Home /News /business /

HDFC BANK ISSUES RECORD CREDIT CARDS POST EMBARGO RELAUNCHES 3 CARDS GH VB

క్రెడిట్ కార్డుల జారీలో జోరు పెంచిన ప్రముఖ బ్యాంక్.. ఒక్క నెలలోనే ఏకంగా 4 లక్షల కార్డుల జారీ.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Credit Cards: క్రెడిట్​ కార్డుల జారీలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ మళ్లీ జోరందుకుంది. కేవలం ఒక్క నెల రోజుల్లోనే 4 లక్షలకు పైగా కొత్త క్రెడిట్​ కార్డులు జారీ చేసి రికార్డు సృష్టించింది. 2021 సెప్టెంబర్​లో నెలలో రికార్డు స్థాయిలో వినియోగదారులకు క్రెడిట్​ కార్డులు అందజేసినట్లు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ బుధవారం ప్రకటించింది.

ఇంకా చదవండి ...
క్రెడిట్​ కార్డు(Credit Cards)ల జారీలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్(HDFC Bank) ​ మళ్లీ జోరందుకుంది. కేవలం ఒక్క నెల రోజుల్లోనే 4 లక్షలకు పైగా కొత్త క్రెడిట్​ కార్డులు జారీ చేసి రికార్డు సృష్టించింది. 2021 సెప్టెంబర్​లో నెలలో రికార్డు స్థాయిలో వినియోగదారులకు క్రెడిట్​ కార్డులు అందజేసినట్లు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ బుధవారం ప్రకటించింది. క్రెడిట్​ కార్డుల జారీపై ఇటీవల ఆర్​బీఐ నిషేధం ఎత్తివేయడంతో, ఈ బ్యాంకు మళ్లీ జోరు పెంచింది. నిషేధం అమల్లోకి రాకముందు హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు నెలకు3 లక్షల రన్​రేట్​తో క్రెడిట్​ కార్డులు జారీ చేసేది. కొన్ని నెలల పాటు క్రెడిట్​ కార్డులపై నిషేధం ఉండటంతో ఒక్క కార్డు కూడా జారీ చేయలేదు. అయితే రాబోయే రెండు నెలల్లోనే రికార్డు స్థాయిలో భారీగా క్రెడిట్​ కార్డులు జారీ చేసి మునుపటి లక్ష్యాన్ని చేరుకోవాలని పట్టుదలగా ఉంది.

Business Ideas: బిజినెస్ చేయాలనుకునే వారు ఈ ఐడియాలను తెలుసుకోండి.. నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష సంపాదించొచ్చు..


2022 ఫిబ్రవరి నుంచి నెలలకు 5 లక్షల కార్డులు జారీ చేయాలని ఈ బ్యాంకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అంతేకాదు, సహస్రాబ్ది, మనీబ్యాక్+, ఫ్రీడమ్ కార్డులను తిరిగి ఆవిష్కరించింది. రాబోయే రోజుల్లో వీటిని గణనీయంగా జారీ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ కొత్త కార్డులను వచ్చే నెల నుంచి అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్రీడమ్, మిలీనియా కార్డ్ హోల్డర్లు కూడా ఈ కొత్త కార్డులను తీసుకోని అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

Video Viral: అమ్మాయి ఒడిలో నిద్రపోతున్న భారీ కొండ చిలువ.. ఆ వీడియోను మీరూ చూడండి..


ఆ మూడు క్రెడిట్​ కార్డుల రీలాంచ్​..
ఈ కొత్త కార్డుల జారీపై హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు డిజిటల్​ బ్యాంకింగ్​, ఐటీ కన్జూమర్​ ఫైనాన్స్​, పేమెంట్స్​ హెడ్​ పరాగ్​ రామ్​ మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు క్రెడిట్​ కార్డు స్పేస్​లో మేం మార్కెట్ లీడర్​గా ఉన్నాం. అందుకే, మునుపటి జోరుతోనే తిరిగి కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై దృష్టి సారించాం. అంతేకాదు, పాత క్రెడిట్ కార్డు హోల్డర్లకు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాం. కస్టమర్ల కొనుగోలు పద్దతులు, ఏయే విభాగాల్లో ఖర్చు చేస్తున్నారు, వారి ఖర్చుల ప్రవర్తన ఆధారంగా మా వ్యూహాలను మార్చుకుంటున్నాం. వారికి పండుగ ఆఫర్లను ప్రకటించేందుకు సిద్దమవుతున్నాం" అని పేర్కొన్నారు.

Viral News: మద్యం సేవించి తనకు తానే వెతుకున్నాడు.. ఈ ఘటన ప్రతీ ఒక్కరికి నవ్వు తెప్పిస్తోంది..


హెచ్​డీఎఫ్​సీ ఫార్మా, ట్రావెల్​, ఎఫ్​ఎంసీజీ, టూరిజం, టెలికాం, ఫిన్​టెక్​ రంగ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడంతో కస్టమర్​ అక్విజిషన్​ 20 నుంచి 24కు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే గతేడాది డిసెంబర్‌లో హెచ్​డీఎఫ్​సీ కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆర్బీఐ నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో 2 సంవత్సరాలుగా బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్/మొబైల్ బ్యాంకింగ్/చెల్లింపు యుటిలిటీలు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు, జోరుగా క్రెడిట్​ కార్డులు జారీ చేసి మార్కెట్​లో మునుపటి వైభవాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: Credit cards, HDFC bank

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు