Loan EMI | ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. రుణ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో బ్యాంక్ (Bank) కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. మరీముఖ్యంగా లోన్ తీసుకునే వారిపై, ఇప్పటికే రుణం (Loan) పొందిన వారిపై ఎఫెక్ట్ పడనుంది. నెలవారీ ఈఎంఐలు పైకి కదలనున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) పెంచేసింది. ఈ రేట్ల పెంపు నవంబర్ 7 నుంచి అమలులోకి వచ్చింది. అంటే ఇప్పటికే కొత్త రేట్లు అమలులోకి వచ్చేశాయి. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పెంచుకుంటూ వెళ్తుండటం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో బ్యాంకులు కూడా వరుసపెట్టి ఎంసీఎల్ఆర్ పెంచేస్తున్నాయి.
రూ.30 లక్షలు అందించే అద్భుతమైన పాలసీ.. నెలకు రూ.500 నుంచి కట్టొచ్చు, ఒక్క ప్లాన్‌తో 3 లాభాలు
ఇప్పుడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ రేటు పెంచింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.2 శాతానికి చేరింది. ఇదివరకు ఈ రేటు 7.9 శాతంగా ఉంది. అలాగే నెల రోజుల ఎంసీఎల్ఆర్ 7.9 శాతం నంచి 8.25 శాతానికి ఎగసింది. 3 నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ వరుసగా 8.3 శాతంగా, 8.4 శాతంగా ఉన్నాయి. ఏడాది ఎంసీఎల్ఆర్ అయితే 8.55 శాతంగా ఉంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.3 శాతం నుంచి 8.65 శాతానికి చేరింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.4 శాతం నుంచి 8.75 శాతానికి ఎగసింది.
సర్ప్రైజ్ ఆఫర్.. 200MP కెమెరా ఫోన్‌పై ఏకంగా రూ.35 వేల డిస్కౌంట్!
నవంబర్ నెలలో చాలా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటును పెంచేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి కూడా రుణ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటు కన్నా తక్కువ రేటుకు రుణాలు అందించడానికి వీలు ఉండదు. ప్రతి బ్యాంకుకు ఒక్కో రకమైన ఎంసీఎల్ఆర్ రేటు ఉంటుంది. ఈ రేటుకు తక్కువ వడ్డీ రేటుకు బ్యాంకుల రుణాలు అందించవు.
అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే రుణ రేట్లు కూడా పైకి చేరతాయి. ఇప్పటికే లోన్ తీసుకొని ఉంటే వారి నెలవారీ ఈఎంఐ పెరుగుతుంది. రీసెట్ డేట్ నుంచి ఈ ప్రభావం పడుతుంది. అలాగే కొత్తగా లోన్ తీసుకునే వారిపై అయితే ఎక్కువ వడ్డీ చెల్లించి రుణం పొందాల్సి ఉంటుంది. ఎంసీఎల్ఆర్ లింక్డ్ రుణాలు పొందే వారికే ఇది వర్తిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.