Fixes Deposit | ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్‌లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. బ్యాంక్‌లో (Bank) డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది. దీంతో బ్యాంక్ డిపాజిట్ దారులకు గతంలో ఇకపై అధిక రాబడి వస్తుందని చెప్పుకోవచ్చు. ఆర్‌బీఐ (RBI) రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు అన్నీ వరుస పెట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్లను పెంచకుంటూ వెళ్తున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బల్క్ పిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉన్న ఎఫ్‌డీలకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుంది. బ్యాంక్ 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో కస్టమర్లకు ఎఫ్‌డీ సర్వీసులు అందిస్తోంది. వీటిపై సామాన్యులకు 4.75 శాతం నుంచి 7 శాతం వరకు, సీనియర్ సిటిజన్స్‌కు 5.25 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
బంగారం కొనాలనుకునే వారికి భారీ షాక్! ఇలా అయితే ఎలా?
బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. 7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.75 శాతంగా ఉంది. 30 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై అయితే 5.5 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. 46 నుంచి 60 రోజుల ఎఫ్‌డీలపై 5.75 శాతం, 61 నుంచి 89 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6 శాతం వడ్డీ రేటును పొందొచ్చు. 90 రోజుల నుంచి 6 నెలల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది. 6 నెలల నుంచి 9 నెలల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.65 శాతంగా లభిస్తోంది. 9 నెలల నుంచి ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.75 శాతంగా కొనసాగుతోంది. ఏడాది నుంచి 15 నెలల టెన్యూర్ అయితే వడ్డీ రేటు 7.25 శాతగంగా ఉంది. 15 నెలల నుంచి రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 7.15 శాతం వడ్డీని అందిస్తోంది. 2 ఏళ్ల నుంచి పదేళ్ల వరకు ఎఫ్‌డీలపై అయితే 7 శాతం వడ్డీ పొందొచ్చు.
కొత్త క్రెడిట్ కార్డు అదిరింది.. ప్రీగా 60 లీటర్ల పెట్రోల్, ఉచితంగా రూ.2 లక్షల బెనిఫిట్!
సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7 రోజుల నుంచి ఐదేళ్ల వరకు టెన్యూర్‌పై వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వస్తుంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌పై ఎఫ్‌డీలపై అయితే 0.75 శాతం వరకు అధిక వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు. అందువల్ల మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్‌కు ఉంటే వారి పేరుపై ఎఫ్‌డీ ఖాతా తెరిస్తే.. అధిక ప్రయోజనం పొందొచ్చు. కాగా ఎఫ్‌డీలపై వడ్డీ రేటు అనేది టెన్యూర్ ప్రాతిపదికన మారుతుందని గుర్తించుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank news, FD rates, Fixed deposits, HDFC bank