హోమ్ /వార్తలు /బిజినెస్ /

FD: డబ్బులు దాచుకునే వారికి మరో కొత్త స్కీమ్.. చేరితే భారీ లాభం!

FD: డబ్బులు దాచుకునే వారికి మరో కొత్త స్కీమ్.. చేరితే భారీ లాభం!

డబ్బులు దాచుకునే వారికి మరో కొత్త స్కీమ్.. చేరితే భారీ లాభం!

డబ్బులు దాచుకునే వారికి మరో కొత్త స్కీమ్.. చేరితే భారీ లాభం!

FD Rates | బ్యాంకుల్లో ఎఫ్‌డీ అకౌంట్ తెరవాలని భావించే వారికి లేదంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో చేరాలని యోచించే వారికి అలర్ట్. తాజాగా ఒక కంపెనీ కొత్త ఎఫ్‌డీ స్కీమ్ తెచ్చింది. ఇందులో చేరితే అధిక రాబడి పొందొచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Fixed Deposit | ఇంట్లో డబ్బులు ఉన్నాయా? వీటిని ఎక్కడైనా దాచుకోవాలని చూస్తున్నారా? బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD Rates) చేయాలని యోచిస్తున్నారా? లేదంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో (Small Saving Schemes) ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే కొత్త స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. హాకిన్స్ కుక్కర్లు అనే కంపెనీ తాజాగా కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ ఎఫ్‌డీ పథకం సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి వచ్చింది.

  గృహోపకరణాల తయారీ సంస్థ అయిన హాకిన్స్ కుక్కర్లు తీసుకువచ్చిన ఈ కొత్త ఎఫ్‌డీ స్కీమ్ టెన్యూర్ 13 నెలల నుంచి ప్రారంభం అవుతుంది. అంటే కస్టమర్లు కనీసం 13 నెలల కాల పరిమితితో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 36 నెలల వరకు డబ్బులు దాచుకోవచ్చు. అంటే ఎఫ్‌డీ చేయొచ్చు. ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు ఎక్కువగానే ఉంది. బ్యాంకుల కన్నా అధిక వడ్డీ రేటు లభిస్తోందని చెప్పుకోవచ్చు. 7.5 శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీ వస్తుంది.

  లోన్ ఈఎంఐ వరుసగా 3 నెలలు కట్టకపోతే ఏమౌతుంది? బ్యాంకులు ఏం చేస్తాయంటే?

  డబ్బులు దాచుకోవాలని భావించే వారు హాకిన్స్ కుక్కర్లు వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎఫ్‌డీ అకౌంట్ తెరవొచ్చు. 13 నెలల టెన్యూర్ ఎంచుకుంటే వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుంది. అదే 24 నెలల టెన్యూర్ అయితే 7.75 శాతంగా వడ్డీ వస్తుంది. అలాగే 36 నెలల ఈఎంఐ అయితే వడ్డీ 8 శాతంగా ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు కనీసం రూ. 25 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

  రైతుల కోసం స్పెషల్ లోన్ స్కీమ్.. వెంటనే రూ.50 వేలు పొందొచ్చు!

  కంపెనీ అందిస్తున్న ఈ ఎఫ్‌డీ స్కీమ్ ఆకర్షణీయంగా ఉంది. ఎందుకంటే అధిక వడ్డీ రేట్లు ఇందుకు కారణం. అయితే కార్పొరేట్ ఎఫ్‌డీలు అనేవి బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా కొంచెం తక్కువ భద్రత కలిగి ఉంటాయి. అయితే ఈ కంపెనీకి ఎంఏఏ స్టేబుల్ గ్రేడ్ రేటింగ్ ఉంది. అందువల్ల డబ్బులు పెట్టే వారు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్టర్లు అన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాతనే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. ఇకపోతే గత కొన్ని నెలలుగా చూస్తే ఈ కంపెనీ ఆఫర్ చేస్తున్న ఎఫ్‌డీ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. గతంలో 10 శాతానికి పైగా వడ్డీ వచ్చేది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచుకుంటూ వస్తున్నా కూడా ఈ కంపెనీ మాత్రం ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను మాత్రం పెంచడం లేదు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Banks, FD rates, Fixed deposits, Money, Personal Finance

  ఉత్తమ కథలు