హోమ్ /వార్తలు /బిజినెస్ /

Income Tax Intimation Letter: ఇన్ కం ట్యాక్స్ నుంచి ఇంటిమేషన్ లెటర్ వచ్చిందా.. వస్తే ఈ అంశాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి !

Income Tax Intimation Letter: ఇన్ కం ట్యాక్స్ నుంచి ఇంటిమేషన్ లెటర్ వచ్చిందా.. వస్తే ఈ అంశాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి !

 ఇన్ కం ట్యాక్స్ నుంచి ఇంటిమేషన్ లెటర్ వచ్చిందా.. వస్తే  ఈ అంశాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి !

ఇన్ కం ట్యాక్స్ నుంచి ఇంటిమేషన్ లెటర్ వచ్చిందా.. వస్తే ఈ అంశాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి !

2022-2023 అసెస్‌మెంట్‌ ఇయర్‌కి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్‌(ITR Filing)ను ఫైల్ చేసిన వారు, దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ ఇంటిమేషన్‌ లెటర్‌(Letter)ను అందుకుంటారు.

ఆదాయ పన్ను రిటర్న్‌(ITR)లను ఫైల్ చేయడానికి చివరి తేదీ 2022 జులై 31 వరకు అవకాశం ఉంది. చివరి నిమిషం వరకు ఆలస్యం చేయవద్దని, ప్రక్రియను సజావుగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 2022-2023 అసెస్‌మెంట్‌ ఇయర్‌కి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసిన వారు, దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్యాక్స్(Tax) డిపార్ట్‌మెంట్ నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ ఇంటిమేషన్‌ లెటర్‌ను అందుకుంటారు. పన్ను చెల్లింపుదారులకు వారి ITRలను ప్రాసెస్ చేసిన తర్వాత ఇంటిమేషన్‌ లెటర్‌(Letter)ను పంపుతారు. ట్యాక్స్ పేయర్స్ తమ ఐటీఆర్‌ను వెరిఫై చేసిన తర్వాత ఆదాయ పన్ను రిటర్న్‌ల ప్రాసెసింగ్ జరుగుతుంది.

ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 143(1) ప్రకారం పన్ను చెల్లింపుదారుకి చెందిన రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్‌కి డిపార్ట్‌మెంట్ ఇన్‌కమ్ టాక్స్ ఇంటిమేషన్‌ నోటీసును పంపుతుంది. డిపార్ట్‌మెంట్ పన్ను చెల్లింపుదారుకి ఇంటిమేషన్‌ నోటీసు పంపినట్లు తెలియజేస్తూ ఓ మెసేజ్‌ను కూడా పంపుతుంది.

2021 ఏప్రిల్ 1 నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ ఇంటిమేషన్‌ నోటీసు జారీ చేసే కాల పరిమితిని మూడు నెలలకు సవరించారు. పన్ను నిబంధనల ప్రకారం.. ఐటీఆర్‌ అందించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 9 నెలలలోపు డిపార్ట్‌మెంట్ ఇంటిమేషన్‌ నోటీసును పంపాలి. ఉదాహరణకు ఎవరైనా ఇప్పుడు తమ ఐటీఆర్‌ని వెరిఫై చేస్తే.. వారు ఈ నోటీసును స్వీకరించే చివరి తేదీ 2023 డిసెంబర్ 31 (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి తేదీ నుంచి తొమ్మిది నెలలు, అంటే 2023మార్చి 31).

ఈ రోజుల్లో పన్ను శాఖ చాలా త్వరగా మార్చి 31 నోటీసును పంపుతుంది. కొన్నిసార్లు ఐటీఆర్‌ దాఖలు చేసిన కొన్ని గంటల తర్వాత కూడా పంపే సూచనలు ఉన్నాయి. ఐటీఆర్‌లో పన్ను చెల్లింపుదారు ఇచ్చిన ఆదాయ పన్ను లెక్కింపు, డిపార్ట్‌మెంట్ తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా చేసిన లెక్కతో సరిపోలుతుందా? లేదా? అనే వివరాలను ఇంటిమేషన్ నోటీసు(Notice) అందిస్తుంది. ఐటీఆర్‌ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు, డిపార్ట్‌మెంట్ ఏవైనా లోపాలు ఉన్నాయా అనేది పరిశీలిస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత సమాచారం పంపుతారు. పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం, పన్ను చెల్లింపుదారులు ఇంటిమేషన్ నోటీసును జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది.

ఆదాయ పన్ను శాఖ చేసిన ఐటీఆర్‌ ప్రాసెసింగ్ అంతిమంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ను వెరిఫై చేసిన తర్వాత మాత్రమే పన్ను విభాగం ప్రాథమిక తనిఖీ చేస్తుంది. భవిష్యత్తులో మరింత సమాచారం కోరుతూ డిపార్ట్‌మెంట్ మరొక సెక్షన్ కింద నోటీసు పంపవచ్చు.

ఇదీ చదవండి:  Twitter Spaces: ట్విట్టర్ యూజర్స్ కు అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్.. వాళ్లకు మాత్రమే!



ఇంటిమేషన్‌ నోటీస్‌లో ఏముంటుంది?

పన్ను చెల్లింపుదారులు ఇంటిమేషన్‌ నోటీస్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందులో ఆదాయ వివరాలు, క్లెయిమ్(Claim) చేసిన డిడక్షన్స్‌, డిపార్ట్‌మెంట్ అసెస్‌మెంట్‌లతో లెక్కలు సరిపోతున్నాయా? లేదా? అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌లో ఏదైనా ఆదాయాన్ని పేర్కొనడంలో విఫలమైనప్పుడు లేదా తప్పుగా డిడక్షన్‌ను క్లెయిమ్ చేసిన సందర్భంలో.. ఇంటిమేషన్‌ నోటీస్‌ అదనపు పన్ను డిమాండ్‌ను చేయవచ్చు. పన్ను చెల్లింపుదారుడు అదనపు పన్నులు చెల్లిస్తే, వారికి చెల్లించాల్సిన రీఫండ్ గురించి ఇంటిమేషన్‌ నోటీసులో పేర్కొనవచ్చు.

ఆదాయ పన్ను ఇంటిమేషన్‌ లెటర్‌ పాస్‌వర్డ్

ఇన్‌కమ్ ట్యాక్స్ ఇంటిమేషన్‌ లెటర్‌ను ఓపెన్‌ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం అవుతుంది. స్మాల్‌కేస్‌లో పాన్‌ నంబర్‌, ఆ తర్వాత DDMMYYY ఫార్మాట్‌లో పుట్టిన తేదీని ఎంటర్‌ చేయాలి.

First published:

Tags: Income tax, ITR Filing, Letter, Tax payers

ఉత్తమ కథలు