హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC Loan: 30 నిమిషాల్లో రుణం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరిపోయే శుభవార్త!

HDFC Loan: 30 నిమిషాల్లో రుణం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరిపోయే శుభవార్త!

HDFC Bank

HDFC Bank

Loan | లోన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకని అనుకుంటున్నారా? హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పలు రకాల ఆఫర్లు అందిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    HDFC Bank Festive Treats | ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. బ్యాంక్ తాజాగా పండుగ సీజన్ నేపథ్యంలో కస్టమర్లకు అదిరే శుభవార్త అందించింది. వివిధ రకాల ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ డిస్కౌంట్లతో పాటుగా రుణాలపై (loan) కూడా తగ్గింపు అందిస్తోంది. కస్టమర్లకు ఎన్నో రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

    పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ వంటి వాటి కోసం స్పెషల్ స్కీమ్స్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. పర్సనల్ లోన్ పొందాలని భావించే వారు రూ.40 లక్షల వరకు రుణం పొందొచ్చు. వడ్డీ రేటు 10.5 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే బిజినెస్ లోన్ పొందాలని భావించే వారికి తనఖా లేకుండా రుణాలు అందిస్తోంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు అందుబాటులో ఉంచింది.

    బంగారం, వెండి కొనాలనుకునే వారికి భారీ షాక్.. ఒకేరోజు రూ.4 వేలకు పైగా పెరిగిన ధర!

    ఇంకా ఎక్స్‌ప్రెస్ కార్ లోన్ స్కీమ్ కూడా ఉంది. ఈ స్కీమ్ కింద కస్టమర్లు కేవలం 30 నిమిషాల్లోనే లోన్ పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. వడ్డీ రేటు 7.9 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే ఎలాంటి ఫోర్‌క్లోజర్ చార్జీలు ఉండవు. ఇంకా సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలని భావిస్తే.. వడ్డీ రేటు 10.75 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం అవుతుంది. రెండేళ్ల తర్వాత లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. చార్జీలు ఉండవు.

    హోమ్, కారు, గోల్డ్ లోన్స్‌పై అదిరే ఆఫర్లు అందిస్తున్న బ్యాంక్

    అలాగే హోమ్ లోన్స్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. రూ. 50 లక్షల వరకు టాప్ అప్ రుణాలను తక్కువ వడ్డీ రేటుకే పొందొచ్చని బ్యాంక్ తెలియజేస్తోంది. అలాగే ప్రాపర్టీ మీద లోన్ తీసుకునే వారికి ఫ్లాట్ రూ. 9999 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌కు స్పెషల్ ప్రాసెసింగ్ బెనిఫిట్ పొందొచ్చు. అలాగే బ్యాంక్ పలు రకాల బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కస్టమర్లకు వివిధ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఫెస్టివ్ ట్రీట్స్‌తో కస్టమర్లు వారి పండుగ సంతోషాన్ని రెట్టింపు చేసుకోవచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. కాగా మరోవైపు ఇతర బ్యాంకులు కూడా పండుగ ఆఫర్లు తీసుకువచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - ఎస్‌బీఐ (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి కస్టమర్లకు పలు రకాల బెనిఫిట్స్ అందుబాటులో ఉంచాయి.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Bank, Business Loan, Car loans, HDFC bank, Home loan

    ఉత్తమ కథలు