నోట్ల రద్దు చేదు గుర్తులే ఇవన్నీ: మన్మోహన్ సింగ్

‘ఎలాంటి గాయాన్నైనా మాన్పించే శక్తి కాలానికి ఉందంటారు. కానీ, నోట్ల రద్దు అలా కాదు. కాలం గడిచేకొద్దీ ఆ గాయం మరింత స్పష్టంగా కనపడుతుంది.’ అని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: November 8, 2018, 7:39 PM IST
నోట్ల రద్దు చేదు గుర్తులే ఇవన్నీ: మన్మోహన్ సింగ్
మోడీ, మన్మోహన్ (ఫైల్ ఫొటోలు)
news18-telugu
Updated: November 8, 2018, 7:39 PM IST
నోట్ల రద్దు రెండో వార్షికోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ దారుణ పరిస్థితులు, నాటి నోట్ల రద్దుకు చేదు గుర్తులేనని ఆయన అన్నారు. ‘నోట్ల రద్దు ఓ అనాలోచిత, దురదృష్టకర చర్య’గా అభివర్ణించారు మన్మోహన్ సింగ్. నోట్ల రద్దులాంటి స్వల్పకాలిక నిర్ణయాలతో దేశ ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందన్నారు. ‘ఎకనామిక్ పాలసీలు అనేవి దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. గట్టి ఆలోచన, శ్రద్ధతో నిర్ణయాలు తీసుకోవాలి. అలా చేయకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింటుందో చెప్పడానికి ఈ రోజు (నోట్ల రద్దు చేసిన రోజు) ఓ ఉదాహరణ.’అని అన్నారు. ‘నోట్ల రద్దు వల్ల దేశంలో ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. జాతి, మతం, కులం, లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇబ్బందిపడ్డారు.’ అని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలని సూచించారు. ‘ఎలాంటి గాయాన్నైనా మాన్పించే శక్తి కాలానికి ఉందంటారు. కానీ, నోట్ల రద్దు అలా కాదు. కాలం గడిచేకొద్దీ ఆ గాయం మరింత స్పష్టంగా కనపడుతుంది.’ అని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.

First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...