Fixed Deposits | ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (Fixed Deposits) మరోసారి వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది. గతంలో కన్నా ఇకపై అధిక రాబడి వస్తుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడం ఇది 15 రోజుల్లో రెండో సారి. బ్యాంక్ తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. ఈ రేట్ల పెంపు నిర్ణయం నవంబర్ 7 నుంచి అమలులోకి వచ్చింది. రూ. 2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు రేట్ల పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది.
ఎస్బీఐ బంపరాఫర్లు.. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీలపై రూ.12 వేల డిస్కౌంట్!
బ్యాంక్ తాజాగా 15 నెలలకు పైన టెన్యూర్‌లోని ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచింది. 15 నెలల ఒక్క రోజు నుంచి 18 నెలలలోపు టెన్యూర్‌లోని ఎఫ్డీలపై ఇప్పుడు 6.4 శాతం వడ్డీ వస్తుంది. ఇదివరకు ఈ వడ్డీ రేటు 6.15 శాతంగా ఉంది. 18 నెలల నుంచి 5 ఏళ్లలోపు కాల పరిమితిలోని ఎఫ్డీలపై వడ్డీ రేటు 6.5 శాతానికి చేరింది. ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 5 బేసిస్ పాయింట్ల మేర పెరిగాయి. ఇదివరకు 6.2 శాతం వడ్డీ వచ్చేది. ఇప్పుడు ఇది 6.25 శాతానికి చేరింది.
భారీ తగ్గింపు ఆఫర్లు.. కారు కొంటే ఏకంగా రూ.63,000 డిస్కౌంట్
ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు అధిక వడ్డీ లభిస్తుంది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే వీరికి 50 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీ వస్తుంది. బ్యాంక్‌లో వీరికి వడ్డీ రేటు 3.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచేసింది.
6 నెలల టెన్యూర్‌పై 4.5 శాతం వడ్డీ పొందొచ్చు. 9 నెలల టెన్యూర్‌పై 5.25 శాతం వడ్డీ వస్తుంది. 12 నెలల టెన్యూర్‌పై 6.1 శాతం, 15 నెలల టెన్యూర్‌పై 6.4 శాతం, 24 నెలల నుంచి 60 నెలల వరకు టెన్యూర్‌పై 6.5 శాతం, 90 నెలలు నుంచి 120 నెలల టెన్యూర్‌పై 6.25 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఇది అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు కూడా రుణ రేట్లు, వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Hdfc, HDFC bank, Personal Finance