హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules: నవంబర్‌లో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే... మీ జేబుకు చిల్లు పెట్టేవి కూడా ఉన్నాయి

New Rules: నవంబర్‌లో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే... మీ జేబుకు చిల్లు పెట్టేవి కూడా ఉన్నాయి

New Rules: నవంబర్‌లో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే... మీ జేబుకు చిల్లు పెట్టేవి కూడా ఉన్నాయి
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules: నవంబర్‌లో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే... మీ జేబుకు చిల్లు పెట్టేవి కూడా ఉన్నాయి (ప్రతీకాత్మక చిత్రం)

New Rules | నవంబర్‌లో కొన్ని కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. అందులో కొన్ని సామాన్యుల జేబుకు చిల్లు పెట్టేవి కూడా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కొత్త నెల ప్రారంభం కాగానే కొత్త రూల్స్ అమలులోకి వస్తుంటాయి. నవంబర్‌లో కూడా కొన్ని కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. అందులో సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టే నియమనిబంధనలు కూడా ఉన్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర (LPG Gas Cylinder Price), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛార్జీలు, బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు, భారతీయ రైల్వే (Indian Railways) కొత్త రూల్... ఇలా పలు అంశాలకు సంబంధించి నవంబర్‌లో నియమనిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. మరి ఆ రూల్స్ మీపై ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోండి.

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్యాష్ డిపాజిట్ ఛార్జీలను సవరించింది. నవంబర్ 1 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత ప్రతీ రూ.1,000 కి రూ.3.5 ఛార్జీ చెల్లించాలి. ప్రతీ ట్రాన్సాక్షన్‌కు కనీసం రూ.50 ఛార్జీ చెల్లించాలి. మ్యాక్స్ అడ్వాంటేజ్ కరెంట్ అకౌంట్, అసెంట్ కరెంట్ అకౌంట్, యాక్టీవ్ కరెంట్ అకౌంట్, ప్లస్ కరెంట్ అకౌంట్, ప్రీమియం కరెంట్ అకౌంట్, రెగ్యులర్ కరెంట్ అకౌంట్, ఇ-కామర్స్ కరెంట్ అకౌంట్, ప్రొఫెషనల్ కరెంట్ అకౌంట్, అగ్రి కరెంట్ అకౌంట్, ఫ్లెక్సీ కరెంట్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఫర్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్, మర్చెంట్ అడ్వాంటేజ్ కరెంట్ అకౌంట్, మర్చెంట్ అడ్వాంటేజ్ ప్లస్ కరెంట్ అకౌంట్, అపెక్స్ కరెంట్ అకౌంట్, అల్టిమా కరెంట్ అకౌంట్, మ్యాక్స్ కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు ఛార్జీల విషయంలో ఎలాంటి మార్పులు లేవు.

IRCTC Tour: హైదరాబాద్ ఖజురహో టూర్ ... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

LPG Cylinder Price: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్ని ప్రతీ నెలా ఒకటో తేదీన సవరిస్తుంటాయి ఆయిల్ కంపెనీలు. నవంబర్ 1న గ్యాస్ సిలిండర్ ధర పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు.

BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నవంబర్ నుంచి 4జీ సేవల్ని ప్రారంభించనుంది. అంతేకాదు, 5జీ సేవల్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ నుంచి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Akasa Air: ఇటీవల కొత్తగా ప్రారంభమైన ఎయిర్‌లైన్స్ ఆకాశ ఎయిర్ నవంబర్ 1 నుంచి క్యాబిన్, కార్గో కంపార్ట్‌మెంట్లలో పెంపుడు జంతువుల్ని కూడా తీసుకెళ్లనుంది. ప్రయాణికులు ముందుగానే బుకింగ్ చేయాల్సి ఉంటుంది.

Bank Holidays: పండుగలు అయిపోయాయి... నవంబర్‌లో బ్యాంకులకు ఎన్ని సెలవులంటే

Railway Ministry: గూడ్స్ రవాణాకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తోంది భారతీయ రైల్వే . నవంబర్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. అన్ని రకాల వేగన్లకు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానుంది. మిలిటరీ ట్రాఫిక్, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయంలో మినహాయింపు ఉంటుంది.

First published:

Tags: HDFC bank, Indian Railways, Lpg Cylinder Price, New rules, Personal Finance, Railways

ఉత్తమ కథలు