Fixed Deposits | దేశంలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా తీపికబురు అందించింది. కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్‌లో (Bank) డబ్బులు (Money) దాచుకునే వారికి ప్రయోజనం కలుగనుంది. గతంలో కన్నా ఇకపై బ్యాంక్ కస్టమర్లకు అధిక రాబడి వస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు జనవరి 27 నుంచి అమలులోకి వచ్చింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు మొత్తంలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. రెగ్యులర్ కస్టమర్లకు అయితే 4.5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 5 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవచ్చు. తాజా రేట్ల పెంపు నేపథ్యంలో 15 నెలల నుంచి 2 ఏళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై గరిష్టంగా 7.15 శాతం వడ్డీ వస్తుంది. సాధారణ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.75 శాతం వడ్డీ వస్తుంది.
ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇక వారికి 2 రోజుల్లోనే అకౌంట్‌లోకి డబ్బులు!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్‌డీలపై 4.5 శాతం వడ్డీని అందిస్తోంది. 30 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై అయితే 5.25 శాతం వడ్డీ వస్తుంది. 46 రోజుల నుంచి 60 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.5 శాతం లభిస్తుంది. 61 రోజుల నుంచి 89 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 5.75 శాతం వస్తుంది. 90 రోజుల నుంచి 6 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 6.25 శాతం వడ్డీ ఉంది. 6 నెలల నుంచి 9 నెలల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది.
నిన్న భారీగా పడిపోయిన బంగారం ధర.. నేడు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
అలాగే బ్యాంక్ 9 నెలల నుంచి ఏడాది ఎఫ్‌డీలపై 6.65 శాతం వడ్డీని ఇస్తోంది. అలాగే ఏడాది నుంచి 15 నెలల ఎఫ్‌డీలపై అయితే 7 శాతం వడ్డీ ఉంది. 15 నెలల నుంచి రెండేళ్ల వరకు టెన్యూర్‌పై అయితే 7.15 శాతం వడ్డీ లభిస్తోంది. ఇక రెండేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7 రోజుల నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీలపై 0.5 శాతం అధిక వడ్డీ వస్తుంది. అలాగే ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై అయితే మరో 0.25 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, Banks, FD rates, Fixed deposits, Hdfc, HDFC bank, Interest rates, Money