హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC Bank News: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు అదిరే శుభవార్త!

HDFC Bank News: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు అదిరే శుభవార్త!

HDFC Bank News: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు అదిరే శుభవార్త!

HDFC Bank News: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు అదిరే శుభవార్త!

HDFC News | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెద్దగానే ప్లాన్ వేస్తోంది. నెలకు 10 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం బ్యాంక్ పలు రకాల కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

HDFC Credit Card | ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు (Credit Card) మార్కెట్‌పై ఎక్కువగా ఫోకస్ చేసింది. నెలకు 10 లక్షల క్రెడిట్ కార్డుల జారీని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రెండేళ్ల కిందట ఆర్‌బీఐ ఈ బ్యాంక్‌పై (Bank) కొంత కాలం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కొత్త కార్డులను జారీ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ క్రమంలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెలలో 10 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పలు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. దీని వల్ల కస్టమర్లకు కూడా కొత్త కొత్త కార్డులు అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెలకు 5 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేస్తోంది. అయితే ఈ లక్ష్యాన్ని రెట్టింపు చేయాలని బ్యాంక్ ప్లాన్ వేస్తోంది. నెలకు 10 లక్షల క్రెడిట్ కార్డులను ఇష్యూ చేయాలని భావిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ అండ్ మార్కెటింగ్, కన్సూమర్ ఫైనాన్స్, పేమెంట్స్ బిజినెస్ హెడ్ పరాగ్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు. దీని కోసం బ్యాంక్ పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ఆన్‌లైన్ రిటైల్ నుంచి ఫుడ్ డెలివరీ వరకు పలు రకాల సంస్థలతో బ్యాంక్ భాగస్వామ్యం చేసుకోనుంది. రానున్న రోజుల్లో బ్యాంక్ ఈ విషయాలను వెల్లడించనుంది.

ఈ 12 కార్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.2.5 లక్షల వరకు తగ్గింపు!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై ఆర్‌బీఐ నిషేధం 8 నెలల వరకు కొనసాగింది. గత ఏడాది ఆగస్ట్ నెలలో ఈ ఆంక్షలను ఎత్తివేసింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం చూస్తే.. అక్టోబర్ నెలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాటానే ఆన్‌లైన్ స్పెండింగ్‌లో ఎక్కువగా ఉంది. ఏకంగా 29 శాతం వాటాను ఆక్రమించింది. కేవలం క్రెడిట్ కార్డుల జారీపై మాత్రమే కాకుండా కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించడం, అధిక విలువ చేకూర్చడం వంటి అంశాలకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పరాగ్ తెలిపారు.

కస్టమర్లకు కొత్త ఏడాది కానుక.. 3 బ్యాంకుల కీలక నిర్ణయం!

రెండు ఎయిర్ లైన్స్, పెద్ద హోటల్ చైన్ కంపెనీలతో రానున్న వారాల్లో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నామని ఆయన వెల్లడించారు. అలాగే కొత్త డిజిటల్ క్రెడిట్ కార్డు సర్వీసులు అందుబాటులోకి తెస్తామని, వీటి అభివృద్ధిలో చివరి దశకు చేరుకున్నామని ఆయన వివరించారు. యంగ్ కస్టమర్లను ఆకర్షించడం కోసం ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. రూపే కార్డుల వినియోగం నానాటికీ ఎక్కువ అవుతోందని, అందువల్ల వీటిపై కూడా కన్నేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ విలీనం గురించి మాట్లాడారు. ఈ విలీనం పూర్తి అయితే గ్లోబల్‌గా ఇది హోమ్ లోన్స్‌ విభాగంలో అతిపెద్ద డీల్‌గా అవతరిస్తుందని పేర్కొన్నారు.

First published:

Tags: Banks, Credit card, Hdfc, HDFC bank

ఉత్తమ కథలు