HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు(HDFC Customers) శుభవార్త. ఈ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ వడ్డీరేట్లను(Intrest rates) సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరిలో సీనియర్ సిటిజన్లకు సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై(FD) వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకున్న రెండు నెలలకే తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. నాన్ విత్‌డ్రా ఎఫ్‌డీలు (వీటినే నాన్ కాలబుల్ డిపాజిట్లు అని కూడా అంటారు)లపై వడ్డీ రేటును సవరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది. మెచ్యూరిటీ గడువుకు ముందు విత్ డ్రా చేసుకునేందుకు వీలులేని నాన్-విత్‌డ్రా డిపాజిట్లపై గరిష్ఠ వడ్డీ రేటును 7.90 శాతానికి పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.
సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్మును మన అవసరాలకు వాడుకుంటాం. ఈ డిపాజిట్లపై వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఎఫ్‌డీల్లో వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో ప్రీమెచ్యూర్‌కు అవకాశం ఉండదు. అంటే నిర్ణీత కాలపరిమితికి ముందే ఈ ఖాతాల్లో నుంచి డబ్బులు డ్రా చేయలేం.
ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే ఈ ఎఫ్‌డీ మొత్తాన్ని విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కోర్టు చెప్పినప్పుడు, చట్టపరమైన సంస్థలు లేదా రెగ్యులేటరీ అథారిటీలు ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే గడువుకు ముందుగా డిపాజిట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇలాంటి సందర్భంలో వడ్డీ రాదు. ఎఫ్‌డీ చేసిన వ్యక్తి మరణించినప్పుడు ప్రీమెచ్యూర్ విత్ డ్రాకు అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంలో వడ్డీ వస్తుంది. ముందుగా నిర్ణయించిన అగ్రిమెంట్ ప్రకారమే దీన్ని చెల్లిస్తారు.
TCS: జులై 1 నుంచి విదేశీ ప్రయాణం భారం..ఫారెన్ టూర్ ప్యాకేజీపై 20% ట్యాక్స్
* నాన్ విత్‌డ్రా ఎఫ్‌డీలపై వడ్డీ ఇలా
తాజాగా ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ నాన్ విత్‌డ్రా ఎఫ్‌డీలపై లబ్ధి పొందాలంటే పూర్తి టెన్యూర్ బ్యాంకులోనే ఉంచాలి. ఇందులో గరిష్ఠంగా 7.90% వరకు వడ్డీ చెల్లిస్తున్నారు.
ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల కాలపరిమితికి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ఉండే నాన్ కాలబుల్ ఎఫ్‌డీలపై ఈ బ్యాంకు 7.35% వరకు వడ్డీ ఇవ్వనుంది. అదే మొత్తానికి రెండు సంవత్సరాల ఒక రోజు నుంచి మూడు సంవత్సరాల కాలపరిమితికి 7.30% వడ్డీ ఇస్తోంది. మూడు సంవత్సరాల ఒకరోజు నుంచి పదేళ్ల మెచ్యూరిటీ డిపాజిట్లపై 7.25 % వడ్డీని బ్యాంకు ఆఫర్ చేస్తుంది.
12 నుంచి 15 నెలల కాలపరిమితి ఉన్న రూ.500 కోట్లకు పైబడిన నాన్ విత్‌డ్రా ఎఫ్‌డీలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గరిష్ఠంగా 7.90% వడ్డీ ఇవ్వనున్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచిన పట్టికలో పేర్కొంది. ఈ వడ్డీలు 2023 మార్చి 29 నుంచి అమలులోకి వస్తాయని తన వెబ్‌సైట్‌లో వివరించింది.
* మరో ముఖ్యమైన అంశం
నాన్ విత్‌డ్రా ఎఫ్‌డీల్లో స్వీప్- ఇన్, పార్షియల్ విత్‌డ్రాకు అవకాశం ఉండదు. క్వార్టర్లీ బేస్ మీద ఆరునెలల కంటే ఎక్కువ కాలానికి చేసే వాటికి వడ్డీ చెల్లిస్తారు. డెత్ క్లెయిమ్‌లో ఒప్పందం కుదుర్చుకున్న సమయయానికి ఉన్న వడ్డీ రేటు లేదా ప్రస్తుతం సమయానికి ఉన్న బేస్‌రేట్.. ఏది తక్కువగా ఉంటే దాని ఆధారంగా వడ్డీ చెల్లిస్తారు. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ఉండే డిపాజిట్లకు రూ.2 కోట్లకు, రూ.5 కోట్లకు మించి చేసే డిపాజిట్లకు రూ.5 కోట్లకు వడ్డీ లెక్కకట్టి చెల్లించనున్నట్లు బ్యాంకు వెబ్‌సైట్‌లో తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.