హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజుపై 75% తగ్గింపు.. వారికి మాత్రమే..

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజుపై 75% తగ్గింపు.. వారికి మాత్రమే..

HDFC Bank

HDFC Bank

HDFC: కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. పండుగ సీజన్ కోసం ప్రత్యేకంగా ‘ఫెస్టివ్ ట్రీట్స్’ ఆఫర్లను ప్రవేశపెట్టింది. దీని ద్వారా బ్యాంకు లోన్లు, షాపింగ్, ఇతర బ్యాంకింగ్ సేవలపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియాలో పండుగల సీజన్ (Festival Season) ప్రారంభమవుతోంది. దీంతో వివిధ సంస్థల స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్ల సందడి స్టార్ట్ అవుతోంది. ఈ నెలాఖరుకు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart), అమెజాన్‌ (Amazon) పోర్టళ్లు రెండూ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నాయి. స్పెషల్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లతో తక్కువ ధరకే ప్రొడక్ట్స్‌ను అందించనున్నాయి. వివిధ ఆఫర్లతో బ్యాంకులు కూడా స్పెషల్ స్కీమ్స్ ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలో తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. పండుగ సీజన్ కోసం ప్రత్యేకంగా ‘ఫెస్టివ్ ట్రీట్స్’ ఆఫర్లను ప్రవేశపెట్టింది. దీని ద్వారా బ్యాంకు లోన్లు, షాపింగ్, ఇతర బ్యాంకింగ్ సేవలపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తోంది.

* పండుగ సీజన్‌ కోసం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతి సంవత్సరం పండుగ సీజన్‌లో అనేక ఆఫర్‌లను అందజేస్తుంది. గత సంవత్సరం పర్సనల్ లోన్స్, ఎక్స్‌ప్రెస్ కార్ లోన్స్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, టూ వీలర్ లోన్, క్రెడిట్ కార్డ్‌పై లోన్, గోల్డ్ లోన్, యూజ్డ్ కార్ లోన్ , ఇతర లోన్లపై భారీ ఆఫర్లను బ్యాంక్‌ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది కూడా కస్టమర్ల కోసం స్పెషల్ ఆఫర్లను తీసుకొచ్చింది.

* వారికి ప్రత్యేకం

ఫెస్టివ్ ట్రీట్స్ ఆఫర్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది HDFC. ప్రభుత్వ ఉద్యోగులకు అందించే హోమ్ లోన్ల (Home Loan) ప్రాసెసింగ్ ఫీజుపై 75 శాతం తగ్గింపును అందిస్తోంది. రూ.50 లక్షల వరకు గృహ రుణాలు తీసుకునే కస్టమర్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 800, అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ స్పెషల్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి : సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై 8.25% వరకు వడ్డీ.. ఎక్కువ రేట్లు ఆఫర్‌ చేస్తున్న 5 బ్యాంకులు ఇవే..

భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన HDFC బ్యాంక్.. హోమ్ లోన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఆన్‌లైన్ నెట్‌బ్యాంకింగ్, అకౌంట్స్, డిపాజిట్స్, కార్డ్‌లు, లోన్, ఇతర పర్సనల్ బ్యాంకింగ్ సేవలను కూడా బ్యాంకు అందిస్తుంది. అయితే హౌసింగ్ లోన్లపై క్రమం తప్పకుండా స్పెషల్ ఆఫర్లను అందిస్తూ కస్టమర్ బేస్‌ను పెంచుకుంటోంది. గృహ రుణం వడ్డీ రేట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బెంచ్‌మార్క్ రేటుతో లింక్‌ అయి ఉంటాయి. రుణం కాల వ్యవధి ద్వారా మారుతూ ఉంటాయి.

* ఆఫర్ అక్టోబరు 31 వరకే..

ప్రభుత్వ ఉద్యోగులకు గృహ రుణాలపై అందించే ఫెస్టివ్ ట్రీట్స్ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ లోగా ఈ ఆఫర్‌ను ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోవాలి. గృహ రుణాలపై ఆఫర్‌తో పాటు, వ్యాపార రుణాల కోసం ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం తగ్గింపుతో పాటు ద్విచక్ర వాహనం , కారు రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అందిస్తోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: HDFC bank, Home loans, Personal Finance

ఉత్తమ కథలు