హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC Bank FD Rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

HDFC Bank FD Rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

HDFC Bank FD Rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

HDFC Bank FD Rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

HDFC Bank News | మీరు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీపికబురు అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

HDFC FD Rates | ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు (Money) దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది. గతంలో కన్నా ఇప్పుడు డిపాజిట్ దారులకు అధిక వడ్డీ లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా ఇప్పటికే చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు పెంచేశాయి. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చేసింది. బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లను 40 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచేసింది. బ్యాంకుల మధ్య డిపాజిట్ రేట్ల పెంపు విషయంలో పోటా పోటీ నడుస్తోంది. ఆర్‌బీఐ రెపో రేటును పెంచుకుంటూ వస్తుండటంతో బ్యాంకులు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు వరుసపెట్టి ఎఫ్‌డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి.

కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఎస్‌బీఐ .. కీలక నిర్ణయం, ఈరోజు నుంచి..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్ల పెంపు నిర్ణయం రూ. 2 కోట్లలోపు డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. రేట్ల పెంపు నిర్ణయం తర్వాత చూస్తే.. 7 నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై, 15 నుంచి 29 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. 30 నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై అయితే 3.5 శాతం వడ్డీ పొందొచ్చు. ఇంకా 46 నుంచి 60 రోజులు, 61 రోజుల నుంచి 89 రోజుల ఎఫ్‌డీలపై 4.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

ఆఫర్లే ఆఫర్లు.. రూ.20 వేల భారీ డిస్కౌంట్! వారికి ఇయర్ ఎండ్ ధమాకా డీల్స్!

అలాగే 6 నెలల నుంచి 9 నెలల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది. 9 నెలల నుంచి ఏడాదిలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 6 శాతం వడ్డీ పొందొచ్చు. అలాగే 12 నెలల నుంచి 15 నెలలలోపు ఎఫ్‌డీలపై 6.5 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. 15 నెలల నుంచి 18 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 7 శాతం వడ్డీ ఉంది. అలాగే 18 నెలల నుంచి 21 నెలలు, 21 నెలల నుంచి 2 ఏళ్లు, రెండేళ్ల నుంచి మూడేళ్లు, మూడేళ్ల నుంచి ఐదేళ్లు, ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై కూడా 7 శాతం వడ్డీ రేటే కొనసాగుతోంది.

అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్‌కు అదనపు వడ్డీ ప్రయోజనం కల్పిస్తోంది. 7 రోజుల నుంచి ఐదేళ్ల వరకు ఎఫ్‌డీలపై అయితే వీరికి 50 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ లభిస్తుంది. రేట్ల పెంపు తర్వాత చూస్తే.. వీరికి 3.5 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ వస్తోంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవచ్చు.

First published:

Tags: Banks, FD rates, Fixed deposits, Hdfc, HDFC bank

ఉత్తమ కథలు