Home /News /business /

HDFC BANK HIKES FIXED DEPOSIT INTEREST RATES TWICE IN A WEEK UMG GH

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు డబుల్ ధమాకా.. వారంలో రెండుసార్లు ఎఫ్‌డీ రేట్లు పెంచిన బ్యాంక్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వారంలో రెండు సార్లు ఎఫ్‌డీ రేట్లు పెంచింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వారంలో రెండు సార్లు ఎఫ్‌డీ రేట్లు పెంచింది.

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంకు తమ ఖాతాదారుల (Customers)కు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు వివిధ కాలపరిమితి గల డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు వర్తించనున్నాయి.

ఇంకా చదవండి ...
ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు వివిధ కాలపరిమితి గల డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. పెరిగిన వడ్డీ రేట్లు ఇప్పటికే (జూన్ 17 నుంచి) అమల్లోకి వచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ పెంపుతో సీనియర్ సిటిజన్లు ప్రయోజనం పొందనున్నారు. ద్రవ్యోల్భణ కట్టడికి ఆర్‌బీఐ రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి.

సీనియర్‌ సిటిజన్లకు ప్రయోజనం
7 నుంచి 29 రోజుల కాలపరిమితి గల డిపాజిట్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని పెంచింది. దీంతో 2.50 శాతంగా ఉన్న వడ్డీ రేట్ 2.75 శాతానికి పెరిగింది. అలాగే 30 నుంచి 90 రోజుల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేట్ 3 శాతం నుండి 3.25 శాతానికి పెరిగింది. 91 రోజుల నుంచి 6 నెలలలోపు కాలపరిమితి గల డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లను పెంచింది. దీంతో వడ్డీ రేట్ 3.25 శాతం నుంచి 3.75 శాతానికి పెరిగింది. అలాగే వివిధ కాలపరిమితి గల డిపాజిట్లపై కూడా 10 నుంచి 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. దేశంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లు లేదా రిటైర్డ్ ఉద్యోగులకు(60 ఏళ్లు అంత కంటే ఎక్కువ) మాత్రమే స్పెషల్ రేట్లు వర్తిస్తాయని హెచ్ డీఎఫ్‌సీ బ్యాంకు స్పష్టం చేసింది. ఎన్‌‌ఆర్‌ఐ‌లకు ఈ వడ్డీ రేట్లు వర్తించవని తెలిపింది.

ఇదీ చదవండి: శాంసంగ్ బంపరాఫర్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ


వివిధ కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు ఇలా
15 రోజుల నుంచి 29 రోజులలోపు కాలానికి చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై సాధారణ ప్రజలకు 2.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అదే విధంగా 30 రోజుల నుంచి 45 రోజుల వ్యవధికి చేసిన డిపాజిట్‌లపై సాధారణ ప్రజలకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం వడ్డీ లభిస్తుంది.46 రోజుల నుండి 60 రోజులకు సాధారణ ప్రజలకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం, 61 రోజుల నుండి 90 రోజులకు చేసిన డిపాజిట్‌లపై సాధారణ ప్రజలకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం వడ్డీ దక్కుతుంది.

అదే విధంగా 91 రోజుల నుంచి 120 రోజులకు చేసిన డిపాజిట్‌లపై సాధారణ ప్రజలకు 3.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం, 6 నెలల నుంచి 9 నెలల కాలానికి సాధారణ ప్రజలకు 4.65 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.15 శాతం, 9 నెలల 1 రోజు నుంచి సంవత్సరం లోపు చేసిన డిపాజిట్‌లకు సాధారణ ప్రజలకు 4.65 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.15 శాతం వడ్డీని హెచ్‌డీఎఫ్‌సీ చెల్లిస్తుంది.



సంవత్సరానికి చేసిన డిపాజిట్‌లపై సాధారణ ప్రజలకు 5.35 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.85 శాతం, 1 సంవత్సరం 1 రోజు నుండి 2 సంవత్సరాల సాధారణ ప్రజలకు 5.35 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.85 శాతం, 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాల డిపాజిట్లకు సాధారణ ప్రజలకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం, 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాలకు సాధారణ ప్రజలకు 5.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.20 శాతం, 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాలకు సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీ రేటును అందించనుంది.
Published by:Mahesh
First published:

Tags: Banking news, FD rates, HDFC bank, Interest rates

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు