హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC Festive Treats: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్స్

HDFC Festive Treats: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్స్

HDFC Festive Treats: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్స్
(ప్రతీకాత్మక చిత్రం)

HDFC Festive Treats: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్స్ (ప్రతీకాత్మక చిత్రం)

HDFC Festive Treats | ఫెస్టివల్ సీజన్ రావడంతో ఆఫర్స్, డిస్కౌంట్స్‌ వర్షం కురవబోతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫెస్టీవ్ ట్రీట్స్ పేరుతో ఆఫర్స్ అందిస్తోంది.

  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త. దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ సందర్భంగా 'ఫెస్టీవ్ ట్రీట్స్' పేరుతో భారీ ఆఫర్స్ ప్రకటించింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. క్రెడిట్ కార్డ్స్, బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఆటో లోన్స్, హోమ్ లోన్స్‌పై ఆఫర్స్ ఉన్నాయి. వీటితో పాటు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఈఎంఐలు, రుణాలపై 1000 పైగా ఆఫర్స్ ప్రకటించడం విశేషం. ఆటో లోన్, పర్సనల్ లోన్ తీసుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు ప్రకటించింది. బ్యాంకుకు సంబంధించిన అన్ని ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్‌పై ప్రాసెసింగ్ ఫీజులో డిస్కౌంట్ ప్రకటించడం విశేషం. రీటైల్ కస్టమర్లతో పాటు బిజినెస్ కస్టమర్లకు ఇవి వర్తిస్తాయి. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు తగ్గించడం, ఈఎంఐ తగ్గించడం, క్యాష్‌బ్యాక్స్, గిఫ్ట్ వోచర్స్ లాంటి బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. ఇన్ స్టోర్, ఆన్‌లైన్ కొనుగోళ్లపై కస్టమర్లకు భారీగా డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్, అదనంగా రివార్డ్ పాయింట్స్ అందించేందుకు అనేక బ్రాండ్స్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది.

  New Rules from Today: అలర్ట్... ఈ రోజు నుంచి ఈ 11 కొత్త రూల్స్ వర్తిస్తాయి

  Shopping tricks: షాపింగ్‌లో మీరు ఎలా మోసపోతారో తెలుసా? ఇలా

  త్వరలో నిర్వహించబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్‌తో పాటు టాటాక్లిక్, మింత్రా, పెప్పర్‌ఫ్రై, స్విగ్గీ, గ్రోఫర్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఆఫర్స్ పొందొచ్చు. వీటితో పాటు లైఫ్‌స్టైల్, బాటా, మాంటే కార్లో, విజయ్ సేల్స్, కోహినూర్, జీఆర్‌టీ లాంటి బడా బ్రాండ్స్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. అనేక ప్రొడక్ట్స్‌, సర్వీసెస్‌పై 5 శాతం నుంచి 15 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇక యాపిల్ లాంఛ్ చేసిన, కొత్తగా లాంఛ్ చేయబోయే ప్రొడక్ట్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లు రూ.7000 క్యాష్ బ్యాక్ పొందొచ్చు. సాంసంగ్, ఎల్‌జీ, సోనీ, గోద్రెజ్, ప్యానాసోనిక్ ప్రొడక్ట్స్ కొంటే 22.5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

  Work From Home Jobs: నెలకు రూ.30,000 సంపాదించండి... వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవే

  PM SVANidhi Scheme: మీ వ్యాపారానికి రుణాలు ఇస్తున్న మోదీ ప్రభుత్వం... ఈ స్టెప్స్‌తో అప్లై చేయండి

  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 53 శాతం బ్రాంచ్‌లు సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందుకే అక్కడి కస్టమర్లకు కూడా ఆఫర్స్ అందించేందుకు హైపర్ లోకల్ స్టోర్లు, కిరాణా షాపులతో కూడా ఒప్పందం కుదుర్చుకుంటోంది. 2000 పైగా ఆఫర్స్ అందించనుంది. మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్ అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రుణాలు తీసుకోవాలనుకుంటే ఆఫర్స్ గురించి https://v1.hdfcbank.com/htdocs/common/2020/sept/festivetreat/shopping.html వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Amazon, AMAZON INDIA, Bank loans, Car loans, Gold loans, Hdfc, HDFC bank, Home loan, Housing Loans, Online business, Online shopping, Personal Loan

  ఉత్తమ కథలు