హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tax Refund: మీకు ఇంకా ట్యాక్స్ రీఫండ్ రాలేదా.. అయితే ఇలా చేశారంటే వెంటనే రిఫండ్ అవుతుంది !

Tax Refund: మీకు ఇంకా ట్యాక్స్ రీఫండ్ రాలేదా.. అయితే ఇలా చేశారంటే వెంటనే రిఫండ్ అవుతుంది !

 మీకు ఇంకా ట్యాక్స్ రీఫండ్ రాలేదా.. అయితే ఇలా చేశారంటే వెంటనే రిఫండ్ అవుతుంది !

మీకు ఇంకా ట్యాక్స్ రీఫండ్ రాలేదా.. అయితే ఇలా చేశారంటే వెంటనే రిఫండ్ అవుతుంది !

కట్టాల్సిన ట్యాక్స్(Tax) కంటే మీరు ఎక్కువ కట్టినట్లయితే.. మీ ట్యాక్స్ రీఫండ్(Refund) స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ద్వారా లేదా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) ఇ-గవర్నెన్స్ వెబ్‌సైట్ tin.tin.nsdl.comలో చెక్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చెల్లించాల్సిన అసలు పన్ను మొత్తం (Tax Amount) కంటే ఎక్కువ చెల్లిస్తే ట్యాక్స్ రీఫండ్‌ (Tax Refund)ను పొందవచ్చు. ఈ రీఫండ్‌ను పొందాలనుకునేవారు ఆదాయ పన్ను రిటర్న్ (ITR) సకాలంలో దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే గత నెలలో తమ ఐటీఆర్‌ను దాఖలు చేసిన వారు ఇప్పటికే తమ ట్యాక్స్ రీఫండ్‌ను అందుకున్నారు. ఇంకా ఐటీఆర్ రీఫండ్ అందని వారి జాబితాలో మీరు కూడా ఉంటే.. ఆలస్యమైన రీఫండ్ గురించి ముఖ్య విషయాలు తెలుసుకునే మార్గాలున్నాయి. కట్టాల్సిన ట్యాక్స్ కంటే మీరు ఎక్కువ కట్టినట్లయితే.. మీ ట్యాక్స్ రీఫండ్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ద్వారా లేదా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) ఇ-గవర్నెన్స్ వెబ్‌సైట్ tin.tin.nsdl.comలో చెక్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

రీఫండ్ స్టేటస్ చెక్ చేయండిలా

స్టెప్ 1: ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ https://eportal.incometax.gov.in/iec/foservices/#/loginలో మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వాలి.

స్టెప్ 2: ఆపై 'ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్' ఆప్షన్ సెలెక్ట్ చేసి, 'వ్యూ ఫైల్డ్‌ రిటర్న్స్‌'పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: లేటెస్ట్‌గా ఫైల్ చేసిన ITR చెక్ చేయాలి.

స్టెప్ 4: అనంతరం 'వ్యూ డీటెయిల్స్' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అది ఫైల్ చేసిన ITR స్టేటస్‌ను డిస్‌ప్లే చేస్తుంది. ఆ తర్వాత 'స్టేటస్ ఆఫ్ ట్యాక్స్ రిఫండ్స్' ట్యాబ్‌పై నొక్కాలి. అప్పుడు పేమెంట్ మోడ్, రిఫరెన్స్ నంబర్, స్టేటస్, రీఫండ్ తేదీ వివరాలను అందించే ఒక మెసేజ్ కనిపిస్తుంది. అందులో మీరు ట్యాక్స్ రీఫండ్ తేదీని చెక్ చేసుకోవచ్చు.

పాన్ కార్డుతో రీఫండ్ స్టేటస్ చెక్ ఇలా

tin.tin.nsdl.com వెబ్‌సైట్‌లో ట్యాక్స్ రిఫండ్ చెక్ చేయాలంటే పాన్ (PAN) కార్డు నంబర్ ఎంటర్ చేసి సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఫారమ్ 26ASలోని 'పన్ను క్రెడిట్ స్టేట్‌మెంట్స్'లో కూడా 'రీఫండ్ పెయిడ్' స్టేటస్ చెక్ చేయవచ్చు. ITRను ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు ఎంచుకున్న ఎంపిక ప్రకారం రీఫండ్ అనేది ఎలక్ట్రానిక్ మోడ్ అంటే నేరుగా ఖాతాకు క్రెడిట్(Credit) అవుతుంది లేదా రీఫండ్ చెక్కు అందుతుంది.

ఇదీ చదవండి: Airlines Fares: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ఫ్లయిట్ చార్జీలు.. ఎప్పటినుంచంటే !


 ITR రిఫండ్ స్టేటస్‌లో కనిపించే రకాలు ఏంటి?

- ప్రాసెస్డ్‌

రిటర్న్ విజయవంతంగా ప్రాసెస్ అయినప్పుడు ప్రాసెస్డ్‌ అని స్టేటస్‌లో కనిపిస్తుంది.

సబ్‌మిటెడ్ అండ్ పెండింగ్‌ ఫర్ ఈ-వెరిఫికేషన్/వెరిఫికేషన్

పన్ను చెల్లింపుదారు ఐటీఆర్‌ని దాఖలు చేసినా, దానిని ఇ-వెరిఫికేషన్ చేయకపోతే లేదా CPC వద్ద సక్రమంగా సంతకం చేసిన ITR-V ఇంకా ఐటీ డిపార్ట్‌మెంట్‌కి అందకపోతే ఈ స్టేటస్ కనిపిస్తుంది.

సక్సెస్‌ఫుల్లీ ఈ-వెరిఫైడ్/వెరిఫైడ్

ఐటీ రిటర్న్‌ విజయవంతంగా ఇ-వెరిఫైడ్/వెరిఫైడ్ అయిందని సూచించే స్టేటస్ ఇది. రిటర్న్ ఇంకా ప్రాసెస్ చేయలేదని ఈ స్టేటస్ అర్థం.

- డిఫెక్టివ్

ఫైల్ చేసిన రిటర్న్‌లో లోపాన్ని డిపార్ట్‌మెంట్ గుర్తించే స్టేటస్ ఇది.

- ఎక్స్‌పైర్డ్

ఈ స్టేటస్ ఉంటే 90 రోజుల చెల్లుబాటు వ్యవధిలోపు రీఫండ్ కోసం క్లెయిమ్ చేయలేదని లేదా అందలేదని అర్థం. ఇలాంటప్పుడు రీఫండ్ రీ-ఇష్యూ అభ్యర్థనను పెంచవచ్చు.

పైన పేర్కొన్న స్టేటస్‌ల ఆధారంగా మీకు రీఫండ్ ఎందుకు రాలేదో అర్థం చేసుకోవచ్చు. రిటర్న్ ఎలక్ట్రానిక్‌గా ఫైల్ చేస్తే... రీఫండ్ రీఇష్యూ కోసం ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేసి రీఫండ్ కోసం ఆన్‌లైన్‌లోనే అభ్యర్థించవచ్చు.

First published:

Tags: Bank, ITR Filing, PAN, Tax payers

ఉత్తమ కథలు