హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో (HDFC Bank) అకౌంట్ ఉన్నవారికి అలర్ట్. పాన్ కార్డుకు (PAN Card) సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేసింది. ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి పాన్ కార్డ్ ముఖ్యమైన డాక్యుమెంట్. కాస్త భారీ స్థాయిలో జరిపే లావాదేవీలకు పాన్ కార్డ్ తప్పనిసరి. దీంతో బ్యాంక్ అకౌంట్లకు (Bank Account), ఆర్థిక లావాదేవీలకు, పాన్ కార్డుకు విడదీలేని బంధం ఉంటుంది. దీంతో మోసగాళ్లు పాన్ కార్డ్ అప్‌డేట్ చేయాలని మెసేజెస్ పంపి మోసాలు చేస్తున్నారు. పాన్ కార్డ్ వివరాలు అప్‌డేట్ చేయాలంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు ఇటీవల ఎస్ఎంఎస్‌లు ఎక్కువగా వస్తున్నట్టు బ్యాంకు దృష్టికి వచ్చింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది.
ఈ మోసం ఎలా జరుగుతుందంటే మొదట సైబర్ నేరగాళ్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ పేరుతో ఎస్ఎంఎస్ పంపిస్తారు. వెంటనే మీ పాన్ కార్డ్ నెంబర్ అప్‌డేట్ చేయాలని, లేకపోతే ఇ-కేవైసీ ఫెయిల్ అవుతుందని, అకౌంట్ కూడా బ్లాక్ అవుతుందన్నది ఆ మెసేజ్ సారాంశం. అంతేకాదు... పాన్ కార్డ్ వివరాలు అప్‌డేట్ చేయడానికి ఎస్ఎంఎస్‌లో లింక్స్ కూడా ఉంటాయి. ఒకవేళ కస్టమర్లు ఆ లింక్స్ క్లిక్ చేస్తే వారి అకౌంట్ వివరాలు, ఇతర వివరాలు అప్‌డేట్ చేయమని అడుగుతారు. వివరాలు అప్‌డేట్ చేస్తేనే లాక్ అయిన అకౌంట్‌ని అన్‌లాక్ చేయొచ్చని నమ్మిస్తారు. వివరాలన్నీ ఇచ్చేస్తే కస్టమర్ల అకౌంట్ ఖాళీ కావడం ఖాయం.
SBI Good News: ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
#GoDigitalGoSecure and never click on unknown links asking you to update your PAN card details.
Visit: https://t.co/UJ16AYZqG4#BankSafe #StaySafe #SecureBanking pic.twitter.com/eXn0LOoePN
— HDFC Bank (@HDFC_Bank) June 10, 2022
అకౌంట్ బ్లాక్ అవుతుందని ఎస్ఎంఎస్ వచ్చేసరికి కస్టమర్లు భయపడి తమ వివరాలన్నీ ఇచ్చేస్తే దారుణంగా మోసపోయే అవకాశాలు ఎక్కువ. అందుకే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో కస్టమర్లు తమ పాన్ కార్డ్ వివరాలు, అకౌంట్ వివరాలు ఎవరితో షేర్ చేయకూడదని కోరుతోంది. బ్యాంకు సిబ్బంది ఎవరూ మీ అకౌంట్ వివరాలను ఫోన్‌లో లేదా ఎస్ఎంఎస్ ద్వారా అడరగన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎస్ఎంఎస్‌లు అన్నీ 186161 లేదా HDFCBK/HDFCBN ఐడీల నుంచి వస్తాయి. ఇతర ఐడీల నుంచి వచ్చే ఎస్ఎంఎస్‌లను పట్టించుకోకూడదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పంపే లింక్స్ కూడా hdfcbk.io అఫీషియల్ డొమైన్‌తో ఉంటాయి.
LIC Policy: రోజుకు రూ.45 పొదుపు చేస్తే ఏటా రూ.36,000 రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే
ఒకవేళ మీ వివరాలు ఏవైనా అప్‌డేట్ చేయాల్సి ఉంటే మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి సంప్రదించాలి. లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hdfc, HDFC bank, PAN card, Personal Finance