HDFC Bank Alert: ఆ యాప్‌ను వాడొద్దని కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వార్నింగ్...డౌన్లోడ్ చేస్తే డబ్బు గోవిందా !

HDFC Bank Alert | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కస్టమర్ల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎనీ డెస్క్ యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఆర్‌బీఐ సైతం అన్ని బ్యాంకులకు ఈ విషయం దృష్టికి తేగా, తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ముందుకు వచ్చి ఎనీ డెస్క్ యాప్‌పై కస్టమర్లందరికీ హెచ్చరిక జారీ చేసింది.

news18-telugu
Updated: March 23, 2019, 5:52 PM IST
HDFC Bank Alert: ఆ యాప్‌ను వాడొద్దని కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వార్నింగ్...డౌన్లోడ్ చేస్తే డబ్బు గోవిందా !
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 23, 2019, 5:52 PM IST
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కస్టమర్ల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎనీ డెస్క్ యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఆర్‌బీఐ సైతం అన్ని బ్యాంకులకు ఈ విషయం దృష్టికి తేగా, తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ముందుకు వచ్చి ఎనీ డెస్క్ యాప్‌పై కస్టమర్లందరికీ హెచ్చరిక జారీ చేసింది. తన కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ పంపిన మెసేజెస్ లో "మోసగాళ్లు కొందరు, ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని, 9 డిజిట్ కోడ్ తమతో షేర్ చేసుకోమని అడుగుతారు, ఒక వేళ అలా చేస్తే మీ ఫోన్ హ్యాకర్ల బారిన పడుతుందని, అలా మీ అకౌంట్‌లలో డబ్బులు మాయమవడం ఖాయమని" పేర్కొంది. ముఖ్యంగా ఎనీ డెస్క్ యాప్ ద్వారా సైబర్ కేటుగాళ్లు మీ ఫోన్‌ను ఆపరేట్ చేసి యూపీఐ ద్వారా డబ్బులు కొట్టేస్తున్నట్లు గుర్తించారు. ఇటీవలే దేశంలోని పలు నగరాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు.

మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు:

- ముందుగా కేటుగాళ్లు మీకు ఫోన్ చేసి యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే, మంచి ఆఫర్లు ఇస్తామని, ప్రమోషన్ యాప్ అంటూ ఊరిస్తారు. లేదంటే బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని మొబైల్ బ్యాంకింగ్ ‌లో లోపాలు ఉన్నాయని వాటిని సరిచేయాలంటే ఎనీ డెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ వెంటనే వచ్చిన 9 అంకెల కోడ్ చెప్పమని కోరుతారు.

- పొరపాటున కోడ్ కేటుగాళ్లకి చెప్పారంటే చాలు వెంటనే మీ డబ్బు మోసగాళ్ల అకౌంట్లకు జారిపోతుంది.



- అలాగే మీ ఫోన్ లో ఇతర డేటా కూడా ఆగంతకుల చేతిలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఈ మెయిల్స్, ఫోటోలు, కాంటాక్ట్స్ సైతం దుండగుల చేతిలో పడే ప్రమాదం ఉంది.

- ఒక వేళ పొరపాటున యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే వెంటనే బ్యాంకును సంప్రదించి మీ అకౌంట్‌ను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయించుకోవచ్చు.

- ముఖ్యంగా తెలియని కాంటాక్టుల నుంచి మెసేజ్‌లు, వాట్సప్‌ల రూపంలో వచ్చే లింకులను సైతం ఓపెన్ చేయకుండా దూరంగా ఉండాలని బ్యాంకు హెచ్చరికలో పేర్కొంది.
First published: March 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...