HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీలో వడ్డీ రేట్లు మారాయి... కొత్త రేట్లు ఇవే

HDFC Bank latest FD rates | సాధారణ ప్రజల కన్నా సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అంటే వృద్ధులు ఫిక్స్‌డ్ చేస్తే అరశాతం వడ్డీ ఎక్కువగా పొందొచ్చు.

news18-telugu
Updated: November 18, 2019, 5:00 PM IST
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీలో వడ్డీ రేట్లు మారాయి... కొత్త రేట్లు ఇవే
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీలో వడ్డీ రేట్లు మారాయి... కొత్త రేట్లు ఇవే (ప్రతీకాత్మక చిత్రం, image: Getty Images)
  • Share this:
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 16 నుంచే అమలులోకి వచ్చినట్టు బ్యాంకు ప్రకటించింది. కొద్ది రోజుల క్రితమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫిక్స్‌‍డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే కాలవ్యవధిని బట్టి వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, రూ.2 కోట్లు పైబడిన డిపాజిట్లకు వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కొత్త వడ్డీ రేట్ల వివరాలు చూస్తే రూ.2 కోట్ల లోపు 7 రోజుల నుంచి 14 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 3.50% వడ్డీ వస్తుంది. 15 రోజుల నుంచి 29 రోజుల కాలవ్యవధిపై 4.00% వడ్డీ పొందొచ్చు. 30 రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 4.90% వడ్డీ, 46 రోజుల నుంచి 60 వరకు 5.40% వడ్డీ, 61 రోజుల నుంచి 90 వరకు 5.40% వడ్డీ, 91 రోజుల నుంచి ఆరు నెలల వరకు 5.40% వడ్డీ, 6 నెలల నుంచి 9 నెలల వరకు 5.80% వడ్డీ, 9 నెలల నుంచి 1 ఏడాది వరకు 6.05% వడ్డీ పొందొచ్చు.

ఒక ఏడాది నుంచి రెండేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 15 బేసిస్ పాయింట్స్ వడ్డీ తగ్గించింది. దీంతో 6.30% వడ్డీ మాత్రమే లభిస్తుంది. లాంగ్ టర్మ్ ఫిక్స్‌డి డిపాజిట్లపైనా 15 బేసిస్ పాయింట్లు వడ్డీ తగ్గింది. అదే రెండేళ్ల నుంచి మూడేళ్లకు 6.40% వడ్డీ, మూడేళ్ల నుంచి ఐదేళ్లకు 6.30% వడ్డీ, ఐదేళ్ల నుంచి 10 ఏళ్లకు 6.30% వడ్డీ లభిస్తుంది. సాధారణ ప్రజల కన్నా సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అంటే వృద్ధులు ఫిక్స్‌డ్ చేస్తే అరశాతం వడ్డీ ఎక్కువగా పొందొచ్చు.

Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

SBI: మీ ఎస్‌బీఐ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉందా? లేకపోతే ఈ ఫైన్లు తప్పవు

SBI Card: ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతుంది జాగ్రత్తIRCTC: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఫ్లైట్‌లో తిరుపతి టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
First published: November 18, 2019, 5:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading