కెరీర్లో గ్రోత్ కోసం ఉద్యోగాలు మారడం ఎవరికైనా అవసరమే. ఏడాదికో రెండేళ్లకో ఓసారి జాబ్ మారుతుంటూ ఉంటారు. చేరిన ప్రతీ సంస్థలో ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడం, మరో కంపెనీకి మారగానే అక్కడ కూడా ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఉద్యోగులకు అలవాటే. ఇలా ప్రతీ కంపెనీలో ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. తమ పాత ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేసిన డబ్బుల గురించి పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల నష్టపోతూ ఉంటారు. అందుకే ఒకే యూఏఎన్ నెంబర్లపై ఈపీఎఫ్ అకౌంట్ కొనసాగించే అవకాశం కల్పిస్తోంది కంపెనీ. అంటే మీరు ఎన్ని కంపెనీలు మారినా ఒకే యూఏఎన్ నెంబర్లలో వేర్వేరు పాస్‌బుక్స్ ఉంటాయి. వేర్వేరు కంపెనీల్లో జమ చేసిన మొత్తాన్ని కూడా మెర్జ్ చేసి ఒకే పాస్‌బుక్‌లో చేర్చొచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ అకౌంట్లను మెర్జ్ చేయాల్సి ఉంటుంది.
ఈపీఎఫ్ అకౌంట్స్ మెర్జ్ చేయకుండా పాత అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగం మారిన తర్వాత పాత అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. పాత కంపెనీ తప్పనిసరిగా మీ ఈపీఎఫ్ అకౌంట్లో ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎగ్జిట్ డేట్ లేకపోతే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడం అంత సులువు కాదు. ఒక్కోసారి కంపెనీలు ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయడం మర్చిపోతుంటాయి. దీంతో సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొంది. ఈపీఎఫ్ ఖాతాదారులే ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసే అవకాశం కల్పిస్తోంది. అంటే ఈపీఎఫ్ ఖాతాదారులు కంపెనీపై ఆధారపడకుండా తామే ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయొచ్చు.
PF Withdrawal Rule: ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక్క రోజులో రూ.1,00,000 అడ్వాన్స్
SBI Scheme: ఎస్బీఐలో ఈ స్కీమ్‌లో చేరండి... ప్రతీ నెలా డబ్బులు పొందండి
గతంలో కంపెనీలు మాత్రమే జాయినింగ్ డేట్, ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ ఖాతాదారులు తామే స్వయంగా జాయినింగ్ డేట్, ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయొచ్చు. ఉద్యోగి తాము జాబ్ మానేసిన రోజునే డేట్ ఆఫ్ ఎగ్జిట్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎంటర్ చేయొచ్చు. మరి ఈపీఎఫ్ అకౌంట్లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకోండి.
ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. యూఏఎన్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత Manage పైన క్లిక్ చేయాలి. Mark Exit ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. డ్రాప్‌డౌన్‌లో ఎంప్లాయ్మెంట్ పైన క్లిక్ చేయాలి. మీ యూఏఎన్ అకౌంట్ నెంబర్‌కు లింక్ అయిన పాత పీఎఫ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయాలి. ఉద్యోగం వదిలిపెట్టడానికి గల కారణాన్ని వివరించాలి. ఆ తర్వాత Request OTP పైన క్లిక్ చేయాలి. ఈపీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి OK క్లిక్ చేస్తే చాలు.
SBI New Account: ఎస్బీఐలో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే కస్టమర్లకు ఎక్కువ లాభం
EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌ను తక్కువ అంచనా వేయొద్దు... కోటీశ్వరులు కావొచ్చు ఇలా
ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసేముందు ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఒకసారి ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసిన తర్వాత ఎడిట్ చేసే అవకాశం ఉండదు. మీరు ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయాలంటే ఉద్యోగం మానేసిన రెండు నెలల వరకు వేచి ఉండాలి. యజమాని చివరి కంట్రిబ్యూషన్ జమ అయిన రెండు నెలల తర్వాతే ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Personal Finance