హోమ్ /వార్తలు /బిజినెస్ /

Interest Rates: మే నుంచి ఐదో సారి ఆ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు.. ఇక, మరింత భారంగా EMIలు..

Interest Rates: మే నుంచి ఐదో సారి ఆ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు.. ఇక, మరింత భారంగా EMIలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Interest Rates: ఆ బ్యాంకు అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. RBI బెంచ్ మార్క్ లెండింగ్ రేటును పెంచినప్పటి నుంచి.. అంటే మే నెల నుంచి బ్యాంక్ MCLRను ఐదుసార్లు పెంచింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియా (India)లోని ద్రవ్యోల్బణం తగ్గించేందుకు ఆర్బీఐ (RBI) ఈ ఏడాదిలో మూడు సార్లు రెపో రేటు (Repo Rate)ను సవరించింది. దీంతో ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు (Banks) కూడా వడ్డీ రేట్ల (Interest Rates)ను పెంచుతూ వరుసగా నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఇండియాలోని అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. RBI బెంచ్ మార్క్ లెండింగ్ రేటును పెంచినప్పటి నుంచి.. అంటే మే నెల నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ MCLRను ఐదుసార్లు పెంచింది. మేలో బ్యాంక్ తొలిసారిగా MCLRను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. జూన్‌లో MCLRను 35 బేసిస్ పాయింట్లు, జులైలో 20 బేసిస్ పాయింట్లు పెంచింది. మళ్లీ ఆగస్టులో బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఐదోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది.* MCLR పది బేసిస్‌ పాయింట్ల పెంపు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్‌ రేట్(MCLR)ని 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. MCLR అనేది బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు పాటించాల్సిన కనీస వడ్డీరేటు. MCLR వడ్డీ రేటు కంటే తక్కువకు ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేయకూడదు. ఒక బేస్‌ పాయింట్‌ అనేది ఒక శాతం పాయింట్‌లో నూరవ వంతు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ MCLR ఇప్పుడు 0.10 శాతం పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాలపై కొత్త వడ్డీ రేటు సెప్టెంబర్ 7 నుంచి అమల్లోకి వచ్చాయి.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపిన వివరాల మేరకు.. ఒక సంవత్సరం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్‌ రేట్ 8.2 శాతానికి పెరగగా, ఓవర్‌నైట్ MCLR 7.9 శాతానికి పెరిగింది. ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలల కాల వ్యవధిలో MCLR వరుసగా 7.90 శాతం, 7.95 శాతం, 8.08 శాతంగా ఉంది.
ఇది కూడా చదవండి : ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నారా..? ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి.. లేదంటే నష్టమే!
* అన్ని రకాల రుణాలపై ప్రభావం
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్‌ రేట్‌ను పెంచుతూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రస్తుతం ఉన్న, కొత్తగా తీసుకున్న హోం లోన్లు, ఆటో లోన్లు, పర్సనల్‌ లోన్ల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కస్టమర్ల చెల్లిస్తున్న ఈఎంఐలపై దీని ప్రభావం కనిపిస్తుంది. కొత్తగా ఇప్పుడు రుణాలు తీసుకోవాలని భావిస్తున్న వారికి లోన్లు ఖరీదైనవిగా మారాయి.
MCLR అనేది కొత్త RBI మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులకు సెట్ చేసిన బేస్ రేటు. రుణాల కోసం వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ఉన్న మునుపటి బేస్ రేటు విధానాన్ని భర్తీ చేసింది. RBI MCLRని 2016 ఏప్రిల్ 1న అమలు చేసింది. చాలా రుణాలు ఒక సంవత్సరం MCLR రేటుతో లింక్‌ అయి ఉంటాయి. అందువల్ల దీనిలో మార్పు నేరుగా EMIలపై కనిపిస్తుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Car loans, EMI, HDFC bank, Home loan, Personal Finance

ఉత్తమ కథలు