హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC Bank క్రెడిట్ కార్డు లోన్.. క్షణాల్లో అకౌంట్‌లోకి డబ్బులు, ఇలా అప్లై చేసుకోండి!

HDFC Bank క్రెడిట్ కార్డు లోన్.. క్షణాల్లో అకౌంట్‌లోకి డబ్బులు, ఇలా అప్లై చేసుకోండి!

HDFC Bank క్రెడిట్ కార్డు లోన్.. క్షణాల్లో అకౌంట్‌లోకి డబ్బులు!

HDFC Bank క్రెడిట్ కార్డు లోన్.. క్షణాల్లో అకౌంట్‌లోకి డబ్బులు!

Credit Card Loan | మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే సులభంగానే క్రెడిట్ కార్డు లోన్ పొందొచ్చు. ఈ లోన్ డబ్బులు తక్షణమే అకౌంట్‌లోకి వచ్చేస్తాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

HDFC Loan | డబ్బులతో అవసరం పడిందా? స్నేహితులు లేదంటే బంధువులను అడిగితే రుణం లభించలేదా? పర్సనల్ లోన్ (Personal Loan) తీసుకోవాలని భావిస్తే.. ఎక్కువ రోజులు పడుతుందని యోచిస్తున్నారా? ఏం చేయాలో అర్థం కావడం లేదా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే క్రెడిట్ కార్డు లోన్. క్రెడిట్ కార్డు (Credit Card) వాడే వారు ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.

ప్రస్తుతం చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. క్రెడిట్ కార్డు వాడే వారు సులభంగానే లోన్ పొందొచ్చు. బ్యాంకులు అర్హత కలిగిన వారికి ప్రిఅప్రూవ్డ్ క్రెడిట్ కార్డు లోన్స్ ఆఫర్ చేస్తుంటాయి. ఈ తరహా రుణాలకు వెంటనే పొందొచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే ఈజీగా రుణం లభిస్తుంది.

ఇప్పుడు మనం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లోన్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం మూడు స్టెప్స్‌లోనే లోన్ పొందొచ్చు. ప్రాసెసింగ్ ఫీజు రూ. 999 ఉంటుంది. 12 నెలల నుంచి 60 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. లోన్ టెన్యూర్ పెరిగితే ఈఎంఐ తగ్గుతుంది. కానీ మీరు చెల్లించే వడ్డీ పెరుగుతుంది.

రూ.330 పొదుపుతో చేతికి రూ.14 లక్షలు.. ఈ 4 స్కీమ్స్‌తో భారీ లాభం!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారికి ప్రిఅప్రూవ్డ్ క్రెడిట్ కార్డు లోన్ ఆఫర్ ఉంటే.. నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. టెన్యూర్ ఎంచుకొని సబ్‌మిట్ చేస్తే.. డబ్బులు అకౌంట్‌లోకి వచ్చేస్తాయి. లేదంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ బారో సెక్షన్‌లోకి లోన్ అగెనెస్ట్ అసెట్ సెక్షన్‌లోకి వెళ్లాలి. ఇక్కడ మూడు స్టెప్స్ ఉంటాయి.

ఎస్‌బీఐ టాప్ 5 స్కీమ్స్.. రూ.లక్షకు రూ.10 లక్షల లాభం!

మీరు ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత క్రెడిట్ కార్డు నెంబర్‌లోని చివరి నాలుగు అంకెలు ఎటర్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. తర్వాతి పేజ్‌లో లోన్ ఆఫర్ కనిపిస్తుంది. లోన్ అమౌంట్ ఓకే చేసుకోవాలి. తర్వాత మరో ఓటీపీ వస్తుంది. దీన్న ఎంటర్ చేయాలి. ఇప్పుడు లోన్ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.

అయితే లోన్ తీసుకునే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లోన్ ప్రిక్లోజ్ లేదా ఫోర్ క్లోజ్ చేయాలంటే చార్జీలు పడతాయి. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకునే ముందు చార్జీలు చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం క్రెడిట్ కార్డు లోన్2పై వడ్డీ రేటు 11.88 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా 20.52 శాతం వరకు వడ్డీ పడొచ్చు. యావరేజ్ వడ్డీ రేటు 16.46 శాతం.

First published:

Tags: Banks, Credit cards, Hdfc, HDFC bank

ఉత్తమ కథలు