హోమ్ /వార్తలు /బిజినెస్ /

Interest Rates: ఈ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి... ఈఎంఐలు భారం, ఎఫ్‌డీలపై అధిక వడ్డీ

Interest Rates: ఈ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి... ఈఎంఐలు భారం, ఎఫ్‌డీలపై అధిక వడ్డీ

Interest Rates: ఈ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి... ఈఎంఐలు భారం, ఎఫ్‌డీలపై అధిక వడ్డీ
(ప్రతీకాత్మక చిత్రం)

Interest Rates: ఈ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి... ఈఎంఐలు భారం, ఎఫ్‌డీలపై అధిక వడ్డీ (ప్రతీకాత్మక చిత్రం)

Interest Rates | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్‌ను 50 బేసిస్ పాయింట్స్ పెంచడంతో బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఈఎంఐలు భారం కానున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినవారికి అధిక వడ్డీ రానుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెండు రోజుల క్రితం వడ్డీ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. రెపో రేట్‌ను (Repo Rate) 50 బేసిస్ పాయింట్స్ అంటే 50 పైసలు పెంచింది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షా సమావేశంలో అర శాతం వడ్డీ పెంచడంతో రెపో రేట్ 4.50 శాతం నుంచి 4.90 శాతానికి పెరిగింది. ఆర్‌బీఐ వడ్డీ రేటు పెంచడం 36 రోజుల్లో ఇది రెండో సారి. మేలో 40 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది. బ్యాంకులు కూడా ఆమేరకు వడ్డీ పెంచుతున్నాయి. ఓవైపు హోమ్ లోన్ (Home Loan) సహా ఇతర రుణాల వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంకులు, మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా పెంచుతున్నాయి. మరి ఇప్పటి వరకు ఏఏ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయో తెలుసుకోండి.

HDFC: హౌజింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (HDFC Limited) 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటును పెంచింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీలో హోమ్ లోన్ తీసుకునేవారు అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐలు మరింత భారం కానున్నాయి.

Bank Strike: ఖాతాదారులకు అలర్ట్... వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఆర్‌బీఐ పాలసీ రేట్స్‌కి అనుగుణంగా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ పెంచింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ 50 పైసలు పెరిగింది. జూన్ 8 నుంచి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ 8.60 శాతం అమలులోకి వచ్చిందని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది.

HDFC Bank: మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అన్ని రకాల పర్సనల్ లోన్లపై 35 బేసిస్ పాయింట్స్ అంటే 35 పైసలు వడ్డీ పెంచింది. దీంతో హోమ్ లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్ రేట్లు పెరిగాయి. ఈ రుణాలు తీసుకునేవారు అదనంగా ఈఎంఐలు చెల్లించాలి.

Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రెపో లింక్డ్ లెండింగ్ రేట్ 50 బేసిస్ పాయింట్స్ పెంచింది. దీంతో గతంలో 6.90 శాతంగా ఉన్న రెపో లింక్డ్ లెండింగ్ రేట్ 7.40 శాతానికి చేరుకుంది.

UPI Payment: యూపీఐ పేమెంట్ ఫెయిలై డబ్బులు కట్ అయ్యాయా? వాట్సప్‌లో కంప్లైంట్ చేయండిలా

State Bank of India: ఆర్‌బీఐ రెపో రేట్ పెంచడం కన్నా ముందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్‌ను 40 బేసిస్ పాయింట్స్ పెంచింది. దీంతో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్‌ 7.05 శాతానికి పెరిగింది. ఈ వడ్డీ రేటు జూన్ 1 నుంచే అమలులోకి వచ్చింది.

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేట్‌ను 50 బేసిస్ పాయింట్స్ పెంచింది. దీంతో రీటైల్ లోన్లకు రెపో లింక్డ్ లెండింగ్ రేట్‌ 7.40 శాతం జూన్ 9 నుంచి అమలులోకి వచ్చింది.

PNB: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రెపో లింక్డ్ లెండింగ్ రేట్‌ను 50 బేసిస్ పాయింట్స్ పెంచింది. 2022 జూన్ 9 నుంచి 7.40 శాతం వడ్డీ అమలులోకి వచ్చింది.

Bank of India: బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆర్‌బీఎల్ఆర్ పెంచింది. 2022 జూన్ 8 నుంచి 7.75 శాతం వడ్డీ అమలులోకి వచ్చింది.

RBL Bank: ఆర్‌బీఎల్ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. వేర్వేరు కాల వ్యవధులకు సాధారణ ప్రజలకు 3.25 శాతం నుంచి 5.75 శాతం మధ్య, వృద్ధులకు 3.75 శాతం నుంచి 6.25 శాతం మధ్య వడ్డీ ఆఫర్ చేస్తోంది.

Kotak Mahindra Bank: కొటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో పాటు సేవింగ్స్ అకౌంట్‌పై ఇచ్చే వడ్డీని కూడా పెంచింది. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు జూన్ 9 నుంచి అమలులోకి వస్తే, సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు జూన్ 13 నుంచి అమలులోకి రానుంది. సేవింగ్స్ అకౌంట్‌పై 4 శాతం వడ్డీ ఇవ్వనుంది కొటక్ మహీంద్రా బ్యాంక్.

First published:

Tags: Banking, Interest rates, Personal Finance, Rbi, Repo rate, Reserve Bank of India

ఉత్తమ కథలు