హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లోనే అన్నీ.. సరికొత్త సర్వీస్‌లు లాంచ్..!

HDFC బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లోనే అన్నీ.. సరికొత్త సర్వీస్‌లు లాంచ్..!

HDFC బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లోనే అన్నీ రకాల సేవలు.

HDFC బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లోనే అన్నీ రకాల సేవలు.

వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసులను మరింత మెరుగుపరిచింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. స్మార్ట్ చాట్ అసిస్ట్, 90కి పైగా బ్యాంకింగ్ సేవలు, స్మార్ట్ AIతో సహా మరిన్ని సేవలను వాట్సాప్‌లో సరికొత్త HDFC బ్యాంక్ చాట్‌బ్యాంకింగ్‌తో అందుబాటులోకి తెచ్చామని తాజాగా ఆ సంస్థ తెలిపింది.

ఇంకా చదవండి ...

బ్యాంకింగ్ (Banking) పనులు పూర్తి చేయడం చాలా సమయంతో పాటు శ్రమతో కూడుకున్న పని. అయితే డిజిటల్ వాడకం పెరిగిపోయిన తర్వాత బ్యాంకింగ్ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇంట్లో కూర్చునే అన్ని బ్యాంకింగ్ పనులు చేసుకోవడం సాధ్యమవుతోంది. కొన్ని బ్యాంకులు తమ సేవలను మరింత ఈజీగా తమ కస్టమర్లు పొందేలా వాట్సాప్ (WhatsApp) సర్వీసులు కూడా లాంచ్ చేస్తున్నాయి. గతంలో ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) వాట్సాప్ సర్వీసులను ప్రారంభించింది. కాగా తాజాగా ఈ సంస్థ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసులను మరింత మెరుగుపరిచింది. స్మార్ట్ చాట్ అసిస్ట్, 90కి పైగా బ్యాంకింగ్ సేవలు, స్మార్ట్ AIతో సహా మరిన్ని సేవలను వాట్సాప్‌లో సరికొత్త HDFC బ్యాంక్ చాట్‌బ్యాంకింగ్‌తో అందుబాటులోకి తెచ్చామని తాజాగా ఆ సంస్థ తెలిపింది. 7070022222కి వాట్సాప్‌లో హాయ్ అని పంపడం ద్వారా ఈ సేవలను యూజర్లు పొందవచ్చు.

వాట్సాప్ ద్వారా చాలా బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ట్విట్టర్ వేదికగా ఇటీవలే ప్రకటించింది. "స్మార్ట్ చాట్ అసిస్ట్, 90+ బ్యాంకింగ్ సేవలు, సహజమైన AI, మరిన్ని, ఇప్పుడు WhatsAppలో సరికొత్త HDFC బ్యాంక్ చాట్‌బ్యాంకింగ్‌తో మీ అరచేతిలో ఉంటాయి. కాబట్టి, సూపర్ ఫ్రెండ్లీ బ్యాంకింగ్ అనుభవం కోసం 7070022222కి హాయ్ అని చెప్పండి" అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి: ఓరి నీ సర్ప్రైజ్ పాడుగాను.. హారం పోయిందని పెళ్లికొడుకు నాటకం.. చివరికి ఏం జరిగిందంటే !


వాట్సాప్‌లో HDFC సర్వీసులను ఎలా పొందాలి?

స్టెప్ 1: కస్టమర్లు మొదటగా తమ ఫోన్ కాంటాక్ట్స్‌లో చాట్ బ్యాంకింగ్ నంబర్ 7070022222ని సేవ్ చేయాలి. బ్యాంక్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7070022222కి వాట్సాప్‌లో “హాయ్” లేదా “రిజిస్టర్” అని పంపించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాట్సాప్‌లో HDFC బ్యాంక్ చాట్ బ్యాంకింగ్‌ని యాక్టివేట్ చేయడానికి మీ కస్టమర్ ID, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా అందిన వన్ టైమ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.

స్టెప్ 2: ఆ తర్వాత అకౌంట్ సర్వీసెస్, క్రెడిట్ కార్డ్ సర్వీసెస్, న్యూ ప్రొడక్ట్స్ వంటి సేవలను యాక్సెస్ చేయవచ్చు. అకౌంట్ సర్వీసెస్ పై క్లిక్ చేయడం ద్వారా ఆ సేవకు సంబంధించిన వివరాలు పొందవచ్చు.

స్టెప్ 3: అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేయడం లేదా మినీ స్టేట్‌మెంట్ పొందడం వంటి ట్రాన్సాక్షన్లకు సంబంధించిన సేవల కోసం అకౌంట్ సర్వీసెస్ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. దీని కింద బ్యాలెన్స్ ఎంక్వయిరీ, రీసెంట్ 7 డేస్ ట్రాన్సాక్షన్స్‌, అకౌంట్ స్టేట్‌మెంట్‌తో సహా మరిన్ని ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.

స్టెప్ 4: చాట్‌బాట్‌లో కనిపించే సూచనలను అనుసరిస్తూ కస్టమర్లు తమకు కావాల్సిన సేవలను పొందవచ్చు.

ఈ వాట్సాప్ సర్వీస్ పూర్తిగా ఉచితం. వాట్సాప్‌లో కొత్త HDFC చాట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించినందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవని గమనించాలి. అకౌంట్స్, కార్డ్‌లు, లోన్‌లు, ఇతర ప్రొడక్ట్స్‌కి దరఖాస్తు చేయడానికి బ్యాంకులో అకౌంట్ లేకపోయినా వాట్సాప్‌లో చాట్ బ్యాంకింగ్‌ని మీరు ఉపయోగించవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లందరూ వారి అకౌంట్స్, కార్డ్‌లు, లోన్‌లకు సంబంధించిన వివరాలను పొందడానికి, కొత్త ప్రొడక్ట్స్‌కి, సేవల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చాట్ బ్యాంకింగ్‌ని యూజ్ చేయవచ్చు.

First published:

Tags: Bank news, HDFC bank, Mobile Banking, Online service

ఉత్తమ కథలు