ప్రస్తుత పండుగల సీజన్లో అనేక బ్యాంకులు కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ(HDFC) అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ‘ఫెస్టివ్ ట్రీట్స్ 3.0’ (Festive treats 3.0)పేరుతో వ్యక్తిగత రుణాలు, కార్డులు, ఈఎంఐలపై 10,000కు పైగా ఆఫర్లు అందిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. 100 కంటే ఎక్కువ ప్రదేశాల్లో అమెజాన్ (Amazon), శాంసంగ్ (Samsung), విజయ్ సేల్స్ (Vijay Sales) వంటి 10 వేలకు పైగా వ్యాపార సంస్థలతో కలిసి కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఆఫర్లు ఇస్తున్నట్టు బ్యాంకు వెల్లడించింది.
ఫెస్టివ్ ట్రీట్స్ 3.0’ లాంచ్ సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రూప్ హెడ్ పరాగ్ రావు మాట్లాడుతూ.. కరోనా లాక్డౌన్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసే దిశగా విక్రయాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ ఫెస్టివ్ ట్రీట్ లో భాగంగా ప్రీమియం స్మార్ట్ఫోన్లపై క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ అందిస్తామన్నారు. 10.25% వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలపై ఆఫర్లు ఇస్తామని వివరించారు. ద్విచక్ర వాహన రుణాలను వడ్డీరహిత లేదా రాయితీ వడ్డీ రేట్లతో అందిస్తామన్నారు.
Cash Withdrawal: చనిపోయినవారి ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేయొచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయి
* ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి?
• భాగస్వామ్య సంస్థల్లో వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై 22.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ.
• ఐఫోన్ 13 పై రూ. 6,000 క్యాష్‌బ్యాక్. ఇతర ప్రీమియం ఫోన్లపై కూడా కాస్ట్ ఈఎంఐ ఆఫర్.
మెగా Investment Textile Park స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
• 4 శాతం కన్నా తక్కువ వడ్డీ రేట్లపై ద్విచక్ర వాహన రుణాలు. వాహనాల రేటుకు తగ్గట్లు 100% వరకు రుణ మొత్తం అందించడం.
• వాణిజ్య వాహనాల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం రాయితీ.
• ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం డిస్కౌంట్‌తో పాటు రూ.75 లక్షల వరకు హామీ అవసరంలేని (collateral-free) వ్యాపార రుణాలు.
• ట్రాక్టర్ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు, 90 శాతం వరకు నిధులు.
• జీరో ఫోర్క్లోజర్ ఛార్జీలతో కారు లోన్ 7.50 శాతం నుంచి ప్రారంభమవుతుంది. జీరో ఫోర్క్లోజర్ ఛార్జీలు.. అంటే వ్యవధికి ముందే రుణ మొత్తం చెల్లించినా.. ఎలాంటి ఫ్రీ పేమెంట్ ఛార్జెస్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
Reliance Retail Ventures: 7-ఎలెవన్ స్టోర్లను భారత్‌లో ప్రారంభించనున్న సంస్థ రిలయన్స్ రిటైల్
"కరోనా కారణంగా భారత ప్రజలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఫెస్టివ్ ట్రీట్స్ 3.0 అనేది కేవలం ఒక వ్యక్తి తన కోసం ఖర్చు చేయడానికి మాత్రమే కాదు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇతరులను ఆదుకోవడానికి కూడా సహాయపడుతుంద"ని ఓ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధి ఒకరు తెలిపారు. పండుగ కొనుగోళ్లు చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేసే అనేక మందికి ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Hdfc, HDFC bank