Home /News /business /

FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన HDFC, బజాజ్ ఫైనాన్స్.. ప్రస్తుతం వీటిలో పెట్టుబడి పెట్టవచ్చా?

FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన HDFC, బజాజ్ ఫైనాన్స్.. ప్రస్తుతం వీటిలో పెట్టుబడి పెట్టవచ్చా?

హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల పెంపు.. ఇందులో పెట్టుబడి పెట్టొచ్చా? (ప్రతీకాత్మక చిత్రం)

హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల పెంపు.. ఇందులో పెట్టుబడి పెట్టొచ్చా? (ప్రతీకాత్మక చిత్రం)

FD Interest Rates: హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ బ్యాంకు 36 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.1 శాతం, 60 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ అందిస్తోంది.

ఇంకా చదవండి ...
కరోనా (Corona) తరువాత బ్యాంకులు (Banks) తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. దీంతో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా వడ్డీ రేట్లను (Interest Rates) సవరించాయి. ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై  (Fixed Deposits) వడ్డీ రేట్లను కొంతమేరకు తగ్గించాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో, వడ్డీ రేట్ల పెంపు ధోరణి పెరుగుతోంది. తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), బజాజ్ ఫైనాన్స్ సంస్థలు వడ్డీ రేట్లు పెంచాయి. పెంచిన వడ్డీ రేట్లు డిసెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

* వడ్డీ రేట్లు ఎంత పెరిగాయి?
హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ బ్యాంకు 36 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.1 శాతం, 60 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ అందిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే అదనంగా మరో 10 బేసిస్ పాయింట్లు పొందవచ్చు. గతంలో HDFC ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.05 శాతం వడ్డీ చెల్లించింది. తాజాగా దీన్ని 6.4 శాతానికి పెంచింది. బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance) కూడా వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. గతంలో 24 నెలల డిపాజిట్లపై బజాజ్ ఫైనాన్స్ 6.1 శాతం వడ్డీ చెల్లించగా.. తాజాగా దీన్ని 6.4 శాతానికి పెంచింది. 36 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గతంలో 6.5 శాతం వడ్డీ రేటు ఉండగా, తాజాగా 6.8 శాతం వడ్డీ అందిస్తోంది.

IRCTC SBI Credit Card: రైల్వే ప్రయాణికులకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్... బెనిఫిట్స్ ఇవే


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) డిసెంబరు 8న మానిటరీ పాలసీని సమీక్షించనుంది. దీనికి ముందుగానే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఫైనాన్షియల్ మార్కెట్లలో పోటీని తట్టుకునేందుకు పలు కంపెనీలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు మారుస్తూనే ఉంటాయి. నిధులు అవసరమైన సమయంలో ఎక్కువ వడ్డీ రేట్లను ఇవి ఆఫర్ చేస్తుంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ 15 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గించింది. పెట్టుబడిదారులు ఈ విషయాలను గమనించి తమకు సరిపోయే పెట్టుబడులను ఎంచుకోవడం మంచిది.

LIC Policy: రూ.60 లక్షల పైనే రిటర్న్స్ కావాలంటే... రోజూ రూ.41 పొదుపు చేస్తే చాలు


వీటిల్లో పెట్టుబడి పెట్టాలా?
పెట్టుబడిదారులు అత్యవసర నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉంచకూడదు. మధ్యలో నగదు ఉపసంహరించుకుంటే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు జరిమానాలు విధిస్తాయి. బ్యాంకులు అందించే వడ్డీరేట్ల కన్నా కార్పొరేట్, నాన్ బ్యాంకింగ్ సంస్థలు కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తాయి. కాబట్టి వీటిలో కొంతమేరకు పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Interest Rates: ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువ... రూ.1,00,000 దాచుకుంటే ఎంత వస్తుందంటే


ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ ఆదాయంపై స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న కాలంలో 60 నెలల కన్నా ఎక్కువ కాల పరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం అంత లాభదాయకం కాదు. ఇందులో పెట్టుబడి పెట్టేవారు ఆర్థిక అవసరాలు అంచనా వేసుకోవాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల మెచూరిటీ పూర్తయ్యే వరకు పెట్టుబడి ఉంచగలిగితేనే మంచి రాబడులు అందుకోగలుగుతారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:

Tags: Bajaj finance, Fixed deposits, HDFC bank, Interest rates

తదుపరి వార్తలు