HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాక్... పనిచేయని నెట్‌బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్

HDFC Bank | త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెబుతోంది. కానీ రెండు రోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

news18-telugu
Updated: December 3, 2019, 2:51 PM IST
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాక్... పనిచేయని నెట్‌బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాక్... పనిచేయని నెట్‌బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అకౌంట్ ఉందా? హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్‌ వాడుతున్నారా? రెండు రోజులుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్‌ పనిచేయట్లేదు. కస్టమర్లకు లాగిన్ సమస్యలు ఎదురవుతున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ సమస్య ఉంది. మంగళవారం కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదని కంప్లైంట్ చేస్తున్నారు కస్టమర్లు. దీంతో మొబైల్ బ్యంకింగ్, ఇ-బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. సాంకేతిక సమస్య కారణంగానే ఈ అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెబుతోంది. కానీ రెండు రోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.



డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం, క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించలేకపోతున్నామని కస్టమర్లు సోషల్ మీడియాలో కంప్లైంట్ చేస్తున్నారు. అంతేకాదు... కొందరు కస్టమర్లకు జీతాలు కూడా అందలేదు. "సాంకేతిక సమస్య కారణంగా మా కస్టమర్లు కొందరు నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో లాగిన్ కాలేకపోతున్నారు. మా నిపుణులు ఈ సమస్యపై దృష్టి పెట్టారు. ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. అసౌకర్యానికి చింతిస్తున్నాం. కస్టమర్లు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు" అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వివరణ ఇచ్చింది.

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

IRCTC Tatkal Booking: ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్... ఈ స్టెప్స్‌తో చాలా ఈజీ

IRCTC Tirupathi Tour: ఐఆర్‌సీటీసీ నుంచి తిరుపతి టూర్ ప్యాకేజీ... ధర తక్కువే

Srisailam Boat Tour: ప్రతీ శనివారం సోమశిల-శ్రీశైలం బోట్ టూర్... ప్యాకేజీ ధరలివే
First published: December 3, 2019, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading