FD Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) వరుసగా రెపో రేటును పెంచుతుండటంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి చర్యల్లో భాగంగా వరుసగా నాలుగోసారి గతవారం ఆర్బీఐ రెపో రేటును పెంచింది. దీంతో ప్రధాన బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా ప్రైవేట్‌రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) రూ.2 కోట్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. పెరిగిన రేట్లు డిసెంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చాయి. 7 రోజుల నుంచి పదేళ్ల కాలపరిమితి గల వివిధ ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు 3 నుంచి 7 శాతం వరకు వడ్డీరేట్‌ను తాజాగా ఆఫర్ చేస్తోంది. ఇక సీనియర్ సిటిజన్స్‌కు సాధారణ ప్రజలతో పోల్చితే అదనంగా 0.50 శాతం వడ్డీని అందిస్తోంది.
రూ.2 కోట్లలోపు ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ రేట్లు ఇలా..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7 రోజుల నుంచి 14 రోజుల కాలపరిమితి FDలపై సాధారణ ప్రజలకు 3 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. 15 రోజుల నుంచి 29 రోజుల కాలపరిమితికి కూడా 3 శాతం అందిస్తోంది. 30 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై 3.50 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 46 రోజుల నుంచి 60 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీలపై 4.50 శాతం వడ్డీ, 61 రోజుల నుంచి 89 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీలపై కూడా 4.50 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. 90 రోజుల నుంచి 6 నెలల లోపు కాలపరిమితి ఎఫ్‌డీలపై కూడా 4.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
5- 10 ఏళ్ల టెన్యూర్‌కి 7 శాతం
6 నెలల ఒక రోజు నుంచి 9 నెలలలోపు కాలపరిమితి గల ఎఫ్‌డీలపై 5.75 శాతం వడ్డీని, తొమ్మిది నెలల ఒక రోజు నుంచి ఒక సంవత్సరంలోపు కాలపరిమితి గల ఎఫ్‌డీలపై 6 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అదే విధంగా ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు ఎఫ్‌డీలపై 6.50 శాతం, 15 నెలల నుంచి 18 నెలలలోపు ఎఫ్‌డీలపై 7 శాతం, 18 నెలల నుంచి 21 నెలలలోపు ఎఫ్‌డీలపై 7 శాతం రాబడిని అందుకొనే అవకాశం కల్పిస్తోంది. 21 నెలల నుంచి రెండేళ్ల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై కూడా 7 శాతం వడ్డీని అందిస్తోంది. రెండేళ్ల ఒక రోజు నుంచి మూడేళ్ల వ్యవధి ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీ, మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల కాలపరిమితి ఎఫ్‌డీలపై 7 శాతం, ఐదేళ్ల ఒక రోజు నుంచి 10 ఏళ్ల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్‌లకు వివిధ కాలపరిమితి గల ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలతో పోలిస్తే అదనంగా 0.50 వడ్డీని ఆఫర్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banking news, Business, Fixed deposits, Hdfc