హోమ్ /వార్తలు /బిజినెస్ /

Salary of CEOs: ఇండియన్ కార్పొరేట్ కంపెనీ సీఈవోల జీతం ఎంత ఉంటుంది..? ఎవరి జీతం ఎక్కువంటే..

Salary of CEOs: ఇండియన్ కార్పొరేట్ కంపెనీ సీఈవోల జీతం ఎంత ఉంటుంది..? ఎవరి జీతం ఎక్కువంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Salary of CEOs: ప్రస్తుతం దేశంలోని టాప్ టెక్ కంపెనీ సీఈఓల్లో ఎవరు ఎక్కువ జీతం లేదా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టాప్ కంపెనీల్లో ఉద్యోగం (JOB) సంపాదించడం చాలామంది కల. ఎందుకంటే అక్కడ జీతాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అవే కంపెనీల్లోని సీఈఓ (CEO)లకు (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) కూడా జీతాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. ప్రస్తుతం దేశంలోని టాప్ టెక్ కంపెనీ సీఈఓల్లో ఎవరు ఎక్కువ జీతం లేదా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసుకుందాం.


1. హెచ్‌సీఎల్ సీఈఓ విజయకుమార్
దేశంలోనే అత్యధిక వేతనం పొందుతున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నిలిచారు హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సి. విజయకుమార్. ఆయనకు 16.52 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.130 కోట్లు) పరిహారం లభించిందని కంపెనీ ఇటీవలి వార్షిక నివేదికలో పేర్కొంది. 2021లో విజయకుమార్ రూ.123.13 కోట్ల (16.52 మిలియన్ డాలర్లు) వేతనం పొందారు.


ఇందులో 2 మిలియన్ డాలర్లు మూల వేతనంగా, మరో 2 మిలియన్ డాలర్లు వేరియబుల్ పేగా ఉంది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఈ సీఈవో ఇంకా $0.02 మిలియన్లతో పాటు ఇతర ప్రయోజనాలను పొందారు. $12.50 మిలియన్ల LTI (దీర్ఘకాలిక ప్రోత్సాహకం)తో ఆయన మొత్తం వేతనం $16.52 మిలియన్లకు చేరుకుంది.


2. విప్రో సీఈఓ థియరీ డెలాపోర్ట్

విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థియరీ డెలాపోర్ట్ 2021-22లో వార్షిక వేతనంగా 10.5 మిలియన్ డాలర్లు అందుకున్నారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.80 కోట్లు. 2020 జులైలో ఆయన కంపెనీ CEOగా నియమితులయ్యారు.


3. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్

ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.71.02 కోట్లు జీతంగా అందుకున్నారు. కంపెనీ వాటాదారులు పరేఖ్ పదవీకాలాన్ని 2027 వరకు, అంటే ఐదేళ్లపాటు పొడిగించే ప్రతిపాదనను ఆమోదించారు. ఆయన ప్యాకేజీని రూ.79.75 కోట్లకు పెంచారు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. 2021-22లో పరేఖ్ వేతనంలో రూ. 5.69 కోట్లు బేసిక్ శాలరీ, రూ. 0.38 కోట్ల రిటైరల్ బెనిఫిట్స్, రూ. 12.62 కోట్ల బోనస్ అండ్ ఇన్సెంటివ్స్, రూ. 52.33 కోట్ల పర్క్విసిట్స్ రూపంలో ఉన్నాయి.


4. టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ

టెక్ మహీంద్రా సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీపీ గుర్నానీ 2021-22 మధ్య కాలంలో రూ.63.4 కోట్లు వేతనంగా పొందారు. ఇది ఇయర్ - టూ - ఇయర్ బేసిస్‌లో 189 శాతం పెరుగుదల. టెక్ మహీంద్రా వార్షిక నివేదిక ప్రకారం.. శాలరీలో జీతంతో పాటు స్టాక్ పరిహారం ప్రయోజనాలు, ఒక సంవత్సర కాలానికి ఉద్యోగానంతర ప్రయోజనాలు కలిసి ఉంటాయి.


5. టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ అండ్ ఎండీ రాజేష్ గోపీనాథన్ జీతంలో 26.6 శాతం పెరుగుదల కనిపించింది. 2021-22 కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.25.75 కోట్ల రెమ్యునరేషన్ ఆయన చేతికి వచ్చింది.


ఇది కూాడా చదవండి : కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచిందా..? ఆ లెటర్ నిజమైనదేనా?


జూన్‌లో విడుదలైన డెలాయిట్ ఇండియా సర్వే ప్రకారం.. సీఈఓల రెమ్యునరేషన్ కరోనా ముందు నాటి స్థాయిలను మించిపోయింది. సగటు సీఈఓ మొత్తం వేతనం రూ.10 కోట్ల మార్కును దాటిన మొదటి సర్వే ఇదే. గత ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీలో నమోదైన టాప్-50 కంపెనీల సీఈఓల సగటు వేతనం ఇయర్ -టూ-ఇయర్ బేసిస్ ప్రకారం.. 22 శాతం పెరిగి, రికార్డు స్థాయిలో రూ.28.4 కోట్లకు చేరుకుంది. CNBC-TV18 నివేదిక ప్రకారం.. 2017-18 , 2019-20 మధ్య ఇది ​​సగటున రూ. 17-18 కోట్లుగా ఉంది. ప్రొఫెషనల్స్‌గా నడిచే కంపెనీలు మాత్రమే కాకుండా, JSW స్టీల్, దివీస్ లాబొరేటరీస్‌ వంటి ప్రమోటర్ల నేతృత్వంలో నడిచే సంస్థలు కూడా రూ.140 కోట్ల పరిహారం పొందాయని నివేదిక పేర్కొంది.

First published:

Tags: Ceo, Hcl, Infosys, TCS, Tech Mahindra, Wipro

ఉత్తమ కథలు