HDFC Bank: డబ్బులు డిపాజిట్ చేసిన కస్టమర్లకు షాక్ ఇచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. బ్యాంకు తీసుకున్న ఓ నిర్ణయంతో కస్టమర్లకు నష్టం తప్పదు.

news18-telugu
Updated: August 28, 2020, 9:39 AM IST
HDFC Bank: డబ్బులు డిపాజిట్ చేసిన కస్టమర్లకు షాక్ ఇచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
HDFC Bank: డబ్బులు డిపాజిట్ చేసిన కస్టమర్లకు షాక్ ఇచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? అయితే మీకు షాకే. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. 91 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు వేర్వేరు కాలవ్యవధులపై అన్ని డిపాజిట్ వడ్డీ రేట్లలో కోత విధించింది. మారిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 25 నుంచే అమలులోకి వస్తాయని ప్రకటించింది. అంటే ఆగస్ట్ 24 వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ పొందినవారికి ఆగస్ట్ 25 నుంచి తక్కువ వడ్డీ వస్తుంది. మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఉంటే ఓసారి తాజా వడ్డీ రేట్లు చెక్ చేసుకోండి. మీరు అనుకున్న దానికన్నా తక్కువ వడ్డీ వస్తున్నా, ఇతర బ్యాంకుల్లో కాస్త ఎక్కువ వడ్డీ ఇస్తున్నా, మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌పై నిర్ణయం తీసుకోవచ్చు. మరి తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Pension Scheme: ఈ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నవారికి సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్... ఆ తర్వాత పెనాల్టీ తప్పదు

Work From Home Jobs: ఉద్యోగం లేదా? ఇంటి నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించండి ఇలా

HDFC Bank FD interest rates: సాధారణ ప్రజలకు రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇవే


7 నుంచి 14 రోజులు- 2.50%
15 నుంచి 29 రోజులు- 2.50%
30 నుంచి 45 రోజులు- 3%46 నుంచి 60 రోజులు- 3%
61 నుంచి 90 రోజులు- 3%
91 రోజుల నుంచి 6 నెలలు- 3.5%
6 నెలల 1 రోజు నుంచి 9 నెలలు- 4.4%
9 నెలల నుంచి 1 రోజు నుంచి 1 ఏడాది- 4.4%
1 ఏడాది- 5.10%
1 ఏడాది 1 రోజు నుంచి 2 ఏళ్లు- 5.10%
2 ఏళ్ల 1 రోజు నుంచి 3 ఏళ్లు- 5.15%
3 ఏళ్ల 1 రోజు నుంచి 5 ఏళ్లు- 5.30%
5 ఏళ్ల 1 రోజు నుంచి 10 ఏళ్లు- 5.50%

పైన వెల్లడించిన వడ్డీ రేట్లన్నీ సాధారణ ప్రజలకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లభిస్తాయి. సాధారణ ప్రజల కంటే వృద్ధులకు 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అంటే వారికి 3% నుంచి 6.25% వరకు వడ్డీ లభిస్తుంది. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్-MCLR 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.
Published by: Santhosh Kumar S
First published: August 28, 2020, 9:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading