Loan: కేవలం 10 సెకన్లలో లోన్... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త ఆఫర్

HDFC Bank ZipDrive Instant Auto Loans | మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారా? కేవలం 10 సెకన్లలోనే ఆటో లోన్స్ ఇస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. ఎలాగో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 6, 2020, 9:11 AM IST
Loan: కేవలం 10 సెకన్లలో లోన్... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త ఆఫర్
Loan: కేవలం 10 సెకన్లలో లోన్... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త ఆఫర్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ కస్టమర్లకు తక్షణమే రుమాలు మంజూరు చేసేందుకు జిప్‌డ్రైవ్ ఇన్‌స్టంట్ ఆటో లోన్స్ ప్రారంభించింది. వాహన రుణాలు తీసుకోవాలనుకునే కస్టమర్లు ఈ సదుపాయాన్ని ఉపయోగించొచ్చు. ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ కింద బ్యాంకు కస్టమర్లకు కేవలం 10 సెకన్లలో లోన్లు మంజూరు చేస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంతో పాటు భారతదేశంలోని 1000 టైర్ 2, 3 పట్టణాల్లో ఈ ఆఫర్స్ అందిస్తోంది. ఆన్‌లైన్‌లో అత్యంత వేగంగా రుణాలు మంజూరు చేసే విధానం జిప్‌డ్రైవ్ అని చెబుతోంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. టెక్నాలజీ సాయంతో రుణాలు వేగంగా కస్టమర్ల అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. కస్టమర్లు బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జిప్‌డ్రైవ్ ఇన్‌స్టంట్ ఆటో లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్లు ముందుగా తమకు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలి. ఇందుకోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత ఆఫర్ వివరాలు తెలుస్తాయి. మీకు ఆఫర్ వర్తించేట్టయితే లోన్‌కు సంబంధించి నియమనిబంధనలు తెలుసుకోవాలి. మీ వివరాలన్నీ వెల్లడించి లోన్‌కు దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత కేవలం 10 సెకన్లలో లోన్ డబ్బులు కస్టమర్ల బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా సోషల్ డిస్టెన్సింగ్‌కు అన్ని బ్యాంకులు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అందులో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జిప్‌డ్రైవ్ ఇన్‌స్టంట్ ఆటో లోన్ సదుపాయాన్ని ప్రారంభించింది.
Published by: Santhosh Kumar S
First published: July 3, 2020, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading