Home /News /business /

HDFC BANK RAISES FIXED DEPOSIT INTEREST RATES HERE ARE THE LATEST FD RATES GH VB

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచిన HDFC బ్యాంక్.. తాజా FD రేట్ల వివరాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై HDFC బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత అయిన ఈ బ్యాంకు, డిపాజిట్లను ఆకర్షించడానికి వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై HDFC బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత అయిన ఈ బ్యాంకు, డిపాజిట్లను ఆకర్షించడానికి వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ కాల వ్యవధికి రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కొత్త రేట్లు వర్తిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రధాన బ్యాంకులు అన్నీ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి.
తొమ్మిది నెలలకు పైగా గడువుతో తీసుకున్న ఎఫ్‌డీలకు కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ రేట్ల పెంపు మెచూరిటీని బట్టి 10 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు ఉంటుంది. సీనియర్ సిటిజన్‌లు 0.50 శాతం అదనపు రాబడి పొందుతారు. 2022 మే 18 నుంచి అమల్లోకి వచ్చిన తాజా వడ్డీ రేట్ల వివరాలు తెలుసుకుందాం.

15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం

30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

Shocking: పోలీస్ స్టేషన్ లో మహిళపై చిత్ర హింసలు.. బూట్లతో తన్ని, కరెంట్ షాక్.

46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం

6 నెలల 1 రోజుల నుంచి 9 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

9 నెలల 1 రోజు నుంచి ఒక సంవత్సరం వరకు: సాధారణ ప్రజలకు - 4.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం

1 సంవత్సరం: జనరల్ పబ్లిక్‌కు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం

1 సంవత్సరం 1 రోజు నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం

2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.90 శాతం

3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.10 శాతం

5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.50 శాతం

ఇటీవల RBI రెపో రేటును పెంచిన తర్వాత SBI, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇతర ప్రముఖ బ్యాంకులన్నీ ఇప్పటికే FD రేట్లను పెంచాయి. ఈ క్రమంలో HDFC బ్యాంక్ కూడా FD వడ్డీ రేట్లు పెంచింది.
Published by:Veera Babu
First published:

Tags: FD rates, HDFC bank

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు