HDFC బ్యాంకు నూతన సీఈవోగా శశిధర్ జగదీశన్...

HDFC బ్యాంకు స్థాపించినప్పటి నుంచి సీఈవోగా కొనసాగుతున్న ప్రస్తుత సారథి ఆదిత్య పురి స్థానాన్ని శశిధర్ జగదీశన్ భర్తీ చేయనున్నారు.

news18-telugu
Updated: August 6, 2020, 7:10 AM IST
HDFC బ్యాంకు నూతన సీఈవోగా శశిధర్ జగదీశన్...
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త సారథి శశిధర్ జగదీశన్
  • Share this:
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం HDFC బ్యాంక్‌ నూతన సీఈఓ, ఎండీగా శశిధర్‌ జగదీశన్‌ నియామకానికి RBIఅంగీకారం తెలిపింది. సీఈవో, ఎండీ మార్పును ధృవీకరిస్తూ స్టాక్ ఎక్స్ ఛేంజీలకు బ్యాంకు బోర్డు లేఖ పంపడం ద్వారా ఈ విషయం రూఢీ అయ్యింది. HDFC బ్యాంకు స్థాపించినప్పటి నుంచి సీఈవోగా కొనసాగుతున్న ప్రస్తుత సారథి ఆదిత్య పురి స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. 54 ఏళ్ల శశి ప్రస్తుతం స్ట్రాటజిక్‌ చేంజ్‌ ఏజెంట్‌గా బ్యాంకులో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 27 నుంచి మూడేళ్ల పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓ, ఎండీగా శశి నియామకానికి ఆర్‌బీఐ కూడా ఆమోదం తెలిపింది.

గడిచిన రెండేళ్లుగా ఆదిత్య పురి స్థానంలో ఎవరు నియమితులు అవుతారా...అనే ఉత్కంఠతకు తెరపడింది. ఆదిత్య పురి సారథ్యంలో HDFC బ్యాంక్‌ దేశంలోనే అత్యంత విలువైన ప్రైవేట్‌ బ్యాంక్‌గా ఎదిగింది. బ్యాంక్‌ ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.5.71 లక్షల కోట్లు. మొండి బకాయులను సమర్థవంతంగా నియంత్రించగలగడంతో పాటు లాభాల్లో వృద్ధిని నిలకడగా కొనసాగించడం ఇందుకు దోహదపడింది హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ సీఈఓ, ఎండీగా ఆదిత్య పురి పదవీకాలం ఈ అక్టోబరు 26తో ముగియనుంది. ఆ మరుసటి రోజు శశి బాధ్యతలు చేపడతారు.
Published by: Krishna Adithya
First published: August 6, 2020, 7:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading