌ విలువ రూ.2257కు చేరుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో తమ లాభం 27 శాతం తగ్గిందని హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ నెల ప్రారంభంలో వెల్లడించింది. దీని వల్ల కంపెనీ లాభాలు రూ.2,870.12 కోట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరంలో ఈ సంస్థ రూ.3,962 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ అక్టోబర్‌లో గృహ రుణాల పంపిణీ ఊహించిన దానికంటే మెరుగ్గా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే లోన్ అప్రూవల్‌లు 58 శాతం పెరిగాయి. రుణ పంపిణీ (loan disbursements) 35 శాతం పెరగడం విశేషం.
Published by: Krishna Adithya
First published: November 16, 2020, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading