FD Rates | ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. డిపాజిట్ రేట్లు (Fixed Deposit) పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు (Money) దాచుకోవాలని భావించే వారికి ప్రయోజనం కలుగనుంది. గతంలో కన్నా ఇకపై బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి అధిక రాబడి లభించనుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచింది. రూ. 2 కోట్లలోపు ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. కొత్త వడ్డీ రేట్లు జనవరి 24 నుంచి అమలులోకి వస్తాయి. అంటే ఈ రోజు నుంచి కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. తాజా పెంపును పరిగణలోకి తీసుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 3.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులను ఎఫ్‌డీ చేసుకోవచ్చు.
మీ పాప పేరుపై ఈ అకౌంట్ తెరిస్తే రూ.63 లక్షలు.. ఎలానో తెలుసుకోండి!
7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 3 శాతంగా ఉంది. 30 రోజుల నుంచి 45 రోజులఎఫ్‌డీలపై వడ్డీ రేటు 3.5 శాతంగా కొనసాగుతోంది. 46 రోజుల నుంచి 6 నెలల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.5 శాతంగా ఉంది. 6 నెలల నుంచి 9 నెలల టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ, 9 నెలల నుంచి ఏడాది ఎఫ్‌డీలపై 6 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు.
బ్యాంక్ అకౌంట్‌లో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలి? 40 బ్యాంకుల లిస్ట్ ఇదే!
బ్యాంక్ ఏడాది నుంచి 15 నెలల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఈ వడ్డీ రేటు 6.5 శాతం నుంచి 6.6 శాతానికి చేరింది. 15 నెలల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7 శాతంగా కొనసాగుతోంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే ఐదేళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై గరిష్టంగా 7.75 శాతం వరకు వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ స్కీమ్ కింద ఈ బెనిఫిట్ ఉంది. వీరికి 0.25 శాతం అధిక ప్రీమియం వస్తుంది. అలాగే 0.5 శాతం అదనపు వడ్డీ ఉంటుంది. ఈ స్కీమ్ 2023 మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుంది. కేవలం సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఎస్‌బీఐ , ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్స్‌కు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ అందిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, FD rates, Fixed deposits, Hdfc, HDFC bank