హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC Bank MCLR Hike: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు షాక్! ఈరోజు నుంచి..

HDFC Bank MCLR Hike: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు షాక్! ఈరోజు నుంచి..

HDFC Bank

HDFC Bank

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు ఝలక్ ఇచ్చింది. ఎంసీఎల్ఆర్ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారిపై ప్రభావం పడనుంది. అలాగే కొత్తగా లోన్ తీసుకోవాలన్నా కూడా రుణ రేట్లు పెరుగుతాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ప్రైవేట్ రంగానికి చెందిన దేశీ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్ల పెంచుతున్నట్లు వెల్లడించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచేసింది. అన్ని టెన్యూర్లలోని రుణాలకు ఇది వర్తిస్తుంది. ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. రేట్ల పెంపు నిర్ణయం 2022 సెప్టెంబర్ 7అంటే ఈ రోజు నుంచే అమలులోకి వస్తుంది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు పెంచడం వల్ల రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. కొత్తగా లోన్ తీసుకునే వారిపై ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి లోన్ పొందిన వారిపై కూడా ప్రభావం ఉంటుందని గుర్తించుకోవాలి. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ సహా ఎంసీఎల్ఆర్ రేటు ప్రాతిపదికన రుణం పొందిన వారందరిపైనా తాజా నిర్ణయంతో ప్రభావం పడబోతోంది. నెలవారీ ఈఎంఐ పైపైకి చేరనుంది.

కొత్త రేట్ల ప్రకారం చూస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.2 శాతానికి చేరింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.9 శాతానికి ఎగసింది. సాధారణంగా ఏడాది ఎంసీఎల్ఆర్ రేటుకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. బ్యాంకులు ఈ రేటు ప్రాతిపదికనే రుణ రేట్లను నిర్ణయిస్తాయి. ఈ రేటుకు కొంత ప్రీమియం కలిపి రుణాలపై వడ్డీ రేట్లను డిసైడ్ చేస్తాయి. ఎంసీఎల్ఆర్ రేటు అనేది ఒక్కో బ్యాంక్‌లో ఒక్కోలా ఉంటుంది. నెల రోజుల టెన్యూర్‌కు ఎంసీఎల్ఆర్ రేటు 7.9 శాతంగా ఉంది. 3 నెలల ఎంసీఎల్ఆర్ 7.95 శాతానికి చేరింది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.05 శాతంగా ఉందని చెప్పుకోవచ్చు.

Bank Balance: మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? ఆధార్ నెంబర్‌తో తెలుసుకోండి ఇలా

కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గత నాలుగు నెలల్లో కూడా ఎంసీఎల్ఆర్ రేటును పెంచుకుంటూనే వచ్చింది. ఈ కాలంలో రేట్ల పెంపు 10 నుంచి 35 బేసిస్ పాయింట్ల వరకు ఉంది. మళ్లీ ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరోసారి రుణ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ఎంసీఎల్ఆర్ విధానం 2016 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చింది. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు పెంచుకుంటూ వెళ్లడంతో బ్యాంకులు కూడా ఎంసీఎల్ఆర్ రేటును పెంచుకుంటూ వెళ్తున్నాయి.

LIC New Pension Plus Plan: ఎల్‌ఐసీ న్యూ పెన్షన్‌ ప్లస్‌ ప్లాన్‌ లాంచ్‌.. ప్రీమియం, ఫండ్స్‌, ప్లాన్ రూల్స్ ఇవే..

గత 4 నెలల్లో ఎంసీఎల్ఆర్ రేటు పెంపు ఇలా..

ఆగస్ట్ నెలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు పెంపు – 10 బేసిస్ పాయింట్లు

జూలై నెలలో ఎంసీఎల్ఆర్ రేటు పెంపు – 20 బేసిస్ పాయింట్లు

జూన్ నెలలో రుణ రేటు పెంపు – 35 బేసిస్ పాయింట్లు

మే నెలలో ఎంసీఎల్ఆర్ రేటు పెంపు – 25 బేసిస్ పాయింట్లు

First published:

Tags: Bank loan, Hdfc, HDFC bank, Home loan, Personal Finance

ఉత్తమ కథలు